అన్వేషించండి

Hero Vida VX2: పెట్రోల్ టెన్షన్ పోయే!, హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 45,000 రూపాయలకే!

New Hero Elecric Scooter: హీరో బ్రాండ్‌ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ Go వేరియంట్ 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీతో 92 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది, దీనికి IDC సర్టిఫైడ్ ఉంది.

Hero Vida VX2 Price, Range And Features In Telugu: భారత మార్కెట్లో పెట్రోల్‌ లేదా డీజిల్‌ బాధల నుంచి విముక్తి పొందాలని, తమకు సాధ్యమైనంత మేర కాలుష్యం తగ్గించాలన్న ఆలోచన ప్రజల్లో పెరుగుతోంది. ఈ ట్రెండ్‌కు తగ్గట్లుగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత కూడా నానాటికీ వృద్ధి చెందుతోంది. ఇప్పుడు, కొత్త టూవీలర్‌ కొనేవాళ్లలో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకుంటున్నారు, ముఖ్యంగా నగరాలు & పట్టణాల్లో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో, హీరో మోటోకార్ప్‌ ఇటీవల విడుదల చేసిన విడా VX2 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చాలా చవకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మీరు ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కేవలం రూ. 44,990 కే కొనుగోలు చేయవచ్చు. 

హీరో మోటోకార్ప్‌, Vida VX2 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను BaaS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) మోడల్‌లో అందిస్తోంది. అంటే, బండితో పాటు మీరు బ్యాటరీ కొనాల్సిన అవసరం లేదు, నెలకు నిర్దిష్ట మొత్తం చెల్లించి బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు. హీరో మోటోకార్ప్‌ ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది, అవి - Vida VX2 Go & Vida VX2 Plus. 

BaaS ఆప్షన్‌తో Vida అందిస్తున్న బేస్ మోడల్ VX2 Go వేరియంట్‌ను కేవలం 44,990 రూపాయల ఎక్స్-షోరూమ్ ధరకే ఇంటికి తీసుకువెళ్లవచ్చు. ఒకవేళ మీరు ఈ బండిని బ్యాటరీతో కలిపి కొనాలన్నా కూడా అందుబాటులో ఉంది, బ్యాటరీతో కలిపి VX2 Go  ఎక్స్-షోరూమ్ ధర 85,000 రూపాయలు. 

టాప్‌ వేరియంట్‌ ధర ఎంత?
దీనిలో టాప్‌ వేరియంట్‌ Vida VX2 Plus. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర BaaS మోడల్‌లో రూ. 58,000 కాగా, బ్యాటరీతో కలిపి కొనాలంటే 1 లక్ష రూపాయలు.

బ్యాటరీ అద్దె ఎంత?
BaaS మోడల్ కింద, ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని అద్దెకు ఇస్తారు. మీకు అవసరమైనప్పుడు, ఫుల్‌ ఛార్జ్‌తో ఉన్న బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు. కిలోమీటరుకు రూపాయి కంటే తక్కువగా, కేవలం 96 పైసల అద్దెను ఈ కంపెనీ వసూలు చేస్తుంది. అయితే, ఇది పరిచయ ధర, తరువాత ఈ రేటు పెంచవచ్చు. 

హీరో విడా VX2 డిజైన్ & ఫీచర్లు
Vida VX2 డిజైన్ & ఫీచర్లను EICMAలో మొదట లాంచ్‌ చేసిన Vida Z కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. VX2 అనేది Vida V2 కంటే చౌకైన వెర్షన్, బడ్జెట్-ఫ్రెండ్లీ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఇది చాలా యూత్‌ఫుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్‌ అయింది. దీని బ్యాటరీ ప్యాక్ తేలికగా & సమర్థవంతంగా ఉంటుంది. బాడీ డిజైన్‌ ఈజీగా కనిపిస్తున్నప్పటికీ, ఆకర్షణీయంగా ఉంది. Vida VX2 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో TFT డిస్‌ప్లే కూడా అందింతారు, ఇది స్కూటర్‌కు స్మార్ట్ టచ్ ఇస్తుంది.

హీరో విడా VX2 రేంజ్‌
హీరో విడా VX2 Go వేరియంట్‌లో 2.2 kWh తొలగించగల బ్యాటరీ ఉంది, ఇది ఫుల్‌ ఛార్జ్‌తో 92 కి.మీ. దూరం ప్రయామిస్తుంది, దీనికి IDC సర్టిఫికెట్‌ ఉంది. టాప్‌ ఎండ్‌ VX2 Plus వేరియంట్‌ 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 142 కి.మీ. రేంజ్‌ (IDC సర్టిఫైడ్) అందిస్తుంది. విడా VX2 Go వేరియంట్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. కాగా & VX2 Plus వేరియంట్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. 

టాప్ హెడ్ లైన్స్

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!
టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!
మారుతి, హ్యుందాయ్‌ బాటలోనే టాటా.. సెప్టెంబర్‌ నుంచి ధరల మోత
Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget