అన్వేషించండి

Driverless Auto: డ్రైవర్ అవసరం లేని ఆటో దూసుకెళ్తోంది, ధర కేవలం రూ 4 లక్షలు, దీని స్పెషాలిటీలు తెలుసుకోండి

Autonomous Auto: ఇది ఎలక్ట్రిక్‌ వెహికల్‌. ఈ త్రీ-వీలర్‌ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇంకా, ఆకట్టుకునే ఇన్నోవేటివ్‌ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఒమేగా సీకి మొబిలిటీ 'స్వయంగతి' అనే డ్రైవర్‌లేని ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ప్రారంభించింది.
  • ఈ ఆటో వాణిజ్య వినియోగం కోసం, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కుల్లో వాడొచ్చు.
  • స్వయంగతి ప్యాసింజర్ వేరియంట్ ధర రూ. 4 లక్షలు, కార్గో వేరియంట్ త్వరలో వస్తుంది.
  • Li-dar, GPS, AI ఆధారిత ఈ ఆటో 120 కి.మీ. రేంజ్‌ అందిస్తుంది.

Omega Seiki Launches Self-Driving Electric Three-Wheeler: మీరు ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు, డ్రైవర్‌ లేని ఆటో వెళ్తుంటే చూసి భయపడొద్దు. అది అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కావచ్చు. అంటే, డ్రైవర్‌ అవసరం లేని ఆటో అన్నమాట. ఒమేగా సీకి మొబిలిటీ, ప్రపంచంలోని మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ " స్వయంగతి" (Swayamgati) ని ఇండియాలో లాంచ్‌ చేసింది. ఈ త్రీ-వీలర్ ధర, ఇతర సాధారణ ఆటోల తరహాలోనే, సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది. 'స్వయంగతి' అటానమస్‌ ఆటోను వాణిజ్య వినియోగానికి ఉపయోగించుకోవచ్చు. ఈ త్రీ-వీలర్ ఇప్పుడు బుకింగ్‌లకు అందుబాటులో ఉంది మరియు డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా, వచ్చే రెండు సంవత్సరాలలో 1,500 స్వయంప్రతిపత్త త్రీ-వీలర్‌లను ఉత్పత్తి చేయాలని ఒమేగా సీకి మొబిలిటీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఒమేగా సీకి మొబిలిటీ, తన OSM ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ & AI-ఆధారిత స్వయం ప్రతిపత్తి వ్యవస్థపై 'స్వయంగతి' ఆటోను నిర్మించింది. విమానాశ్రయాలు, స్మార్ట్ క్యాంపస్‌లు, పారిశ్రామిక పార్కులతో పాటు రద్దీగా ఉండే చోట్ల కూడా స్వల్ప-దూర రవాణా కోసం డ్రైవర్ అవసరం లేని ఈ ఆటోను సులభంగా నడపవచ్చు.​           

అటానమస్ త్రీ-వీలర్ ధర ఎంత?
ఒమేగా సీకి మొబిలిటీ, స్వయంగతి ప్యాసింజర్ వేరియంట్ ధరను రూ. 4 లక్షలుగా & కార్గో వేరియంట్ ధరను రూ. 4.15 లక్షలుగా నిర్ణయించింది. అయితే, కార్గో వేరియంట్ ఇంకా లాంచ్ కాలేదు, త్వరలో దీనిని ప్రవేశపెట్టవచ్చు.       

"స్వయంగతి ప్రారంభం కేవలం ఒక ఉత్పత్తి ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశంలో రవాణా భవిష్యత్తును రూపొందించే ఒక అడుగు. స్వయంప్రతిపత్త వాహనాలు ఒక కల కాదు, నేటి అవసరం. AI & Li-dar వంటి సాంకేతికతలను భారతదేశంలో & మరింత అందుబాటు ధరకు అభివృద్ధి చేయవచ్చని స్వయంగతి రుజువు చేస్తుంది. స్వయంగతితో, భారతదేశం గ్లోబల్‌ ట్రెండ్స్‌ను ఫాలో కావాల్సిన అవసరం లేదని మేము చూపిస్తున్నాం"​- ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకుడు ఉదయ్ నారంగ్

స్వయంగతి త్రీ-వీలర్‌ ఫీచర్లు        
'స్వయంగతి' అనేది అటానమస్‌ ఎలక్ట్రిక్‌ ఆటో. ఈ త్రీ వీలర్ బ్యాటరీని ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అయిన 'స్వయంగతి'లో Li-dar& GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ త్రీ-వీలర్‌ AI-ఆధారితంగా నడుస్తుంది. ఈ సెటప్‌లో లి-డార్ టెక్నాలజీ, GPS, ఆరు మీటర్ల వరకు అడ్డంకి గుర్తింపు, మల్టీ-సెన్సార్ నావిగేషన్ & రిమోట్ భద్రత నియంత్రణలు ఉన్నాయి. ఇవి, డ్రైవర్ జోక్యం అవసరం లేకుండా ముందస్తుగా-మ్యాప్ చేసిన మార్గాల్లో ఆటో ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి.   

విమానాశ్రయాలు, టెక్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, స్మార్ట్ సిటీలు, క్యాంపస్‌లు & పారిశ్రామిక కేంద్రాలను దృష్టిలో పెట్టుకుని  కోసం కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను రూపొందించింది.           

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget