అన్వేషించండి

దేశంలో తొలి CNG స్కూటర్‌ - TVS Jupiter CNG ఎక్కడ ఆగిపోయింది?, ఎందుకు లాంచ్‌ కాలేదు?

TVS Jupiter CNG: భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో TVS జూపిటర్ CNG ని ప్రదర్శించిప్పటికీ, ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఎప్పుడు లాంచ్‌ అవుతుందో తెలుసుకుందాం.

TVS Jupiter CNG Updates, Price. Features: భారతదేశంలో ద్విచక్ర వాహనాలపై మోజు ఎప్పటికీ తగ్గదు. అందులోనూ స్కూటర్లు అంటే ప్రత్యేకమైన క్రేజ్‌, అవి ఫ్యామిలీకి కూడా చాలా ఉపయోగపడతాయి. కానీ, ఇంధనం ధరలు ఆకాశాన్ని చూస్తున్న ఈ సమయంలో, టూవీలర్లలో CNG ఆప్షన్‌ ఎంత హ్యాపీ బాగుంటుందో కదా. ఇదే డ్రీమ్‌తో, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో TVS తన కొత్త జూపిటర్ CNG స్కూటర్‌ను ప్రదర్శించింది. ఆ సమయంలో, ఈ CNG స్కూటర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ నిజంగా అద్భుతంగా ఉంది. "హోండా యాక్టివా CNG వస్తుందనుకున్నాం, కానీ TVS మైండ్‌ బ్లో చేసింది" అని అందరూ అనుకున్నారు. అయితే, ఎక్స్‌పోలో షోకేస్‌ చేసిన తర్వాత, ఈ స్కూటర్‌ గురించి కంపెనీ నుంచి ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. దీంతో, ఈ స్కూటర్‌ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ కనిపిస్తోంది.

ఎప్పుడు లాంచ్‌ అవుతుంది?
ముందుగా ఉన్న అంచనాల ప్రకారం, ఈ ఫెస్టివ్‌ సీజన్‌కల్లా ఈ జూపిటర్ CNG రోడ్డుమీద దూసుకురావాలి. కానీ ఇప్పుడు ఆ డ్రీమ్‌ డిలే అవుతోంది. ఎందుకంటే, TVS, ముందుగా తన కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఆర్బిటర్‌ను (TVS Orbiter electric scooter launched) ఆగస్టు 28న లాంచ్‌ చేసింది. అందుకే జూపిటర్ CNG ప్రాజెక్ట్‌ వెనక్కి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది.

TVS జూపిటర్ CNG ఫీచర్లు
ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మోడల్‌లో 1.4 కిలోల CNG ట్యాంక్‌ పెట్టారు. అదనంగా, 2 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌ కూడా ఉంది. అంటే, రెండు ఫ్యూయల్‌ ఆప్షన్లతో కలిపి ఈ స్కూటర్‌ 220 కి.మీ. నుంచి 230 కి.మీ. వరకు రేంజ్‌ ఇస్తుంది అని కంపెనీ క్లెయిమ్‌ చేసింది.

డిజైన్‌ మాత్రం పెట్రోల్‌ జూపిటర్‌ ఉన్నట్లే ఉంది. అదే బాడీ షేప్‌, అవే ఫీచర్లు. కానీ, ఒక పెద్ద మైనస్‌ ఏమిటంటే - అండర్‌సీట్‌ స్టోరేజ్‌ ఉండదు, ఆ ప్లేస్‌లో CNG ట్యాంక్‌ ఉంది. అంటే.. స్కూటర్‌ సీట్‌ కింద బాగ్‌, హెల్మెట్‌ వంటివి పెట్టుకోవడంలో ఇబ్బంది పడాల్సి రావచ్చు.

ధర అంచనాలు
కంపెనీ అధికారికంగా ఎలాంటి లాంచ్‌ డేటు & రేటు చెప్పకపోయినా, మార్కెట్‌ అంచనాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. TVS Jupiter CNG స్కూటర్‌ ధర రూ. 90,000 నుంచి రూ. 1.15 లక్షల మధ్య (ఆన్‌-రోడ్‌) ఉండొచ్చని టాక్‌. హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో కూడా ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

కస్టమర్లలో నిరాశ
ఎక్స్‌పోలో చూసిన తర్వాత, ఈ బండిని కొనాలని చాలా మంది ఎక్సైట్‌ అయ్యారు, లాంచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. "అదేంటి, CNG స్కూటర్‌ను చూపించి మౌనంగా వెళ్లిపోయారు" అని చాలామంది సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. కనీసం ఒక చిన్న టీజర్‌ లేదా అప్‌డేట్‌ అయినా ఇస్తే కస్టమర్లలో క్యూరియాసిటీ కొనసాగుతుందని భావిస్తున్నారు.

ఇండియాలో మొదటి CNG స్కూటర్‌గా జూపిటర్ CNG రావడం ఖాయం. కానీ ఎప్పుడు? అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. ఫెస్టివ్‌ సీజన్‌లో కాకపోతే, ఈ ఏడాది చివర్లో అయినా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు ఆశావాహులు ఎదురుచూడాల్సిందే.

టాప్ హెడ్ లైన్స్

Renault Triber 7-సీటర్‌ ఫ్యామిలీ కారు.. రూ.1.16 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు, మిగిలింది EMIల్లో చూసుకోవచ్చు
ఏడు సీట్ల కారు ఇంత చౌకగానా? నెలకు కేవలం రూ.8,300 కడితే Renault Triber మీ సొంతం!
Renault Triber కొనేవాళ్ల అసలు ఛాయిస్ ఇదే.. ఈ వేరియంట్‌లో ఫీచర్లు & పవర్ రెండూ పక్కా!
రెనాల్ట్‌ ట్రైబర్‌లో ఏ వేరియంట్ కొనాలి? రూ.8.53 లక్షలకే టర్బో ఇంజిన్‌తో అదిరిపోయే ప్యాకేజీ!
2026 Bajaj Pulsar NS125 కొత్త అవతార్.. ఇక LCD డిస్‌ప్లేతో పాటు మరిన్ని ఫీచర్లు!
లాంచ్‌కు ముందే లీకైన 2026 పల్సర్ NS125 ఫొటోలు.. కొత్త రంగులు, కలర్ డిస్‌ప్లే!
First-Time Car Insurance: మీ కార్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయా? పాలసీ తీసుకునే ముందు ఈ చెక్‌లిస్ట్ చూడండి
మొదటిసారి కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Hyderabad dating app scam: డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Telangana Pending Bills Protests: భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Embed widget