అన్వేషించండి

TVS New Bike: మైలేజ్‌కు మైలేజ్‌, స్టైల్‌కు స్టైల్‌ - న్యూ లుక్‌తో TVS Sport ES+ లాంచింగ్‌

2025 TVS Sport New ES Plus: టీవీఎస్‌ కంపెనీ భారత మార్కెట్లోకి స్పోర్ట్ ఈఎస్‌+ కొత్త వెర్షన్‌ లాంచ్‌ చేసింది. ఈ బైక్‌ను పాపులర్‌ చేసింది దాని మైలేజ్. ధర, ఫీచర్లు, స్టైల్‌ను గురించి తెలుసుకుందాం.

2025 TVS Sport New ES Plus Price And Features: టీవీఎస్‌, తన పాపులర్‌ కమ్యూటర్ బైక్ 'స్పోర్ట్‌' రేంజ్‌ను ఎక్స్‌టెండ్‌ చేస్తూ, కొత్త వేరియంట్ ES+ ను లాంచ్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్-షోరూమ్ ధర (TVS Sport ES+ Ex-Showroom Price) 60,881 రూపాయలు. ఈ కొత్త బైక్‌లో అతి పెద్ద ఫీచర్‌ దాని అద్భుతమైన మైలేజ్. కంపెనీ చెప్పిన ప్రకారం 2025 TVS Sport ES Plus మోడల్‌ లీటర్‌ పెట్రోల్‌తో 65 కిలోమీటర్లకు పైగా నడుస్తుంది. పెట్రోల్ రేట్లు జేబుకు చిల్లు పెడుతున్న నేపథ్యంలో, డైలీ అప్‌ & డౌన్‌ చేసేవాళ్లకు, ఎక్కువ దూరం తిరిగేవాళ్లకు ఈ బైక్ బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది.

తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ & స్టైల్ కోరుకునే కస్టమర్ల కోసం టీవీఎస్ స్పోర్ట్ ES+ వెర్షన్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. టీవీఎస్ స్పోర్ట్ ES+ బైక్ హీరో స్ల్పెండర్‌కు నేరుగా పోటీ ఇవ్వగలదు.

లుక్ & డిజైన్ (TVS Sport ES+ Look And Design)
TVS స్పోర్ట్ ES+ డిజైన్ ప్రస్తుతం మార్కెట్‌ దృష్టిలో ప్రత్యేకంగా నిలిచింది. దీనిని గ్రే-రెడ్ & బ్లాక్-నియాన్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో లాంచ్‌ చేశారు. స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌పై పిన్‌స్ట్రిపింగ్ ఇచ్చారు. ES+ వేరియంట్‌లో మాత్రమే లభించే బ్లాక్ పిలియన్ గ్రాబ్ రైల్ దీనిని ఇతర మోడళ్ల కంటే భిన్నంగా నిలబెడుతుంది. ఇంకా... కలర్-కోడెడ్ హెడ్‌లైట్ కౌల్ & మడ్‌గార్డ్ ఈ బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఈ స్పెషాలిటీలన్నీ TVS స్పోర్ట్ ES+ ని స్టైలిష్ ఐకాన్‌గా మార్చాయి.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌ (TVS Sport ES+ Engine & Performance)
ఇంజిన్ & పనితీరు గురించి చెప్పాలంటే... TVS స్పోర్ట్ ES+ 109.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది. ఇది గరిష్టంగా 8.08 bhp పవర్‌ను & 8.7 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ను యాడ్‌ చేశారు. బైక్ బరువు 112 కిలోలు & గ్రౌండ్ క్లియరెన్స్ 175 మి.మీ. బ్రేకింగ్ సిస్టమ్‌గా, ముందు & వెనుక రెండింటిలోనూ డ్రమ్ బ్రేక్‌లు బిగించారు. ఈ ఫీచర్లన్నీ కలిసి, గజిబిజి ట్రాఫిక్‌లో & గుంతల రోడ్లలోనూ బైక్‌ను స్మూత్‌గా నడిపించగలవు. ఈ టూవీలర్‌ పంచకళ్యాణికి పోటీ ఇచ్చేలా గరిష్టంగా 90 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. కంపెనీ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకారం ఈ బండి మైలేజ్ లీటర్‌కు 65 కి.మీ. కంటే ఎక్కువ. ఇంధన ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. మైలేజ్‌ లెక్క ప్రకారం, ఒకసారి ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే ఈ బండి లెక్కలేకుండా 650 కిలోమీటర్లు ఆగకుండా పరుగులు పెట్టగలదు.

ధర & వేరియంట్లు (TVS Sport ES+ Price & Variants)
తెలుగు రాష్ట్రాల్లో TVS Sport ES+ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ ‍‌(TVS Sport ES+ On-Road Price) 75,454 రూపాయలు. Sport Self Start (ES) - Alloy Wheels ధర 84,661 రూపాయలు & Sport Self Start (ELS) - Alloy Wheels ధర 91,310 రూపాయలు. కొంచెం ఎక్కువ ఫీచర్లు కోరుకుంటూనే బడ్జెట్‌లో బండి తీసుకోవాలనుకునే కస్టమర్లకు ES+ వేరియంట్ ఉత్తమ ఎంపిక. నగరం, డీలర్‌షిప్‌ను బట్టి ఈ రేట్లు కొద్దిగా మారవచ్చు & బండి కొనేముందు మీ దగ్గరలోని డీలర్‌షిప్‌ నుంచి పూర్తి వివరాలు పొందండి.

టాప్ హెడ్ లైన్స్

మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget