Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!
Best Electric Scooters in India: ప్రస్తుతం మనదేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.
Best Electric Scooters: భారతదేశంలో వివిధ ధరల శ్రేణుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లు పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా, వాటి ఐసీఈ వేరియంట్లతో పోలిస్తే తక్కువ మెయింటెయిన్స్ ఖర్చులను కలిగి ఉంటాయి. ప్రస్తుత భారత దేశ మార్కెట్లో అత్యుత్తమంగా పరిగణిస్తున్న ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
ఏథర్ ఎనర్జీ 450ఎక్స్ జెన్ 3 (Ather Energy 450x Gen 3)
2022 జూలైలో ఏథర్ ఎనర్జీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడో తరం మోడల్‌ను ఏథర్ 450ఎక్స్ జెన్ 3 పేరుతో విడుదల చేసింది. దీనిలో అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటార్ 8.7 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఆల్-అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టైర్ల కోసం కొత్త ట్రెడ్ ప్రొఫైల్‌తో పాటు కొత్త టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.39 లక్షలుగా ఉంది.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఎక్స్ (డ్యూయల్ బ్యాటరీ) (Hero Electric Optima CX Dual Battery)
హీరో ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ కూడా ఒకటి. ఇందులో డ్యూయల్ బ్యాటరీ మోడల్‌ను ఉపయోగించారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్లు చక్కగా ప్రయాణం చేయవచ్చు. ఇది డిటాచబుల్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. అంటే మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ అవసరం లేకుండా ఇంట్లో బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. కాబట్టి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.85,190గా ఉంది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ (Bajaj Chetak Electric)
బజాజ్ చేతక్‌ను ఎలక్ట్రిక్ మోడల్‌గా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. స్కూటర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అడ్వాన్స్‌డ్‌గా కూడా ఉంది. ఇక దీన్ని స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే దీని రేంజ్ 108 కిలోమీటర్లుగా ఉంది. కేవలం ఒక గంటలో దీని బ్యాటరీని 25 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే ఇది పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 గంటలు పడుతుంది. ఇది ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. బజాజ్ చేతక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,21,000 నుండి ప్రారంభం కానుంది.
ఓలా ఎస్1 ప్రో జెన్2 (Ola S1 Pro Gen2)
ఓలా ఎస్1 ప్రో జెన్2 అనేది కంపెనీ లాంచ్ చేసిన ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 195 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉంది. కేవలం 2.6 సెకన్లలో సున్నా నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6.5 గంటలు పడుతుంది. అనేక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓలా ఎస్1 ప్రో జెన్2 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,47,499గా నిర్ణయించారు.
హీరో విడా వీ1 (Hero Vida V1)
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) సబ్ బ్రాండ్ విడా (Vida) గత సంవత్సరం విడా వీ1 పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ విడా వీ1 ప్లస్, విడా వీ1 ప్రో అనే రెండు వేరియంట్లలో వస్తుంది. ఫీచర్లు, స్పెక్స్ గురించి చెప్పాలంటే రెండు వేరియంట్‌లకు సంబంధించిన గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది. అయితే వీ1 ప్రో 3.2 సెకన్లలో 0 నుంచి గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదు. విడా వి1 ప్లస్‌కు 3.4 సెకన్ల సమయం పట్టనుంది.
ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే వీ1 ప్రో 163 కిలోమీటర్లు, వీ1 ప్లస్ 143 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. ఇది పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. 65 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,28,000 నుంచి ప్రారంభమవుతుంది.
Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial