అన్వేషించండి

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

టొయోటా గ్లాంజా, హైరైడర్ సీఎన్‌జీ కార్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

టొయోటా గ్లాంజా, హైరైడర్ సీఎన్‌జీ కార్లతో సీఎన్‌జీ రంగంలో కూడా అడుగుపెట్టింది. గ్లాంజా సీఎన్‌జీ వేరియంట్ ఎస్, జీ గ్రేడ్స్‌ అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు అర్బన్ క్రూజర్ హైరైడర్ కూడా సీఎన్‌జీ వేరియంట్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. గ్లాంజ్ కేజీ ఫ్యూయల్‌కు 30.61 కిలోమీటర్లు, హైరైడర్ 26.1 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనున్నాయి.

టొయోటా గ్లాంజా జీ గ్రేడ్ ధర రూ.8.43 లక్షల నుంచి, ఎస్ గ్రేడ్ రూ.9.46 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టొయోటా హైరైడర్ సీఎన్‌జీ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఎస్‌యూవీల్లో మొదటి సీఎన్‌జీ కారు హైరైడర్ సీఎన్‌జీనే కానుంది.

టొయోటా హైరైడర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ హైబ్రిడ్ వెర్షన్ ధరను కంపెనీ సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రకటించింది. ఎంట్రీ లెవల్ ఎస్-ట్రిమ్ ధర రూ.15.11 లక్షలుగా ఉంది. అదే ప్రారంభ ధర. ఇక టాప్ ఎండ్ వీ ట్రిమ్ ధరను రూ.18.99 లక్షలుగా నిర్ణయించారు. ఇక జీ వేరియంట్ ధరను రూ.17.49 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

ఈ హైబ్రిడ్ అర్బన్ క్రూజర్ హైరైడర్ 27.97 కిలోమీటర్ల మైలేజీని అందించనుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోడ్ కూడా అందించారు. దీంతోపాటు హైరైడర్ మరో ఇంజిన్ ఆప్షన్ కూడా అందించారు. ఇది 1.5కే సిరీస్ పెట్రోల్ మోడల్. టొయోటా ఇందులో టాప్ ఎండ్ వీ ఆటోమేటిక్ ధరను రూ.17.09 లక్షలుగా నిర్ణయించింది. ఏడబ్ల్యూడీ సిస్టం, మాన్యువల్ గేర్ బాక్స్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.

మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకోవడానికి హైరైడర్ ధరను వీలైనంత రీజనబుల్‌గానే నిర్ణయించారు. ఈ కారు అద్భుతమైన మైలేజ్‌ను అందించనుంది. టాప్ ఎండ్ హైరైడర్ మోడల్లో హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. 9 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా అందించారు. రూ.20 లక్షల్లోపు బెస్ట్ కార్ల లిస్ట్ తీస్తే ఇది కూడా కచ్చితంగా ఉండనుంది.

టొయోటా మనదేశంలో కొత్త అర్బన్ క్రూజర్‌ను జులైలో మనదేశంలో లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న కారు. ఈ విభాగంలో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు ఇదే. ఇందులో 1.5 లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌ను అందించారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కూడా ఇందులో ఉంది. ఈ ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 హెచ్‌పీ కాగా, పీక్ టార్క్ 135 ఎన్ఎంగా ఉంది. ఇంజిన్, హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు దీని పవర్ అవుట్‌పుట్ 113 హెచ్‌పీగా ఉండనుంది.

ఈ విభాగంలో ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ ఉన్న మొదటి కారు టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడరే. ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు అందించారు. ఇదే హైబ్రిడ్ టెక్నాలజీ టొయోటా హైఎండ్ ప్రొడక్ట్స్ అయిన కామీ, వెల్‌ఫైర్‌ల్లో కూడా ఉంది.

యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జర్, తొమ్మిది అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, వెంటిలేటెడ్ డ్యూయల్ టోన్ సీట్ల వంటి ప్రీమియం ఫీచర్లను టొయోటా ఇందులో అందించింది. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, డీసెంట్, ఆల్ వీల్ డిస్కులు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఏడు మోనోటోన్ కలర్ ఆప్షన్లు, నాలుగు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget