అన్వేషించండి

TATA Motors: పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్! భారీగా ధరల తగ్గింపు

Punch EV Price Cut: పాపులర్ మోడల్స్ అయిన పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ ధరలను టాటా మోటర్స్ భారీగా తగ్గిస్తోంది. వీటి ధరలను దాదాపు పెట్రోల్, డీజిల్ ధరలకు చేరువ చేసింది.

Nexon EV Price Cut: టాటా మోటార్స్‌లో ఈవీ కారు కొందామనే యోచనలో ఉన్నారా? ముఖ్యంగా నెక్సాన్ ఈవీ లేదా పంచ్ ఈవీ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారా? అయితే, మీకో శుభవార్త. ఈ రెండు మోడళ్ల ధరలను టాటా మోటార్స్ భారీగా తగ్గించింది. దాదాపు టాటాలోని ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడల్స్ ధరలకు చేరువ చేసింది. రాబోయే పండుగ సీజన్ కోసం ఈ రెండు మోడళ్లపై టాటా మోటర్స్ ఏకంగా రూ.3 లక్షల దాకా తగ్గింపు ఇస్తోంది. అంతేకాక, టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో ఆరు నెలలు ఫ్రీ ఛార్జింగ్ వెసులుబాటును కూడా అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన ఫేమ్ (FAME) ద్వారా ప్రోత్సహకాలు తగ్గడంతో కాస్త వెనకబడ్డ ఈవీ అమ్మకాలు.. ఈ ధరల తగ్గింపుతో పుంజుకుంటాయని భావిస్తున్నారు. 

పంచ్ ఈవీ లాంచ్ అయినప్పుడు ప్రారంభ వేరియంట్ ధరనే రూ.11 లక్షల నుంచి అని నిర్ణయించారు. ఇప్పుడు దాని ప్రారంభ ధర రూ.10 లక్షల కన్నా తక్కువకే రానుంది. అటు నెక్సాన్ కూడా రూ.12.49 లక్షల నుంచే మొదలు కానుంది. నెక్సాన్ లో టాప్ ఎండ్ రూ.16.2 లక్షలు కాగా అందులో భారీగా తగ్గింపు వర్తించనుంది. ఫలితంగా ఈవీ ధరలు దాదాపుగా పెట్రోల్, డీజిల్ కార్ల రేంజ్‌ చేరువకు వచ్చాయి. 

ఐసీఈలో నెక్సాన్ ధర రూ.8 నుంచి 15.8 లక్షల మధ్య ఉంది. అయితే వీటి టాప్ ఎండ్ వేరియంట్‌లు ఈవీ ధరలకు సమానం కానున్నాయి. ఇక పంచ్ ఐసీఈ అయితే ఇప్పటికీ చౌకగా ఉంది పెట్రోల్ పంచ్‌కు ప్రారంభ ధర రూ.6.13 లక్షలు కాగా.. టాప్ ఎండ్ రూ.10 లక్షలుగా ఉంది. పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీలు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఉంటాయి. ప్రతిరోజూ ఉపయోగించేవారికి ప్రతి కిలో మీటర్ కి అతి తక్కువ ఖర్చు ఈవీ ద్వారా సాధ్యపడుతుంది. 

పైగా పెట్రోల్ కార్లతో పోలిస్తే, ఈవీలు నడపడానికి చాలా స్మూత్‌గా, సున్నితంగా ఉంటాయి. అంటే అవి నగరంలో తిరిగేవారికి చాలా అనుకూలమైనవి. ఏదేమైనప్పటికీ ఛార్జింగ్ వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికీ ఒక సమస్యగా మిగిలిపోయింది. కొంత వరకు రీసేల్ విలువతో పాటు రేంజ్ పరంగా సుదూర డ్రైవింగ్ కూడా ఈవీల ద్వారా సాధ్యం అవుతోంది. దీంతో ఈవీలను సిటీలో ఉపయోగించినట్లయితే ఇంట్లో ఛార్జ్ చేయడం ద్వారా చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, అలాంటి వారికి ఈ రెండు ఈవీలు చౌకగా ఉండటం వల్ల సిటీ వినియోగానికి కన్సిడర్ చేయవచ్చు. ఈ ఆఫర్ అక్టోబరు 31 వరకు అమలవుతుందని కంపెనీ తెలిపింది.

టాప్ హెడ్ లైన్స్

5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Hero Xpulse 210 రియల్‌ రివ్యూ - 5,600km తిరిగిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget