అన్వేషించండి

Tata Nexon vs Skoda Kylaq: GST తర్వాత ధర, ఇంజిన్, ఫీచర్ల పరంగా బెటర్‌ ఆప్షన్‌ ఏది?

Tata Nexon vs Skoda Kylaq: సేఫ్టీ ఫీచర్లలో టాటా నెక్సాన్ & స్కోడా కైలాక్ ఒకదానికొకటి ఏ మాత్రం తీసిపోవు, రెండూ బలమైన పోటీ కార్లు. ఇంజిన్, ఇతర ఫీచర్లు & ధరల గురించి తెలుసుకుందాం.

Tata Nexon vs Skoda Kylaq Price Features Comparison: మన మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు ఎదురు లేకుండా పోయింది, వీటి సేల్స్‌ ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. ఈ డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రతి కారు కంపెనీ కూడా కాంపాక్ట్‌ SUVలనే ఎక్కువగా లాంచ్‌ చేస్తోంది. ఇప్పుడున్న పోటీలో, టాటా నెక్సాన్ & స్కోడా కైలాక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు SUVలు, తమ కస్టమర్లకు పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌, మోడ్రన్‌ ఫీచర్లను అందిస్తాయి & అందుబాటు ధరల్లోనే లభిస్తాయి.

ఇంజిన్

టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ & CNG ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. దీని 1.2 లీటర్ CNG ఇంజిన్ 73.5 PS పవర్ & 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 88.2 PS పవర్ & 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్‌ ఇంజిన్  84.5 PS పవర్ & 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు రెండూ ఉన్నాయి, మీ స్టైల్‌ను బట్టి ఒకటి ఎంచుకోవచ్చు. 

స్కోడా కైలాక్ 1.0 లీటర్ TSI ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది 85 kW పవర్ & 178 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ & DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తుంది.

ఫీచర్లు

టాటా నెక్సాన్‌లో షార్క్ ఫిన్ యాంటెన్నా, బై-ఫంక్షన్ ఫుల్ LED హెడ్‌లైట్లు, LED DRLs, రూఫ్ రెయిల్స్‌ & పనోరమిక్ సన్‌రూఫ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఇది 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, 360 డిగ్రీల కెమెరా & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన లక్షణాలను కూడా అందిస్తుంది. 

స్కోడా కైలాక్ కూడా టాటా నెక్సాన్‌కు ఏ మాత్రం తగ్గదు. మెరిసే బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, LED హెడ్‌లైట్లు & టెయిల్‌లైట్లు, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ & ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్లను ఇది కలిగి ఉంది. ఇది పెద్ద డిజిటల్ క్లస్టర్, 25.6 సెంటీమీటర్ల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ & ట్రంక్‌లో మూడు కిలోవాట్ హుక్ వంటి ప్రాక్టికల్‌ ఫీచర్లను కూడా అందిస్తుంది.

భద్రత

టాటా నెక్సాన్ - ABS, EBD, ఆరు ఎయిర్‌ బ్యాగులు, హిల్ హోల్డ్ కంట్రోల్, ESP, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ట్రాక్షన్ కంట్రోల్, TPMS & పార్కింగ్ సెన్సార్లు వంటి చాలా కీలకమైన ఫీచర్లతో వచ్చింది. 

స్కోడా కైలాక్ కూడా భద్రతలో అద్భుతంగా ఉంది, 25కి పైగా యాక్టివ్ & పాసివ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. వీటిలో - ఆరు ఎయిర్‌ బ్యాగులు, ESC, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బ్రేక్ డిస్క్ వైపింగ్ & మల్టీ-కొలిషన్ బ్రేకింగ్ వంటి అధునాతన సాంకేతికతలు ఉన్నాయి.

ధర

ధర పరంగా టాటా నెక్సాన్ మరింత సరసమైనది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.32 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.05 లక్షల వరకు ఉంటుంది. 

స్కోడా కైలాక్ రూ. 7.54 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 12.79 లక్షల వరకు ఉంటుంది.

ఏ SUV మంచిది?
మీకు మంచి బడ్జెట్‌లో ఉండి, మల్టీ-ఇంజిన్ SUV కోసం చూస్తున్నట్లయితే టాటా నెక్సాన్ మంచి ఎంపిక. మీరు మరింత ప్రీమియం డిజైన్, అంతర్జాతీయ అనుభూతి & అధునాతన భద్రత లక్షణాలను ఇష్టపడితే స్కోడా కైలాక్ బలమైన ఎంపిక. రెండు SUVలు ఒకదానికొకటి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన ప్యాకేజీలను అందిస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
India vs South Africa: గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!
గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!
Cheating bride: పెళ్లి కాగానే డబ్బు, బంగారంతో పెళ్లికూతురు జంప్ - వరంగల్ పెళ్లికొడుక్కి షాక్ !
పెళ్లి కాగానే డబ్బు, బంగారంతో పెళ్లికూతురు జంప్ - వరంగల్ పెళ్లికొడుక్కి షాక్ !
Advertisement

వీడియోలు

Who is Senuran Muthusamy | ఎవరి సెనూరన్ ముత్తుసామి ? | ABP Desam
Blind T20 Women World Cup | చారిత్రాత్మక విజయం సాధించిన అంధుల మహిళ క్రికెట్ టీమ్ | ABP Desam
India vs South Africa Second Test Match Highlights | భారీ స్కోరుకు సఫారీల ఆలౌట్ | ABP Desam
India vs South Africa ODI | టీమిండియా ODI స్క్వాడ్ పై ట్రోల్స్ | ABP Desam
Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
India vs South Africa: గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!
గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!
Cheating bride: పెళ్లి కాగానే డబ్బు, బంగారంతో పెళ్లికూతురు జంప్ - వరంగల్ పెళ్లికొడుక్కి షాక్ !
పెళ్లి కాగానే డబ్బు, బంగారంతో పెళ్లికూతురు జంప్ - వరంగల్ పెళ్లికొడుక్కి షాక్ !
Keerthy Suresh : 'మహానటి' తర్వాత గ్యాప్ - అసలు రీజన్ ఏంటో చెప్పిన కీర్తి సురేష్
'మహానటి' తర్వాత గ్యాప్ - అసలు రీజన్ ఏంటో చెప్పిన కీర్తి సురేష్
Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది -  కవిత వార్నింగ్
నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్
Facts about Dreams : కలల వెనుక దాగి ఉన్న 8 అద్భుతమైన నిజాలు.. మీ మెదడు చెప్పే సందేశాలివే
కలల వెనుక దాగి ఉన్న 8 అద్భుతమైన నిజాలు.. మీ మెదడు చెప్పే సందేశాలివే
Raju Weds Rambai Collection : స్మాల్ మూవీ... బిగ్ సక్సెస్ - 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీకి 3 రోజుల్లోనే ఊహించని కలెక్షన్స్
స్మాల్ మూవీ... బిగ్ సక్సెస్ - 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీకి 3 రోజుల్లోనే ఊహించని కలెక్షన్స్
Embed widget