(Source: ECI/ABP News/ABP Majha)
Upcoming Cars in September 2024: సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానున్న మోస్ట్ అవైటెడ్ కార్లు - ఎంజీ నుంచి మెర్సిడెస్ వరకు!
Upcoming Cars in India: సెప్టెంబర్‌లో మనదేశంలో ఎన్నో కొత్త కార్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఈక్యూఎస్ 680 నుంచి ఎంజీ విండ్సర్ ఈవీ వరకు అనేక కార్లు ఉన్నాయి.
Upcoming Cars in September: మీరు కొత్త కారు కోసం చూస్తున్నట్లయితే సెప్టెంబర్‌లో ఇప్పటికే కొన్ని గ్రేట్ కార్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ కారణంగా సెప్టెంబర్‌లో వాహనాల విక్రయంలో విపరీతమైన జంప్ ఉండవచ్చు. చాలా కంపెనీలు సెప్టెంబర్‌లో తమ కొత్త కార్లను కూడా విడుదల చేయబోతున్నాయి. ఈ కార్ల కోసం కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త కార్లలో ఐసీఈ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల మోడల్‌లు ఉంటాయి.
టాటా కర్వ్ ఐసీఈ వేరియంట్ ఇప్పటికే మార్కెట్లో లాంచ్ కాగా... మెర్సిడెస్ మేబ్యాక్ ఈక్యూఎస్, హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్, ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్, టాటా నెక్సాన్ సీఎన్‌జీ త్వరలో లాంచ్ కానున్నాయి.
టాటా కర్వ్ ఐసీఈ (Tata Curvv ICE)
ఈ కారు ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ మోడల్ గత నెలలోనే మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మోడల్‌లలో లాంచ్ అయింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.9.9 లక్షల నుంచి ప్రారంభం అయింది. దీని బేస్, మిడ్ వేరియంట్‌లు నెక్సాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చాయి.
మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఈక్యూఎస్ 680 (Mercedes-Benz Maybach EQS 680)
మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఈక్యూఎస్ 680 సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ కారు గత సంవత్సరం చైనాలో విడుదల అయింది. మెర్సిడెస్-మేబ్యాక్... కంపెనీ భారతీయ లైనప్‌లో కొత్త మోడల్.
కొత్త హ్యుందాయ్ అల్కాజార్ (New Hyundai Alcazar)
హ్యుందాయ్ తీసుకురానున్న ఈ కారు సెప్టెంబర్ 9వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది. సెప్టెంబర్ 9న మార్కెట్లోకి రానున్న ఈ కారు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో రానుంది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్‌లు కూడా ఇప్పటికే ప్రారంభించింది. రూ. 25 వేలు టోకెన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్‌ను బుకింగ్ చేసుకోవచ్చు.
Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!
ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV)
ఎంజీ విండ్సర్ ఈవీ అనేది ఒక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది సెప్టెంబర్ 11వ తేదీన భారతదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో దాదాపు 200 హెచ్‌పీ పవర్, 350 ఎన్ఎం టార్క్ అందించగల శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ ఎస్‌యూవీ లాంగ్ డ్రైవింగ్ రేంజ్, కొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి రావచ్చు. దీని ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
టాటా నెక్సాన్ సీఎన్‌జీ (Tata Nexon CNG)
ఈ లిస్టులో ఐదో కారు టాటా నెక్సాన్ సీఎన్‌జీ. దీనిని ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారును కంపెనీ చాలా కాలంగా పరీక్షిస్తోంది. ఈ కారును 2024 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో లాంచ్ చేశారు. దీని లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే!