Tata Curvv EV Dark Edition: ఒకసారి ఛార్జ్ చేస్తే నాన్ స్టాప్‌గా 500 కిలోమీటర్లు, బ్లాక్ వేరియెంట్ ఈవీ రిలీజ్ చేసిన టాటా మోటార్స్
Tata Curvv EV Dark Edition Price: నెక్సాన్ EV తర్వాత, టాటా మోటార్స్ ఇప్పుడు కర్వ్ EV డార్క్ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఈ కారును పూర్తి బ్లాక్ థీమ్‌తో మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఈ ఎడిషన్ ధర స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ.

Tata Curvv EV Dark Edition: టాటా మోటార్స్ సంస్థ మరో ఎలక్ట్రిక్ కారును భారత్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. టాటా కర్వ్ EVలో ఇప్పటి వరకు ఉన్న వాటికి భిన్నంగా డార్క్ ఎడిషన్ పేరుతో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ డార్క్ మోడల్‌లో రెండు వెహికల్స్‌ను ఈ మధ్యే విడుదల చేసింది.
టాటా కర్వ్ EV డార్క్ ఎడిషన్ ధర?
టాటా కర్వ్ EV కి చెందిన ఈ కొత్త డార్క్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 22.24 లక్షలు. ఈ కారు 55 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన కర్వ్ EV టాప్-స్పెక్ వేరియంట్ ఎంపవర్డ్+ A ట్రిమ్ ఆధారంగా రూపొందించారు. ఈ టాటా కారు దాని బేసిక్ మోడల్ కంటే రూ. 25,000 ఖరీదైనది.
టాటా కర్వ్ EV ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD) మోటారుతో అమర్చి ఉంది, ఇది 167 hp శక్తిని, 215 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఉన్న 55 kWh బ్యాటరీ ప్యాక్‌తో, కర్వ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 502 కి.మీ. రేంజ్ ఇస్తుందని పేర్కొంది.
టాటా కర్వ్ EV 8.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఈ కారులో మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, స్పోర్ట్, సిటీ. స్పోర్ట్ మోడ్‌లో, ఈ కారు గరిష్టంగా 160 కి.మీ. వేగంతో నడుస్తుందని పేర్కొంది. ఎకో, సిటీ మోడ్‌లో, ఈ కారు గరిష్టంగా 120 కి.మీ. వేగంతో నడుస్తుంది.
కర్వ్ EVని ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?
ఈ టాటా ఎలక్ట్రిక్ కారును 7.2 kW AC ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. ఈ ఛార్జర్‌తో ఈ కారు 7.9 గంటల్లో 10 శాతం బ్యాటరీ నుంచి 100 శాతం బ్యాటరీకి ఛార్జ్ అవుతుంది. ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది, దీని కారణంగా ఈ కారును 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 40 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీని కోసం 70 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ టాటా ఎలక్ట్రిక్ కారులోని డార్క్ మోడల్ చాలా వేరియంట్స్‌లో విడుదల చేసింది. వాటి వివరాలు ఈ కింద చూడవచ్చు.
వేరియెంట్ | రెగ్యులర్ కర్వ్ ధర | కర్వ్ డార్క్ ఎడిషన్ ధర | తేడా ఎంత? |
ఎకంప్లిష్డ్ ఎస్ టర్బో పెట్రోల్ కారు(మాన్యువల్) | రూ. 16.17 లక్షలు | రూ. 16.49 లక్షలు | రూ. 32వేలు |
ఎకంప్లిష్డ్ ఎస్ డీజిల్ కారు(మాన్యువల్) | రూ. 16.37 లక్షలు | రూ. 16.69 లక్షలు | రూ. 32వేలు |
ఎకంప్లిష్డ్ ఎస్ టర్బో పెట్రోల్ కారు(ఆటోమేటిక్) | రూ. 17.67 లక్షలు | రూ. 17.99 లక్షలు | రూ. 32వేలు |
ఎకంప్లిష్డ్ ప్లస్ A టర్బో పెట్రోల్(మాన్యువల్) | రూ. 17.67 లక్షలు | రూ. 17.99 లక్షలు | రూ. 32వేలు |
ఎకంప్లిష్డ్ ప్లస్ A టర్బో డీజిల్ కారు(మాన్యువల్) | రూ. 17.70లక్షలు | రూ. 18.02 లక్షలు | రూ. 32వేలు |
ఎకంప్లిష్డ్ ఎస్ డీజిల్(ఆటోమేటిక్) | రూ. 17.87 లక్షలు | రూ. 18.19 లక్షలు | రూ. 32వేలు |
ఎకంప్లిష్డ్ ప్లస్ ఏ టర్బో పెట్రోల్ కారు(ఆటోమేటిక్c | రూ. 19.17లక్షలు | రూ. 19.49 లక్షలు | రూ. 32వేలు |
ఎకంప్లిష్డ్ ప్లస్ A టర్బో డీజిల్ కారు( ఆటోమేటిక్) | రూ. 19.20 లక్షలు | రూ. 19.52 లక్షలు | రూ. 32వేలు |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

