అన్వేషించండి

Tata Sierra Real World Mileage: సిటీలో, హైవేపై నిజ జీవితంలో వచ్చిన మైలేజ్‌ వివరాలు

టాటా సియెర్రా డీజిల్‌ ఆటోమేటిక్‌ నిజ జీవిత మైలేజ్‌ టెస్ట్‌ వివరాలు ఇవి. సిటీ, హైవేలో ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్కకు ఎంత దగ్గరగా ఉందో తెలుసుకోండి.

Tata Sierra Real World Mileage: కొత్త టాటా సియెర్రా మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి డిజైన్‌, స్పేస్‌, ప్రీమియం ఫీల్‌ కారణంగా భారీగా ఆకర్షిస్తోంది. పాత సియెర్రా పేరును తిరిగి తీసుకువచ్చిన టాటా మోటార్స్‌, ఈసారి ఆధునిక టెక్నాలజీతో, స్మార్ట్‌ ప్యాకేజింగ్‌తో ఈ SUVను రూపొందించింది. పెట్రోల్‌, టర్బో పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో, రూ. 11.49 లక్షల నుంచి రూ. 21.29 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర పరిధిలో ఇది అందుబాటులో ఉంది.

అయితే, ఈ కారును కొనాలనుకుంటున్న చాలా మంది అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్న ఒక్కటే - నిజ జీవితంలో ఈ కార్‌ ఎంత మైలేజ్‌ ఇస్తోంది?. సాధారణంగా, కంపెనీ చెప్పే గణాంకాలు వేరే - రోజువారీ వాడకంలో వచ్చే లెక్కలు వేరే అని అందరికీ తెలుసు. అందుకే, ఈ కథనంలో టాటా సియెర్రా డీజిల్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌కు సంబంధించిన రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ వివరాలను తెలుసుకుందాం.

డీజిల్‌ ఆటోమేటిక్‌లో డ్రైవ్‌ మోడ్‌లు

టాటా సియెర్రా డీజిల్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌లో రెండు డ్రైవ్‌ మోడ్‌లు ఉన్నాయి - సిటీ, స్పోర్ట్‌. ఇంధన పొదుపు కోసం ప్రత్యేకంగా ఉండే ఎకానమీ మోడ్‌, ఆటోమేటిక్‌ ఇంజిన్‌ స్టాప్‌-స్టార్ట్‌ సిస్టమ్‌ ఇందులో లేవు. ఈ ఫీచర్లు లేకపోవడం వల్ల మైలేజ్‌పై ప్రభావం ఉంటుందేమో అనే అనుమానం చాలామందికి ఉంటుంది.

ఈ SUVలో 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 118hp శక్తి, 280Nm టార్క్‌ను ఇస్తుంది. ఇదే ఇంజిన్‌ టాటా నెక్సాన్‌లో కూడా కనిపిస్తుంది. అయితే, సియెర్రాలో అవుట్‌పుట్‌ కొద్దిగా పెరిగింది. మరో ముఖ్యమైన తేడా గేర్‌బాక్స్‌. నెక్సాన్‌లో డీజిల్‌ AMT ఉండగా, సియెర్రాలో 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఇచ్చారు.

సిటీ డ్రైవింగ్‌లో మైలేజ్‌

నిజ జీవిత టెస్టింగ్‌లో, ఎక్స్‌పర్ట్‌లు సిటీ మోడ్‌లో నడిపినప్పుడు టాటా సియెర్రా డీజిల్‌ ఆటోమేటిక్‌ లీటరుకు 11.53 కి.మీ. మైలేజ్‌ నమోదు చేసింది. ట్రాఫిక్‌, సిగ్నల్స్‌, AC వాడకం వంటి సాధారణ పరిస్థితుల్లో ఈ లెక్క రావడం గమనార్హం. SUV సైజ్‌, బరువు దృష్టిలో పెట్టుకుంటే, ఇది మంటి సంఖ్యగానే చెప్పుకోవచ్చు.

