అన్వేషించండి

Toyota Taisor Review: టయోటా టైజర్ 11,500 కి.మీ. రివ్యూ - డ్రైవింగ్‌ ఫన్‌ నిజంగానే వస్తుందా, మైనస్‌లే లేవా?

Toyota Compact SUV: టయోటా టైజర్ లాంగ్‌టర్మ్ రివ్యూలో ప్రాక్టికల్ ఫీచర్లు, టర్బో ఇంజిన్, కంఫర్ట్‌తో పాటు మైనస్ పాయింట్ల గురి కూడా తెలుసుకుందాం. కొత్తగా SUV కొనాలనుకునే వారికి ఇది యూజ్‌ఫుల్‌ రిపోర్ట్‌.

Toyota Taisor Long Term Review Telugu: టయోటా టైజర్‌ అనేది కేవలం ఒక SUV మాత్రమే కాదు, డ్రైవ్‌ చేసే వారికి సరదా (ఫన్‌) కూడా ఇస్తుందని లాంచ్‌ సమయంలో కంపెనీ క్లియర్‌గా చెప్పింది. మరి, ఆ మాట నిజమేనా?. గత కొన్ని నెలల్లో ఈ కారును 11,500 కిలోమీటర్లు నడిపిన తర్వాత, ఒక వ్యక్తి తన అనుభవాలతో రాసిన రివ్యూ ఇది. టయోటా టైజర్‌ నిజంగా కారు ఏం ఆఫర్‌ చేస్తుందో ఈ రివ్యూ ద్వారా స్పష్టంగా అర్థమైంది.

ఇంజిన్‌ & డ్రైవింగ్‌ ఫన్
టైజర్‌లో ఉన్న 1.0 లీటర్ టర్బో ఇంజిన్‌ 100hp పవర్‌, 148Nm టార్క్‌ ఇస్తుంది. బరువు కేవలం 1,030 కిలోలు మాత్రమే ఉండటంతో ఇంజిన్‌ పనితీరు ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ట్రాఫిక్‌లో చిన్న గ్యాప్‌ దొరికినా యాక్సిలేటర్‌ తొక్కగానే కారు రెస్పాన్స్‌ ఇస్తుంది. టర్బో లాగ్‌ కొద్దిగా ఉన్నప్పటికీ, పవర్‌ క్రమంగా పెరుగుతూ, నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్‌లా రెస్పాన్స్‌ ఇస్తుంది.

లాంగ్ డ్రైవ్ అనుభవం
ఈ రివ్యూ రాసిన వ్యక్తి, లాంగ్ డ్రైవ్ అనుభవం కోసం టయోటా టైజర్‌తో పుణె ట్రిప్‌ వేశాడు. ఓపెన్‌ రోడ్‌లో డ్రైవ్‌ చేసినప్పుడు ఇంజిన్‌ పర్ఫార్మెన్స్‌ అదిరిపోయింది. గేర్‌బాక్స్‌ లైట్‌గా, సరిగ్గా పని చేస్తూ డ్రైవింగ్‌లో ఆనందాన్ని అందించింది. 

కంఫర్ట్ & ఇంటీరియర్
ఈ కారు, బయటి నుంచి చూసినప్పుడు కాంపాక్ట్‌గా కనిపించినా, వెనుక సీటింగ్‌లో లెగ్‌రూమ్‌ సరిపడా ఉంది. రియర్‌ ఎయిర్ వెంట్స్‌, USB-C పోర్ట్స్‌ ఉపయోగకరంగా ఉన్నాయి. ఇంటీరియర్‌ లగ్జరీగా కాకపోయినా ప్రాక్టికల్‌గా ఉంది. అయితే, ప్లాస్టిక్‌ క్వాలిటీ చాలా గట్టిగా అనిపిస్తుంది. 360 డిగ్రీ కెమెరా క్లారిటీ టాప్‌ లెవెల్‌లో లేకపోయినా, ఉపయోగకరంగానే ఉంది.

బూట్ స్పేస్ & చిన్న మైనస్ పాయింట్లు
బూట్‌ స్పేస్‌ 300 లీటర్ల వరకు ఉంది. కానీ లిప్‌ ఎక్కువగా ఉండటంతో బరువుగా ఉన్న వస్తువులు ఎత్తడం కష్టంగా ఉంటుంది. ఫుట్‌వెల్‌ తక్కువగా ఉండటం వల్ల డెడ్ పెడల్‌ నుంచి క్లచ్‌కి కదలడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

నాయిస్‌ & ఇన్సులేషన్
రోడ్డు మీది శబ్ధాలతో పాటు ఇంజిన్‌ సౌండ్‌ కూడా కేబిన్‌లో వినిపించడం మరో మైనస్‌ పాయింట్‌. సైలెంట్‌ రోడ్‌ మీద ఇది పెద్ద సమస్య కాకపోయినా, ట్రాఫిక్‌లో మాత్రం చిరాగ్గా ఉంటుంది.

మైలేజ్
సిటీలో లీటరకు 12-14 km మైలేజ్‌ ఇస్తుంది. హార్డ్ డ్రైవ్‌ చేస్తే 10 kmpl వరకు పడిపోతుంది. టర్బో పెట్రోల్‌ SUV కి పర్లేదు అనిపించే నంబర్లు ఇవి.

ఆశించిన ఫీచర్లు
కూల్డ్‌ సీట్లు, సన్‌రూఫ్‌, ADAS ఫీచర్లు ఉంటే ఇంకా బాగుండేది. క్రూయిజ్ కంట్రోల్‌, క్లియర్‌ అనలాగ్‌ డయల్స్‌ వంటివి డ్రైవింగ్‌ సమయంలో హెల్ప్‌ చేస్తాయి.

ఫైనల్‌గా ఏం చెప్పొచ్చు?
ఓవరాల్‌గా చూస్తే, టయోటా టైజర్‌ కాంపాక్ట్‌ SUV సైజ్‌లో ఉన్నా, డ్రైవింగ్‌ ఫన్‌ & ప్రాక్టికల్‌ యూజ్‌ రెండింటినీ కలిపిన పర్ఫెక్ట్‌ ప్యాకేజీ. లాంగ్‌టర్మ్‌ యూజ్‌లో కూడా ఇది బ్యాలెన్స్‌డ్‌ SUVగా ప్రూవ్‌ అయ్యింది.

టాప్ హెడ్ లైన్స్

టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
డ్రైవింగ్‌ లైసెన్స్‌ నుంచి ఇన్సూరెన్స్‌ వరకు - ఎలక్ట్రిక్‌ బండి నడిపేందుకు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిబంధనలు
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ బండి నడపాలంటే ఎలాంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి?
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
Maruti Suzuki YMC EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!
ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Embed widget