Saudi Arabia: టెస్లాకు సౌదీ సవాల్, భారీ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీకి శ్రీకారం
ఆటోమోటివ్ రంగాన్ని సూపర్ ఛార్జ్ చేయానికి సౌదీ అరేబియా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు ఓ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీకి పునాది వేసింది. టెస్లాకు సవాల్ విసురుతూ ఈ కంపెనీ నిర్మాణం చేపట్టబోతుంది.
టెస్లాకు సౌదీ అరేబియా సవాల్
సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్.. దేశంలోనే తొలిసారి ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. Ceer పేరుతో నిర్మించే ఈ కంపెనీ ప్రణాళికలను ఆవిష్కరించారు. సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్, తైవానీస్ టెక్నాలజీ కంపెనీ ఫాక్స్‌కాన్ మధ్య జాయింట్ వెంచర్ గా ఈ కంపెనీ రూపుదిద్దుకోబోతుంది. ఈ కొత్త కంపెనీ జర్మనీకి చెందిన BMW నుంచి లైసెన్స్ పొందిన సాంకేతికతను ఉపయోగించబోతోంది.
టెస్లాతో విభేదాలు, ప్రత్యర్థి కంపెనీలో పెట్టుబడులు
సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) గతంలో ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లాలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. అయితే, 2019లో దాని మల్టీబిలియన్ డాలర్ల వాటాను దాదాపుగా విక్రయించింది. 2018లో ఎలక్ట్రిక్ కార్ కంపెనీని కొనుగోలు చేసేందుకు టెస్లా చేసిన విఫల ప్రయత్నంపై PIF, మస్క్ మధ్య విభేదాలు వచ్చాయి. US కోర్టు కేసులో భాగంగా వెల్లడైన టెక్స్ట్ మెసేజ్ ల ప్రకారం.. PIFకి చెందిన షేర్లను షేరుకు $420 చొప్పున ప్రైవేట్‌గా తీసుకునే ప్రయత్నాలు చేశాడు మస్క్. ఈ నేపథ్యంలో విబేధాలు వచ్చాయి. సౌదీలో టెస్లా ఫ్యాక్టరీని నిర్మించాలని అధికారులు కోరినా, మస్క్ ఆ దిశగా ఆలోచించలేదు. ఈ నేపథ్యంలో మస్క్ తో సంబంధాలు తెంచుకునే ప్రయత్నం చేసింది. సౌదీ అరేబియా అప్పటి నుంచి ప్రత్యర్థి ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ లూసిడ్ మోటార్స్‌లో భారీగా పెట్టుబడి పెట్టింది. $1 బిలియన్ పంపింగ్ చేసింది. ఈ నేపథ్యంలో లూసిడ్ సౌదీలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తోంది.
‘విజన్ 2030’కి సౌదీ శ్రీకారం
ప్రస్తుతం సౌదీ రాజు సల్మాన్ ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక ప్రాజెక్టుల చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ‘విజన్ 2030’కి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నియోమ్ అని పిలువబడే $500 బిలియన్ల మెగాసిటీ, ది లైన్ అనే 110-మైళ్ల పొడవైన నగరాన్ని నిర్మించబోతుంది.
PIF, Foxconn జాయింట్ వెంచర్
Ceer ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ PIF, Foxconn మధ్య జాయింట్ వెంచర్ గా రూపొందుతోంది. ఐఫోన్లను అసెంబ్లిగ్ చేసే ఈ తైవాన్ కంపెనీ ప్రపంచంలోని సగం ఎలక్ట్రిక్ కార్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా దాని స్వంత ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ వాహనాలను రివీల్ చేసింది. $150 మిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని సృష్టించడంతో పాటు దేశంలో 30,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని సౌదీ జాయింట్ వెంచర్ ప్రతినిధులు తెలిపారు. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు సిద్ధం అవుతాయని తెలిపారు. "సౌదీ అరేబియా కేవలం కొత్త ఆటోమోటివ్ బ్రాండ్‌ను నిర్మించడమే కాదు, మేము కొత్త పరిశ్రమకు నాంది పలుకుతున్నాం" అని సౌదీ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ తెలిపారు. మొత్తంగా సౌదీ సర్కారు నిర్ణయంతో టెస్లాకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. సౌదీలో మస్క్ కంపెనీ పూర్తిగా ప్యాకప్ అయ్యే అవకాశం ఉంది.
Read Also: టీవీఎస్ ఐక్యూబ్ - ఓలా ఎస్1 ఎయిర్, వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ అంటే?