Toyota Corolla: త్వరలో టయోటా కరోలా క్రాస్ ఎస్‌యూవీ - హైరైడర్‌కు పర్ఫెక్ట్ కాంపిటీషన్!
Toyota New Car: టయోటా కరోలా క్రాస్ ఎస్‌యూవీ త్వరలో మార్కెట్లోకి రానుంది.
Toyota Corolla Cross SUV: కొంతకాలం క్రితం వరకు టయోటా కరోలా భారతదేశంలో ఆల్టిస్ సర్‌నేమ్‌తో వాహనాన్ని విక్రయించేది. దీన్ని తర్వాత నిలిపివేశారు. ఇప్పుడు ఇది మార్కెట్లోకి తిరిగి రావచ్చు. ఇన్నోవా హైక్రాస్‌తో పాటు హైబ్రిడ్ ఎస్‌యూవీ/క్రాస్ఓవర్‌గా అమ్మకానికి అందుబాటులో ఉంది.
కరోలా క్రాస్ ఒక క్రాస్ఓవర్ మోడల్. ఇది శక్తివంతమైన లుక్‌తో వస్తుంది. సెడాన్ వంటి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కొత్త కరోలా క్రాస్ కొత్త లుక్ ఫ్రంట్ ఎండ్‌తో పాటు దిగువన ఉన్న నమూనా, క్రోమ్ హెవీ గ్రిల్‌తో చాలా స్మూత్‌గా కనిపిస్తుంది. ఇది క్రాస్‌ఓవర్ అయినప్పటికీ పైకప్పు పట్టాలు, క్లాడింగ్, స్ట్రెయిట్ స్టాన్స్ వంటి కొన్ని ఎస్‌యూవీ తరహా ఫీచర్లను కూడా కలిగి ఉంది.
దీని ఇంటీరియర్ డిజైన్ కొంచెం సింపుల్‌గా ఉంది. కానీ ఇప్పుడు కొత్త టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కారణంగా కొత్త రూపాన్ని పొందింది. ఇతర ఫీచర్లలో ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో అందుబాటులో ఉన్న స్థలం సరిపోతుంది. కొత్త కరోలా క్రాస్ మంచి బూట్ స్పేస్‌తో పాటు వెడల్పాటి వెనుక సీటును కూడా పొందింది.
ఇందులో 1.8 లీటర్ యూనిట్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా అందించారు. ఇది ప్రామాణికంగా ఈసీవీటీని కూడా పొందుతుంది. అంతేకాకుండా ఇది స్టాండర్డ్‌గా 1.8 లీటర్ పెట్రోల్‌తో సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. ఈ కరోలా క్రాస్ వేరియంట్ హైరైడర్‌తో పోటీ పడనుంది. ఇది మాత్రమే కాదు టయోటా ఇప్పటికే మన దేశంలో కరోలా క్రాస్ ఆధారంగా 7-సీటర్ SUVని తీసుకురావాలని ఆలోచిస్తోంది.