అన్వేషించండి

Motorcycle, Scooter, Moped Difference: మోటార్ సైకిల్‌, స్కూటర్, మోపెడ్‌ మధ్య ఉన్న తేడా ఏంటీ? ఏ అవసరాలకు ఏది సరిపోతుంది?

Motorcycle, Scooter, Moped Difference:సాధారణంగా భారతీయ వాడుక భాషలో బైక్, మోటార్ సైకిల్ అనే పదాలు ఒకే అర్థంలో ఉపయోగిస్తారు.

Motorcycle, Scooter, Moped Difference: భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో రవాణా వ్యవస్థకు టూ వీలర్లు వెన్నుముక వంటివి. ప్రతి ఇంటి అవసరానికి, ప్రతి యువకుడి ఆశయానికి,, ప్రతి వ్యాపారి కష్టానికి ఒక టూవీలర్ తోడు ఉంటుంది. అయితే మార్కెట్‌లో ఉన్న వందలాది మోడళ్లలో మోటార్ సైకిల్‌, స్కూటీ, మోపెడ్ మధ్య ఉన్న తేడాలను గుర్తించడం సామాన్య వాహనదారుడికి తరుచూ గందరగోళంగానే ఉంటుంది. డిజైన్, ఇంజిన్ సామర్థ్యం, వేగం, చట్టపరమైన నిబంధనల పరంగా ఈ వాహనాల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాలను  ఇక్కడ తెలుసుకుందాం

మెటార్‌ సైకిల్‌ , బైక్‌ తేడా ఏంటీ

సాధారణంగా భారతీయ వాడుక భాషలో బైక్, మోటార్ సైకిల్ అనే పదాలు ఒకే అర్థంలో ఉపయోగిస్తారు. సాంకేతికంగా చూస్తే ఇవి మాన్యువల్ గేర్లు కిగిన శక్తిమంతమైన వాహనాలు. వీటికి ప్రధానంగా స్టెప్‌ ఓవర్‌ ఫ్రేమ్‌డిజైన్‌ చేస్తారు. అంటే వాహనం ఎక్కడానికి కాలు పైకి ఎత్తి వేయాల్సి ఉంటుంది. 

ఇవి సాధారణంగా 100మమ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్లతో వస్తాయి. ఇవి గంటలకు 75 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. దీని వల్ల హైవేలపై, సుదీర్ఘ ప్రయాణాలకు ఇవి అత్యంత అనువైనవి. వీటిలో చక్రాల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ఇది రఫ్‌ రోడ్లపై, గుంతల్లో ప్రయాణించేటప్పుడు వాహనానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. బైక్‌లు సాధారణంగా లీటర్‌కు 50 నుంచి 70 కిలోమీట్ల మైలేజీని అందిస్తాయి. హీరో స్ప్లెండర్‌, బజాజ్‌ పల్సర్‌ వంటి మోడళ్లు ఈ విభాగంలోకి వస్తాయి.  వీటి మెయింటెనెన్ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కస్టమైజేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. హైస్పీడ్‌ వద్ద ఇవి స్టేబుల్‌గా ఉన్నా, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 

స్కూటీ అంటే ఏంటీ?

భారత్‌లో స్కూటీ అనేది ఒకప్పుడు ఒక బ్రాండ్‌ పేరు. అయినప్పటికీ ఇప్పుడు అది గేర్‌లెస్‌ స్కూటర్లన్నింటికీ పర్యాయపదంగా మారిపోయింది. నగరాల్లో ట్రాఫిక్ పెరగడంతో క్లచ్‌, గేర్ల తిప్పలు లేని స్కూటర్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అర్బన్ ఏరియాల్లో స్కూటర్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అర్బన్ ఏరియాల్లో స్కూటర్లు 70 శాతం మార్కెట్‌లో వాటాను కలిగి ఉన్నాయి. కాలు పైకి ఎత్తాల్సిన అవసరం లేకుండానే కూర్చోవచ్చు. చిన్న చక్రాలు ఉండం వల్ల సిటీ ట్రాఫిక్‌కు అనుకూలంగా ఉంటాయి. ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తాయి. అంటే యాక్సిలరేటర్ ఇస్తే సరిపోతుంది. సీటు కింద ఉండే విశాలమైన స్టోరేజ్‌ స్పేస్‌ కుటుంబ అవసరాలకు సరిపోతుంది. ఆఫీస్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇవి 50సీసీ నుంచి 250 సీసీ వరకు వివిధ సామర్థ్యాల్లో లభిస్తాయి. హోండా యాక్టివా, టీవీఎస్‌ జూపిటర్ వంటివి వీటికి ఉదాహరణలు. 

మోపెడ్‌ అంటే ఏంటీ?

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని ఆశించే వారికి మోపెడ్‌ ఒక అద్భుతమైన వరం. మోటార్, పెడల్‌ అనే పదాల అద్భుత కలయిక నుంచే మోపెడ్ అనే పేరు వచ్చింది. ఒకప్పుడు వీటికి పెడల్స్ ఉండేవి, కానీ ఆధునిక మోపెడ్లు కేవలం ఇంజిన్ శక్తితోనే నడుస్తున్నాయి. మోపెడ్లు లీటర్‌కు 70 నుంచి 100 కిలోమీటర్ల  మైలేజీని అందిస్తాయి. ఇవి సాధారణంగా 50 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉండి, గంటకు 25-30 మైళ్ల తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి కేవలం నగర ప్రయాణాలకు, సరకు రవాణాకు మాత్రమే పరిమితం అవుతాయి. హైవేలపై అనుమతించరు. వీటి ఖర్చు చాలా తక్కువ. ఇండియాలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ సిరీస్‌ మోపెడ్లు బాగా ప్రజాదరణ పొందాయి. 

ఎవరికి ఏ వాహనం మంచిది?

దూర ప్రయాణాలు చేసే వారికి 100 సీసీ పైన ఉండే మోటార్ సైకిల్‌ అవసరం అవుతుంది. సిటీ ట్రాఫిక్‌, షాపింగ్, సులభమైన డ్రైవింగ్ కోసం ఆటోమాటిక్ స్కూటర్‌ సరైన ఎంపిక. తక్కువ బడ్జెట్‌, భారీ మేలేజీ అవసరమైన వారికి మోపెడ్ ఉత్తమమని చెప్పవచ్చు.  

భారత్‌లో రిజిస్ట్రేషన్ అవసరం లేని వాహనాలు ఉన్నాయా?

మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం కొన్ని నిబంధనలు ఫ్రేమ్ చేశారు. అందులో గేర్లు లేని వాహనాలు నడపడానికి 16 ఏళ్లు నిండిన వారు లైసెన్స్ పొందవచ్చు. గేర్లు ఉన్న బైక్‌లు నడపడానికి మాత్రం 18 ఏళ్లు నిండి ఉండాలి. 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల స్కూటర్లు, మోటార్‌సైకిళ్లకు రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చేయించాలి. 

ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం 

పర్యావరణం హితానికి, ఇంధన ఖర్చు ఆదా చేయడానికి ఎలక్ట్రిక్ వాహనాలు జోరు పెరిగింది. ముఖ్యంగా స్కూటర్‌ విభాగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!
EV మార్కెట్‌లో మరోసారి సత్తా చాటిన Tata Motors.. Kia దెబ్బకు Marutiకి భారీ షాక్!
జనం ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్‌ కార్లు ఈ కంపెనీవే.. ఇతర బ్రాండ్ల వైపు కన్నెత్తి చూడడం లేదు!
Skoda Slavia Facelift EMI: నెలకు సుమారు రూ.14 వేలు కట్టి ఈ ప్రీమియం సెడాన్‌ను సొంతం చేసుకోండి!
Skoda Slavia Facelift ఆన్‌రోడ్‌ రేటు ఎంత పడుతుంది? కార్‌ లోన్‌ ఎంత వస్తుంది?
కొత్త గేర్‌బాక్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ సీట్ మసాజ్.. Skoda Slavia Faceliftలో ఇంకా ఏం మారిందంటే?
Skoda Slavia Facelift: చిన్న మార్పులు, పెద్ద ప్రభావం.. ఇప్పుడు మరింత మోడ్రన్‌గా!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget