అన్వేషించండి

New Royal Enfield Bullet 350: డుడ్డుడుడ్డుడుడ్డు.. కొత్త బుల్లెట్ బండి వచ్చేస్తోంది - ప్రత్యేకలు తెలిస్తే ఈ రోజే కొనేస్తారు!

టూవీలర్ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి సరికొత్త బుల్లెట్ లాంచ్ కాబోతోంది. సెప్టెంబర్ 1న భారత్ మార్కెట్లోకి రాబోతోంది. తాజాగా ఈ ‘2023 బుల్లెట్ 350’ వివరాలు బయటకు వచ్చాయి.

వినియోగదారులకు నచ్చేలా టూవీలర్ వాహన తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, నయా లుక్ తో బైకులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. రాయ్ ఎన్ ఫీల్డ్ కూడా మిగతా బైకులు మాదిరిగానే కొత్త కొత్త బైకులను మార్కెట్లోకి తీసుకొస్తుంది. భారత్ లో ఇప్పటికే రాయల్ ఎన్ ఫీల్డ్ కు మంచి ఆదరణ ఉంది. ఆ ఆదరణను కొనసాగిస్తూ కొత్త వాహనాలను పరిచయం చేస్తోంది.

అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి న్యూ మోడల్ బుల్లెట్ లాంచ్ కాబోతోంది. ‘2023 బుల్లెట్ 350’ పేరుతో భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. సెప్టెంబర్ 1న దీనిని కంపెనీ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ బైక్‌కు సంబంధించి  స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. రాబోయే బుల్లెట్  క్లాసిక్ 350తో  పలు సారూప్యతలను కలిగి ఉంది. రెండూ ట్విన్ క్రాడిల్ ఫ్రేమ్, J-సిరీస్ ఇంజన్ ను కలిగి ఉన్నాయి. దాని రెట్రోని అలాగే ఉంచుకుంటూ పలు సరికొత్త మార్పులతో విడుదల కాబోతోంది.

మూడు వేరియంట్లలో కొత్త బైక్ విడుదల   

రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసిన తాజా టీజర్ వీడియోలో సరికొత్త మోటార్‌సైకిల్ గురించి పలు వివరాలను బయటకు వచ్చాయి. 2023 బుల్లెట్ 350 మూడు వేరియంట్లలో అందించబడుతుంది. బేస్, మిడ్, టాప్ మోడల్‌లో లభిస్తుంది.   349 cc సింగిల్-సిలిండర్ ఎయిర్, ఆయిల్-కూల్డ్ OHC ఇంజన్ నుంచి పవర్ ను పొందుతుంది. ఇది 20.2 bhp పవర్ తో పాటు 27 Nm గరిష్ట టార్క్‌ ను అందిస్తుంది. దీనిలో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ ‌ను అందించారు.

బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, డ్యూయల్ ఛానల్ ABS సిస్టంను కలిగి ఉంటుంది. ఇంకా LCD డేటా డిస్‌ప్లేతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ముందు19-అంగుళాల స్పోక్డ్ వీల్, బ్యాక్ 18-అంగుళాల స్పోక్డ్ వీల్ ఉన్నాయి. సిల్వర్ అవుట్‌లైన్, హాలోజన్ టర్న్ ఇండికేటర్‌లతో కూడిన వృత్తాకార టెయిల్ ల్యాంప్, ట్యూబులర్ గ్రాబ్ రైల్, సింగిల్-పీస్ సీట్, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, సిల్వర్-ఫినిష్డ్ రియర్‌వ్యూ మిర్రర్స్ ను కలిగి ఉంది.

స్విచ్‌ గేర్ సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అమర్చబడుతుంది. బుల్లెట్ సిరీస్ సరళమైన స్టైలింగ్ అలాగే ఉంచబడింది. ఫ్యూయల్ ట్యాంక్ వైపులా సొగసైన గ్రాఫిక్ ఫినిషింగ్ ను కలిగి ఉంది. అవుట్‌ గోయింగ్ బుల్లెట్‌తో పోలిస్తే, కొత్త మోడల్ కొత్త ఛాసిస్ కారణంగా తేలికగా ఉంటుంది. పాత UCE మోటారు తొలగించబడినందున కొత్త  ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

‘2023 బుల్లెట్ 350’ ధర ఎంతంటే?

ఇక ధర విషయానికి వస్తే ఎంట్రీ-లెవల్ మిడిల్ వెయిట్ రోడ్‌స్టర్ హంటర్ 350 కంటే ఎక్కువ, క్లాసిక్ 350 కంటే చాలా తక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది సింగిల్,  డ్యూయల్-ఛానల్ ABS ఎంపికలలో విక్రయించబడుతుంది. అయితే, 300 mm ఫ్రంట్ డిస్క్, వెనుక డిస్క్ అందుబాటులో ఉంటుంది. నవంబర్‌లో హిమాలయన్ 450 భారత్ లో లాంచ్ కానుంది.

Read Also: హోండా హార్నెట్ 2.0 వచ్చేసింది - కంపెనీ ఏం మార్పులు చేసింది?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget