Volkswagen ID.3 GTx Launch: కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసిన ఫోక్స్‌వాగన్ - మరి మనదేశంలో?
Volkswagen New Car: ఫోక్స్‌వాగన్ ఐడీ 3 జీటీఎక్స్ కారును కంపెనీ రివీల్ చేసింది.
Volkswagen ID.3 GTx: ప్రముఖ కార్ల బ్రాండ్ ఫోక్స్‌వాగన్ తన కొత్త మోడల్ ఐడీ.3 జీటీఎక్స్‌ని రివీల్ చేసింది. ఈ కారు రెండు విభిన్న అవుట్‌పుట్ శ్రేణులతో మార్కెట్లోకి వచ్చింది. ఇది ఫోక్స్‌వాగన్ లాంచ్ చేసిన చాలా శక్తివంతమైన ఎలక్ట్రిక్ డ్రైవ్ మోటార్లలో ఒకటి. ప్రస్తుతం భారత్‌లో ఈ కారును విడుదల చేయడంపై పెద్దగా ఆశలు లేవు. కంపెనీ రాబోయే కాలంలో భారతీయ మార్కెట్‌లో ఐడీ.4ని తీసుకురావచ్చు.
ఫోక్స్‌వాగన్ ఐడీ.3 జీటీఎక్స్ ఫీచర్లు
ఫోక్స్‌వాగన్ ఐడీ.3 జీటీఎక్స్ 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ వాహనం 5.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ డ్రైవ్ మోటార్ 545 ఎన్ఎం అవుట్‌పుట్ టార్క్‌ను కూడా ఇస్తుంది. ఈ వాహనం ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే సమయంలో ఈ కారు కేవలం 26 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. దీన్ని 175 కేడబ్ల్యూ డీసీ క్విక్ ఛార్జింగ్ స్టేషన్ నుంచి ఛార్జ్ చేయవచ్చు.
ఫోక్స్‌వాగన్ కారు డిజైన్
ఫోక్స్‌వాగన్ లాంచ్ చేసిన ఈ మోడల్ దాని ఎక్స్‌టీరియర్ డిజైన్‌తోనే మార్కెట్లో ఉన్న ఇతర మోడళ్ల నుంచి భిన్నంగా ఉంటుంది. ఈ వాహనం ఫ్రంట్ బంపర్‌లో డైమండ్ స్టైల్‌లో బ్లాక్ ఎయిర్ ఇన్‌టేక్ ఇన్‌స్టాల్ చేశారు. ఫోక్స్‌వాగన్ ఐడీ.3 జీటీఎక్స్‌లో రెండు వైపులా డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా అమర్చారు. అంతేకాకుండా దీనికి రెండు ఎల్ఈడీ ట్రయాంగిల్స్ కూడా జోడించారు.
ఫోక్స్‌వాగన్ ఐడీ.3 జీటీఎక్స్ కూడా 20 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. జీటీఎక్స్ స్టైల్ మ్యాచింగ్ దాని చక్రాలపై కూడా చూపబడింది. దీని చక్రాల లోపలి భాగంలో నల్లగా పెయింట్ చేశారు. బయటి ఉపరితలంపై డైమండ్ కట్‌లు వర్తింపజేశారు. ఈ వాహనం ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫోక్స్‌వాగన్ మోడల్‌ల్లో ప్రీమియం స్పోర్ట్ సీట్లు అందించారు.
ఫోక్స్‌వాగన్ ఐడీ.7 జీటీఎక్స్ టూరర్ కూడా...
ఫోక్స్‌వాగన్ ఐడీ.3 జీటీఎక్స్‌తో పాటు ఫోక్స్‌వాగన్ ఐడీ.7 జీటీఎక్స్ టూరర్‌ను కూడా రివీల్ చేసింది. ఈ రెండు మోడళ్లు గొప్ప డిజైన్‌తో పాటు శక్తివంతమైన రేంజ్‌ను అందిస్తాయి.