Toyota Hyryder: ఈ కారు కొనాలనుకుంటున్నారా - అయితే ఏడాదికి పైగా వెయిటింగ్ తప్పదు!
టయోటా హైరైడర్ వెయిటింగ్ పీరియడ్ సంవత్సరానికి పైగా ఉంది.
![Toyota Hyryder: ఈ కారు కొనాలనుకుంటున్నారా - అయితే ఏడాదికి పైగా వెయిటింగ్ తప్పదు! Toyota Hyryder See The Waiting Period Details About Toyota Urban Cruiser Hyryder Toyota Hyryder: ఈ కారు కొనాలనుకుంటున్నారా - అయితే ఏడాదికి పైగా వెయిటింగ్ తప్పదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/12/ecdba9b8ff4afb5f8dd7dd76540a7b641686568023382456_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Toyota Hyryder Waiting Period: టయోటా కిర్లోస్కర్ మోటార్ 2022 సెప్టెంబర్‌లో దాని మిడ్-సైజ్ SUV అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను విడుదల చేసింది. ఇది 1.5 లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ మైల్డ్ హైబ్రిడ్, 1.5 లీటర్ K15C మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఆప్షన్లతో రానుంది. ఈ ఇంజిన్లు వరుసగా 92 bhp / 122 Nm, 137 Nm / 103 bhp అవుట్‌పుట్‌లను ఉత్పత్తి చేస్తాయి. బలమైన హైబ్రిడ్‌తో ఒక eCVT మాత్రమే ఉంది.
ఈ కారు మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి అమ్మకాల పరంగా అనూహ్యంగా రాణిస్తోంది. దీని బలమైన హైబ్రిడ్ వెర్షన్లు S, G, Vలకు అధిక డిమాండ్ ఉంది. మీరు ఈ మోడల్ హైబ్రిడ్ వెర్షన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే 78 వారాలు ఆగాలి. అంటే దాదాపు 1 సంవత్సరం 5 నెలల వరకు వేచి ఉండాలన్న మాట.
కొత్త SUV ఎలా ఉంటుంది?
ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను కూడా పొందుతుంది, ఇందులో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించారు. పవర్‌ట్రెయిన్ 7 సీటర్ ఇన్నోవా హైక్రాస్ మాదిరిగానే టయోటా కరోలా క్రాస్‌కు ఉపయోగించబడుతుంది. ఇందులో 2.0 లీటర్ NA పెట్రోల్, 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
దేంతో పోటీ పడనుంది?
టయోటా హైరైడర్... హ్యుందాయ్ క్రెటాతో పోటీపడుతుంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. త్వరలో దీనికి సంబంధించిన ఫేస్ లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి విడుదల కానుంది.
ఈ హైబ్రిడ్ అర్బన్ క్రూజర్ హైరైడర్ 27.97 కిలోమీటర్ల మైలేజీని అందించనుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోడ్ కూడా అందించారు. దీంతోపాటు హైరైడర్ మరో ఇంజిన్ ఆప్షన్ కూడా అందించారు. ఇది 1.5కే సిరీస్ పెట్రోల్ మోడల్. టొయోటా ఇందులో టాప్ ఎండ్ వీ ఆటోమేటిక్ ధరను రూ.17.09 లక్షలుగా నిర్ణయించింది. ఏడబ్ల్యూడీ సిస్టం, మాన్యువల్ గేర్ బాక్స్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.
మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకోవడానికి హైరైడర్ ధరను వీలైనంత రీజనబుల్‌గానే నిర్ణయించారు. ఈ కారు అద్భుతమైన మైలేజ్‌ను అందించనుంది. టాప్ ఎండ్ హైరైడర్ మోడల్లో హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. 9 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా అందించారు. రూ.20 లక్షల్లోపు బెస్ట్ కార్ల లిస్ట్ తీస్తే ఇది కూడా కచ్చితంగా ఉండనుంది.
టొయోటా మనదేశంలో కొత్త అర్బన్ క్రూజర్‌ను జులైలో మనదేశంలో లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న కారు. ఈ విభాగంలో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు ఇదే. ఇందులో 1.5 లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌ను అందించారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కూడా ఇందులో ఉంది. ఈ ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 హెచ్‌పీ కాగా, పీక్ టార్క్ 135 ఎన్ఎంగా ఉంది. ఇంజిన్, హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు దీని పవర్ అవుట్‌పుట్ 113 హెచ్‌పీగా ఉండనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)