హైవే మీద ఇంధన సామర్థ్యం

హైవే డ్రైవింగ్‌లో ఈ SUV మరోసారి ఆశ్చర్యపరిచింది. స్థిరమైన వేగంతో నడిపినప్పుడు లీటరుకు 14.56 కి.మీ. మైలేజ్‌ ఇచ్చింది. ఇది, పెద్ద 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో వచ్చే టాటా హారియర్‌ మైలేజ్‌కు దగ్గరగా ఉండటం విశేషం. దీని వల్ల, లాంగ్‌ డ్రైవ్స్‌, హైవే ట్రిప్స్‌ ఎక్కువగా చేసే వారికి సియెర్రా మంచి ఎంపికగా మారుతుంది.

మొత్తం సగటు మైలేజ్‌

సిటీ, హైవే రెండింటినీ కలిపి చూసుకుంటే, టాటా సియెర్రా డీజిల్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌కు సగటు రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ లీటరుకు 13.05 కి.మీ.లుగా నమోదైంది.

టెస్ట్‌ ఎలా నిర్వహించారు?

ఎక్స్‌పర్ట్‌లు, ఈ రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌కు ముందు కార్‌ ట్యాంక్‌ను పూర్తిగా నింపారు. కంపెనీ సూచించిన టైర్‌ ప్రెషర్‌ పాటించారు. నగరం, హైవేలో ఫిక్స్‌డ్‌ రూట్లలో, ఒకే వ్యక్తితో కారును నడిపారు. ACని 22 డిగ్రీల వద్ద ఫుల్‌ ఆటో మోడ్‌లో ఉపయోగించారు. సాధారణ వినియోగదారుడు చేసేలా ఆడియో సిస్టమ్‌, ఇండికేటర్లు వంటివి వాడారు. ప్రతి రన్‌ తర్వాత మళ్లీ ట్యాంక్‌ నింపి మైలేజ్‌ను లెక్కించారు.

కంపెనీ లెక్కకు దగ్గరగానే ఉందా?

మొత్తానికి, కంపెనీ ప్రకటించిన గణాంకాలకు చాలా దగ్గరగా సియెర్రా నిజ జీవితంలో మైలేజ్‌ ఇస్తోంది అని చెప్పవచ్చు. భారీ SUV అయినప్పటికీ, డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఈ స్థాయి ఇంధన సామర్థ్యం ఇవ్వడం టాటా సియెర్రాకు ప్లస్‌ పాయింట్‌. రోజువారీ వాడకం, లాంగ్‌ డ్రైవ్స్‌ రెండింటికీ ఇది బ్యాలెన్స్‌డ్‌ ప్యాకేజీగా కనిపిస్తోంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.లక్ష లోపులో వచ్చే బజాజ్ బైక్‌లు, స్కూటర్లు.. ఈ 8 టూవీలర్లలో ఒకటి ఎంచుకోవచ్చు!
డైలీ జర్నీ నుంచి స్పోర్టీ రైడ్ వరకు.. రూ.లక్షలోపే వచ్చే ఈ బజాజ్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!
2026 Bajaj Pulsar 125 రివ్యూ: కేవలం కమ్యూటర్ బైక్ కాదు.. కొత్త ఇంజిన్, కొత్త ఫ్రేమ్, కొత్త టెక్నాలజీ!
బజాజ్ పల్సర్ 125 రివ్యూ.. ధరకు తగ్గ బైక్ మాత్రమే కాదు, పాత బండితో పోలిస్తే భారీ మార్పులు!
ఒకే కారు.. నాలుగు రకాల పవర్‌ట్రెయిన్‌లు! టాటా నెక్సాన్‌లో మీ అవసరానికి తగిన బెస్ట్ ఆప్షన్ ఏదంటే?
టాటా నెక్సాన్‌ పెట్రోల్‌ vs డీజిల్‌ vs సీఎన్‌జీ vs ఈవీ.. తేడాలేంటి, ఏది మీకు సరైనది?
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget