అన్వేషించండి

Top 10 Diesel Cars: టాప్‌ 10 చవకైన డీజిల్‌ కార్లు, రూ.8 లక్షల నుంచి ప్రారంభం - స్టైల్‌ & ఎకానమీ

మార్కెట్లో డీజిల్‌ కార్ల సంఖ్య తగ్గినా - మహీంద్రా, టాటా, కియా, హ్యుందాయ్‌ బ్రాండ్లు ఇప్పటికీ అఫోర్డబుల్‌ డీజిల్‌ కార్లను అందిస్తున్నాయి. రూ. 8 లక్షల నుంచి లభించే టాప్‌ 10 మోడల్స్‌ ఇవే.

Top 10 Most Affordable Diesel Cars: ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణతో పాటు, భారతవ్యాప్తంగా మార్కెట్లో డీజిల్‌ కార్లు ఇప్పుడు కొంచెం కొంచంగా మాయమవుతున్నాయి. మన దేశంలోని కఠినమైన ఉద్గార నిబంధనలను తట్టుకోలేక, కారు కంపెనీలు చాలా డీజిల్‌ మోడళ్లు నిలిపేశాయి. ఈ పరిస్థితుల్లోనూ.. మహీంద్రా, టాటా, కియా, హ్యుందాయ్‌ బ్రాండ్లు ఇప్పటికీ చవకైన డీజిల్‌ మోడళ్లను అందిస్తున్నాయి. వీటిలో, మధ్య తరగతి ప్రజల కోసం రూ. 8 లక్షల నుంచి ప్రారంభమయ్యే టాప్‌ 10 అఫోర్డబుల్‌ / అందుబాటు ధర డీజిల్‌ కార్లు ఇవి.

టాప్‌ 10 చవకైన డీజిల్‌ కార్లు

1. మహీంద్రా బోలెరో - రూ. 7.99 లక్షల నుంచి

ఇప్పటికీ గ్రామీణ భారతదేశంలో హాట్‌ ఫేవరేట్‌. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌, 76hp పవర్‌, 210Nm టార్క్‌. రియర్‌-వీల్‌ డ్రైవ్‌ లేఅవుట్‌తో బలమైన నిర్మాణం దీని అమ్మకాల వెనుకున్న రహస్యం. బొలెరో మోడల్‌లో ఆటోమేటిక్‌ వేరియంట్‌ మాత్రం లేదు.

2. టాటా ఆల్ట్రోజ్‌ - రూ. 8.10 లక్షల నుంచి

భారతదేశంలో డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఏకైక హ్యాచ్‌బ్యాక్‌ ఇదే. 1.5 లీటర్‌ ఇంజిన్‌, 90hp పవర్‌, 200Nm టార్క్‌. 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో మైలేజ్‌ కూడా చక్కగా ఉంటుంది.

3. మహీంద్రా బోలెరో నియో - రూ. 8.49 లక్షల నుంచి

7 సీటర్‌ SUV కావడం మహీంద్రా బొలెరో నియో ప్రత్యేకత. 1.5 లీటర్‌ మూడు సిలిండర్‌ ఇంజిన్‌, 100hp పవర్‌, 260Nm టార్క్‌. రియర్‌-వీల్‌ డ్రైవ్‌ లాడర్‌ ఫ్రేమ్‌ నిర్మాణం దీనిని రఫ్‌ రోడ్లకు పర్ఫెక్ట్‌గా చేస్తుంది.

4. మహీంద్రా XUV 3XO - రూ. 8.95 లక్షల నుంచి

117hp పవర్‌, 300Nm టార్క్‌ కలిగిన 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌. 6 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా AMT ఆప్షన్లు ఉన్నాయి. డీజిల్‌ ఆటోమేటిక్‌ వెర్షన్‌లో మొత్తం భారతదేశంలోనే అతి చవకైన SUV.

5. కియా సోనెట్‌ - రూ. 8.98 లక్షల నుంచి

కాంపాక్ట్‌ SUV లవర్స్‌కి పర్ఫెక్ట్‌ ఎంపిక. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ (116hp, 250Nm), 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ లేదా మాన్యువల్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రిఫైన్డ్‌ ఇంజిన్‌ & బలమైన పనితీరు దీని యునిక్‌ సెల్లింగ్‌ పాయింట్‌ (USP).

6. టాటా నెక్సాన్‌ - రూ. 9.01 లక్షల నుంచి

టాటా మోటార్స్‌ పాపులర్‌ SUV. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌, 115hp పవర్‌, 260Nm టార్క్‌. 6 స్పీడ్‌ AMT లేదా మాన్యువల్‌ గేర్‌బాక్స్‌లో లభిస్తుంది. మిడ్‌ రేంజ్‌లో పర్ఫెక్ట్‌ టార్క్‌ షేర్‌ చేయడం దీని బలం.

7. హ్యుందాయ్ వెన్యూ - రూ. 9.72 లక్షల నుంచి

1.5 లీటర్‌ ఇంజిన్‌, 115hp పవర్‌, 250Nm టార్క్‌ ఇస్తుంది. కేవలం 6 స్పీడ్‌ మాన్యువల్‌ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సిటీ డ్రైవింగ్‌లో స్మూత్‌గా సాగిపోతుంది, కానీ హైవే మీదకు ఎక్కితే కొంచెం స్ట్రైన్‌ ఇస్తుంది.

8. మహీంద్రా థార్‌ - రూ. 9.99 లక్షల నుంచి

డీజిల్‌ ఇంజిన్‌లలో లెజెండరీ ఆఫ్‌రోడర్‌ ఇది. థార్‌లో 1.5 లీటర్‌ (118hp, 300Nm) & 2.2 లీటర్‌ (132hp, 300Nm) ఆప్షన్లు ఉన్నాయి. 4WD వెర్షన్‌తో అద్భుతమైన డ్రైవింగ్‌ అనుభవం మీ సొంతం అవుతుంది.

9. కియా సైరోస్‌ - రూ. 10.13 లక్షల నుంచి

కాంపాక్ట్‌ SUV సెగ్మెంట్‌లో ప్రీమియం టచ్‌ ఇచ్చే కారు. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌, 116hp పవర్‌, 250Nm టార్క్‌ జనరేట్‌ చేస్తుంది. వెనుక సీట్లకు AC వెంట్‌ & రీక్లైన్‌ ఫీచర్లు ఉన్నాయి.

10. టాటా కర్వ్‌ - రూ. 11.10 లక్షల నుంచి

కూపే SUV లుక్‌తో ప్రత్యేకంగా నిలిచే కర్వ్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో వచ్చింది. 118hp పవర్‌, 260Nm టార్క్‌ ఇస్తుంది, 6 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 7 స్పీడ్‌ DCT ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఈ లిస్టులో... మహీంద్రా ఎక్కువ డీజిల్‌ మోడళ్లతో ముందంజలో ఉంది. టాటా, కియా, హ్యుందాయ్‌ కూడా బలమైన ఎంపికలు అందిస్తున్నాయి. మీ బడ్జెట్‌లో మైలేజ్‌, టార్క్‌, పెర్ఫార్మెన్స్‌ అన్నీ కావాలంటే - ఈ లిస్ట్‌ను మళ్లీ చెక్‌ చేసి ఒక బెస్ట్‌ కారును ఎంచుకోండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget