అన్వేషించండి

Road Trip Tips: వీకెండ్‌లో రోడ్‌ ట్రిప్‌కు కార్ రెడీ చేయాలా? - తప్పనిసరిగా చెక్‌ చేయాల్సిన 10 ముఖ్య విషయాలు

వీకెండ్‌లో రోడ్‌ ట్రిప్‌కు కార్ రెడీ చేయడం చాలా ముఖ్యం. హెడ్‌ల్యాంప్స్‌ నుంచి టైర్ల వరకూ చెక్‌ చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ చిట్కాలతో మీ ప్రయాణం పూర్తి సురక్షితంగా సాగుతుంది.

Car Maintenance Guide India: వీకెండ్‌ వచ్చిందంటే చాలామందికి మొదటి ఆలోచన - ఒక రోడ్‌ ట్రిప్‌. సిటీ హడావుడి నుంచి బయటపడి కొండకోనల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ ఈ హడావిడి నుంచి ఉపశమనం కోరుకుంటారు. అయితే... రోడ్‌ ట్రిప్‌ కోసం ప్లాన్‌ చేయడమంటే బ్యాగులు సర్దుకోవడం, హోటల్ బుకింగ్‌ చేసుకోవడం మాత్రమే కాదు… మీ కార్‌ను కూడా అలాగే సిద్ధం చేయాలి. ఎందుకంటే, లాంగ్‌ డ్రైవ్‌లో కారుపై పడే ప్రభావం ఎక్కువ. చిన్న పొరపాటు జరిగినా అయినా ట్రిప్ మొత్తం ఇబ్బందులు తెస్తుంది. అందుకే ఈ చెక్‌లిస్ట్‌ను తప్పకుండా ఫాలో అవ్వండి.

హెడ్‌ల్యాంప్స్‌, టెయిల్‌లైట్స్‌: నైట్ డ్రైవ్‌లో లైట్స్‌ పర్ఫెక్ట్‌గా ఉండాలి
యువతలో ఎక్కువ మంది తెల్లవారుజామున లేదా రాత్రి డ్రైవ్‌ చేయడం ఇష్టపడతారు. కాబట్టి కార్‌లోని హెడ్‌ల్యాంప్స్‌, టెయిల్‌లైట్స్‌, బ్రేక్‌ లైట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయా అని ముందుగానే చెక్‌ చేసుకోండి. లైట్లలో డిమ్‌ లేదా ఫ్లికర్ కనిపించినా వెంటనే రీప్లేస్ చేయడం మంచిది. హైవేపై ఇవే మీ ప్రధాన సేఫ్టీ.

ఎయిర్ కండిషనింగ్‌: అసలు కాంప్రమైజ్‌ కావద్దు
లాంగ్‌ డ్రైవ్‌లో AC పనిచేయకపోతే ప్రయాణం మొత్తం కష్టమవుతుంది. కాబట్టి... AC కూలింగ్, ఫిల్టర్ కండిషన్, బ్లోవర్ ఎఫిషియెన్సీని వెంటనే చెక్ చేయించుకోండి. లాంగ్‌ డ్రైవ్‌లో చిరాకు లేకుండా AC పెద్ద రిలీఫ్ ఇస్తుంది.

ఇంజిన్ ఆయిల్‌, కూలెంట్‌, ఇతర ఫ్లూయిడ్స్
లాంగ్ డ్రైవ్‌కు బయలుదేరే ముందు ఇంజిన్ ఆయిల్ లెవెల్ తప్పకుండా చెక్ చేయాలి. కూలెంట్‌ లెవెల్ తక్కువగా ఉంటే, కారు ఓవర్‌హీట్ అవ్వడం సాధారణం. బ్రేక్ ఆయిల్‌, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్, వాషర్ ఫ్లూయిడ్ అన్నీ ఓకేనో, కాదో  చూసుకోవాలి.

వైపర్ బ్లేడ్‌లు: ఎప్పుడైనా వర్షం పడొచ్చు
ఇది తుపానుల కాలం. కాబట్టి వర్షం ఎప్పుడైనా కురువొచ్చు. ముఖ్యంగా, అడవులు - కొండ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షం పడే అవకాశం ఉంటుంది. వైపర్ బ్లేడ్‌లు సరిగ్గా గ్లాస్ క్లియర్ చేస్తున్నాయా, స్ట్రీక్స్ వస్తున్నాయా చూడండి. అవసరమైతే బ్లేడ్‌లను రీప్లేస్ చేయండి.

ఫస్ట్ ఎయిడ్ కిట్: చిన్నదే, అయినా అత్యవసరం
ప్రతి కార్‌లో ఒక ఫుల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. అందులో... బాండేజీలు, యాంటిసెప్టిక్ క్రీమ్‌, పెయిన్ రిలీవర్ టాబ్లెట్లు, గాజ్ రోల్స్ వంటి బేసిక్‌ మెడికల్ ఐటమ్స్ ఉండేలా చూసుకోండి.

టైర్లు & వీల్స్: లాంగ్ డ్రైవ్‌లో ఇవే అసలు హీరో
టైర్లలో ట్రెడ్ డెప్త్ సరిగ్గా ఉందా, సైడ్‌వాల్‌లో మడతలు ఉన్నాయా, ఏదైనా గుచ్చుకుపోయిన గుర్తులు ఉన్నయా అనేవి చెక్ చేయాలి. ట్రిప్ మొదలు పెట్టే రోజునే టైర్ ప్రెజర్ చెక్ చేయించుకోండి. స్పేర్ టైర్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి, అది మీ కారులో ఉండాలి. వీల్ అలైన్‌మెంట్ తప్పనిసరిగా చేయించాలి. కొండ ప్రాంతాలకు వెళ్లే వాళ్లు టైర్ హెల్త్ విషయంలో డబుల్ చెక్ చేయాలి.

హార్న్: ఇండియన్ రోడ్లపై లైఫ్ సేవర్
హైవేలో హార్న్ పనిచేయకపోతే సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. కొండ ప్రాంతాల్లో ఉండే హెయిర్‌పిన్ టర్న్స్‌లో హార్న్ చాలా ముఖ్యం. వైర్లు సరిగ్గా కనెక్ట్ అయ్యాయా, సౌండ్ క్లియర్‌గా వస్తుందా చూసుకోండి.

నావిగేషన్ యాప్స్ & బ్యాకప్ మ్యాప్‌లు
Google Maps / Apple Maps ఉండటం మంచిదే. కానీ నెట్‌కనెక్టివిటీ లేకపోయే ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్‌లోడ్ చేయండి. అదనంగా ఒక పేపర్ మ్యాప్ కూడా పెట్టుకుంటే బెటర్.

ఇన్‌కార్ ఎంటర్‌టైన్‌మెంట్: లాంగ్ డ్రైవ్‌కు చాలా అవసరం
మ్యూజిక్ లేకుండా లాంగ్ డ్రైవ్ బోరింగ్‌ అవుతుంది. కేబుల్స్‌, పవర్‌బ్యాంక్, బ్లూటూత్ సెట్టింగ్స్ అన్నీ ముందుగానే చెక్ చేసుకోండి.

అండర్‌కారేజ్ చెక్: చాలా మంది మిస్ చేసే ముఖ్య విషయం
సర్వీస్ సెంటర్‌లో కార్ కింద భాగాన్ని చెక్ చేయించండి. ఆయిల్ లీకేజ్‌, ఫ్యూయల్ లైన్ లీక్, ఎగ్జాస్ట్ సమస్య వంటివి చూడండి. ఇవన్నీ లాంగ్ డ్రైవ్‌కు పెద్ద రిస్క్.

స్పేర్ పార్ట్స్: చిన్నవైనా ఇవీ చాలా అవసరం
ఫ్యూజ్‌లు, బల్బులు, అడిషనల్ కేబుల్‌లు, మొబైల్ ఛార్జర్ మస్ట్‌. ఫ్యూజ్ బ్లో అయితే వెంటనే మార్చుకోవచ్చు.

ఇలా కార్‌ను ముందుగానే సరిగ్గా సిద్ధం చేసుకుంటే, మీ వీకెండ్‌ రోడ్‌ ట్రిప్ మొత్తం ఫుల్‌ ఎంజాయ్‌మెంట్‌ + సేఫ్‌గా సాగుతుంది. హాయ్‌ ఏ హ్యాపీ జర్నీ.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మైండ్ బ్లోయింగ్ Hero Xoom స్కూటర్ రూ.78 వేలకే.. దీని లోన్‌ వివరాలు, EMI లెక్కలు తెలుసుకోండి
నెలకు కేవలం రూ.1800 కట్టగలిగితే స్టైలిష్‌ స్కూటర్‌ Hero Xoom మీదవుతుంది!
మీ బడ్జెట్‌లో వచ్చే 17 రకాల హీరో బైక్‌లు, స్కూటర్లు.. ధర రూ.1 లక్షలోపే, మీరు ఏది తీసుకుంటారు?
HF Deluxe నుంచి Xtreme 125R వరకు.. రూ.1 లక్షలోనే 17 రకాల హీరో బైక్‌లు, స్కూటర్లు
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ కొనబోతున్నారా? కొత్త ధరలు వచ్చేశాయ్.. ఏ వేరియంట్ ఎంతంటే?
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ పెట్రోల్, CNG వేరియంట్ల ధరలు ఇవే.. రూ.5.99 లక్షలకు ఈ కారు మీదే!
రూ.2 లక్షలు కట్టి Toyota Glanza తీసుకుంటే, 5 లేదా 6 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌లో ఎంత EMI కట్టాలి?
రూ.6.73 లక్షలకే టయోటా ప్రీమియం కారు.. Toyota Glanza ఆన్‌రోడ్‌ ధర, ఏడేళ్ల EMI లెక్క చూశారా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Shobha Shetty: రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
Rithu Chowdary: తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
Avengers End Game Advance Bookings : విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Embed widget