అన్వేషించండి

Royal Enfield Sales: జూన్‌లో భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు - ఆ ఒక్క విషయంలో మాత్రం ఇంకా వెనకే!

2023 జూన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మంచి అమ్మకాలను సాధించింది.

Royal Enfield Sales Report: రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 జూన్‌కు సంబంధించిన విక్రయాల లెక్కలను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. అయితే ఎగుమతుల్లో మాత్రం కంపెనీ పనితీరు ఆశాజనకంగా లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 77,109 యూనిట్ల విక్రయంతో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 రెండో త్రైమాసికంలో విక్రయించిన 1,87,205 యూనిట్ల నుంచి 2023 రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 22 శాతం పెరిగి 2,27,706 యూనిట్లకు చేరుకున్నాయి. 

అమ్మకాలు అప్... ఎగుమతులు డౌన్...
2023 జూన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్ 34 శాతం పెరిగి 67,495 యూనిట్లకు చేరుకుంది. ఇది జూన్ 2023లో 50,265 యూనిట్ల కంటే తక్కువే. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, మీటియోర్ వంటి మోడల్‌లు ఉన్నాయి. ఇవి అత్యధికంగా అమ్ముడయ్యాయి.

అయినప్పటికీ 2023 మేలో దేశీయ మార్కెట్‌లలో విక్రయించిన 70,795 మోటార్‌సైకిళ్లతో పోలిస్తే నెలవారీ క్షీణతను రాయల్ ఎన్‌ఫీల్డ్ నమోదు చేసింది. అలాగే 2023 జూన్‌లో ఎగుమతులు కూడా 14 శాతం తగ్గి 9,614 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 జూన్‌లో 11,142 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు సంవత్సరంలో ఎగుమతి చేసిన 29,563 యూనిట్లతో పోలిస్తే, 2023-24 ఆర్థిక సంవత్సర కాలంలో వార్షిక ఎగుమతులు 31 శాతం తగ్గి 20,535 యూనిట్లకు చేరుకున్నాయి.

కొత్త మోడల్స్ ఎంట్రీ
రాబోయే కొన్నేళ్లలో అనేక కొత్త మోటార్‌సైకిళ్లను తన పోర్ట్‌ఫోలియోలోకి తీసుకురానున్నట్లు ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. కంపెనీ ప్లాన్ ప్రకారం 350 సీసీ సెగ్మెంట్లో రెండు, 450 సీసీ సెగ్మెంట్లో ఐదు, 650 సీసీ సెగ్మెంట్లో ఆరు బైకులు విడుదల కానున్నాయి. అంటే ఓవరాల్‌గా 13 బైకులన్న మాట. కంపెనీ ప్రతి సంవత్సరం నాలుగు కొత్త బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది.

నేపాల్‌లో కొత్త ప్లాంట్‌
ఇటీవల ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 టెస్టింగ్‌లో గుర్తించారు. విడుదల తర్వాత ఇది కేటీయం 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జీ310, రాబోయే హీరో ఎక్స్‌పల్స్ 440తో పోటీ పడనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నేపాల్‌లో కూడా తన వాహనాలను విక్రయించడం ప్రారంభించింది. భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో దాని పనితీరును మరింత మెరుగుపరిచేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఐదో అంతర్జాతీయ సీకేడీ అసెంబ్లీ యూనిట్‌ను దేశంలో ఏర్పాటు చేసింది.

త్రివేణి గ్రూప్‌తో కలిసి నిర్మించిన ఈ కొత్త ఫ్యాక్టరీ నేపాల్‌లోని బిర్‌గంజ్‌లో ఉంది. బ్రెజిల్, థాయిలాండ్, కొలంబియా, అర్జెంటీనా వంటి దేశాల నుండి ఇతర సౌకర్యాలు ఇందులో చేరాయి. ఈ కేంద్రం ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సంవత్సరానికి 20,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. క్లాసిక్ 350, స్క్రాంబ్లర్ 411 అసెంబ్లీ మొదట ఇక్కడ ప్రారంభమవుతుంది.

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Embed widget