అన్వేషించండి

అడ్వాన్స్‌డ్‌ అవతార్‌లో TVS Raider 125 లాంచ్‌ - డ్యూయల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, ABS సహా మోడ్రన్‌ ఫీచర్లు

TVS Raider 125 ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్‌ అవతార్‌లో వచ్చింది. డ్యూయల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, సింగిల్‌ ఛానెల్‌ ABS, బూస్ట్‌ మోడ్‌, కొత్త TFT స్క్రీన్‌ వేరియంట్‌తో లాంచ్‌ అయింది.

2025 TVS Raider 125 Price, Mileage And Features Telugu: TVS, తన పాపులర్‌ టూవీలర్‌ Raider 125 బైక్‌ను ఇప్పుడు మరింత అప్‌గ్రేడ్‌ చేసి మార్కెట్లోకి తెచ్చింది. తాజాగా లాంచ్‌ చేసిన డ్యూయల్‌ డిస్క్‌ వేరియంట్‌ (New Raider 125 dual-disc variant launch)‍‌ ప్రస్తుతం ఉన్న రైడర్‌ సిరీస్‌లో అత్యంత అడ్వాన్స్‌డ్‌ మోడల్‌గా నిలిచింది. వేరియంట్‌ ఆధారంగా దీని ధర రూ. 93,800 నుంచి రూ. 95,600 (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉంది, 

కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్‌
New Raider 125 లో ముందు & వెనుక రెండు చక్రాలకు డిస్క్‌ బ్రేక్‌లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, సింగిల్‌ ఛానెల్‌ ABS సిస్టమ్‌ కూడా ఇచ్చారు, ఇది వేగంలోనూ రైడింగ్‌ సేఫ్టీని మరింత పెంచుతుంది. ఫ్రంట్‌ టైర్‌ 90/90-17, రియర్‌ టైర్‌ 110/80-17 సైజులో కొత్త కాన్ఫిగరేషన్‌తో వచ్చింది, ఇది రోడ్‌ గ్రిప్‌ను మరింత మెరుగుపరుస్తుంది. 

బూస్ట్‌ మోడ్‌ - కొత్త ఎక్స్‌పీరియన్స్‌
TVS Jupiter లాగా TVS Raider 125 లో కూడా ఇప్పుడు బూస్ట్‌ మోడ్‌ అందించారు. ఈ ఫీచర్‌ వల్ల, ఏదైనా వెహికల్‌ను వేగంగా ఓవర్‌టేక్‌ చేయడానికి అవసరమైన అదనపు టార్క్‌ రైడర్‌కు లభిస్తుంది. నగరాల్లో ట్రాఫిక్‌లో సులభంగా నడిపేందుకు GTT (Glide Through Technology) కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల తక్కువ స్పీడ్‌లో కూడా బైక్‌ స్థిరంగా సాగుతుంది, ఇంధన సామర్థ్యం పెరుగుతుంది, తద్వారా డబ్బు ఆదా అవుతుంది.         

డిస్‌ప్లే ఆప్షన్స్‌ – LCD & TFT

కొత్త TVS Raider 125 వేరియంట్‌లో రెండు స్క్రీన్‌ ఆప్షన్లు ఉన్నాయి.

SXC DD వేరియంట్‌ - LCD స్క్రీన్‌తో రూ. 93,800           

TFT DD వేరియంట్‌ - TFT డిస్‌ప్లేతో రూ. 95,600                 

TFT స్క్రీన్‌లో డిజిటల్‌ స్పీడోమీటర్‌, కాల్‌/SMS అలర్ట్స్‌, రియల్‌ టైమ్‌ మైలేజ్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో, ఇన్ని మోడ్రన్‌ టెక్‌ ఫీచర్లతో వచ్చిన అతి కొన్ని బైక్‌లలో Raider ఒకటి.        

కలర్‌ ఆప్షన్‌
ఈ కొత్త వేరియంట్‌లో ఆకర్షణీయమైన రెడ్‌ కలర్‌ స్కీమ్‌ అందించారు. ఇది Raider డిజైన్‌కి స్పోర్టీ లుక్‌ ఇస్తుంది.       

2025 TVS Raider 125 కొత్త వేరియంట్‌ ఇప్పుడు యువ రైడర్లను బాగా ఆకట్టుకునేలా రూపొందించారు. డ్యూయల్‌ డిస్క్‌లు, ABS, బూస్ట్‌ మోడ్‌, TFT స్క్రీన్‌ -  ఇవన్నీ Raider ని కేవలం కమ్యూటర్‌ బైక్‌గా కాకుండా ఒక స్టైలిష్‌ & పవర్‌ఫుల్‌ ఆప్షన్‌గా నిలబెట్టాయి. ఈ ధర పరిధిలో, ఇది ఒక “బెస్ట్‌ ప్యాకేజ్‌” అని చెప్పవచ్చు.         

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget