New Kia Seltos vs Maruti Victoris: టాప్ వేరియంట్ ఫీచర్లు ఏ మోడల్‌లో ఎక్కువ?
కొత్త కియా సెల్టోస్, మారుతి విక్టోరిస్ టాప్ వేరియంట్ల పోలిక. ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్లు, భద్రత, ధరల విషయంలో ఏ SUV ముందుంది అనేది తెలుసుకోండి.

New Kia Seltos Top Maruti Victoris Top Variant Features: రోజులు గడిచేకొద్దీ, మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల, కియా మోటార్స్, సెకండ్ జనరేషన్ సెల్టోస్‌ను లాంచ్ చేసింది. కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఇంటీరియర్, మరిన్ని ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ SUVకి ప్రధాన పోటీగా నిలుస్తోంది మారుతి సుజుకి విక్టోరిస్. 2025 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ విక్టోరిస్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ రెండు కార్ల టాప్ వేరియంట్ల మధ్య ఫీచర్ల పోలిక చూద్దాం.
డిజైన్ & ఎక్స్‌టీరియర్ ఫీచర్లు
కొత్త కియా సెల్టోస్ GTX (A), X-Line (A) వేరియంట్లలో 18 ఇంచుల అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి విక్టోరిస్‌లోని 17 ఇంచుల అలాయ్‌ల కంటే కాస్త పెద్దవి. సెల్టోస్‌లో ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వగా, విక్టోరిస్‌లో సాధారణ పుల్ టైప్ హ్యాండిల్స్ ఉన్నాయి. అదనంగా సెల్టోస్‌లో ORVMలకు మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. విక్టోరిస్ మాత్రం జెస్చర్‌తో పని చేసే పవర్డ్ టెయిల్‌గేట్ ఫీచర్‌తో ముందుంటుంది. ఈ ఫీచర్ సెల్టోస్‌లో లేదు.
ఇంటీరియర్ & కంఫర్ట్
ఇంటీరియర్ విషయానికి వస్తే సెల్టోస్ కొంచెం ఆధిక్యంలో ఉంటుంది. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పెద్ద డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీటుకు లంబార్ సపోర్ట్, మెమరీ, వెల్‌కమ్ ఫంక్షన్లు సెల్టోస్‌కు అదనపు బలం. HVAC కోసం ప్రత్యేక డిస్‌ప్లే కూడా అందించారు.
విక్టోరిస్‌లో కూడా ఫీచర్ల కొరత లేదు కానీ స్క్రీన్ సైజ్ విషయంలో మాత్రం సెల్టోస్ ముందు నిలుస్తుంది.
డ్రైవ్ సిస్టమ్ & ఇంజిన్ ఆప్షన్లు
ఈ రెండు SUVలు డ్రైవ్, టెర్రైన్ మోడ్‌లను అందిస్తాయి. అయితే పెద్ద తేడా ఏమిటంటే, విక్టోరిస్‌లో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌తో AWD ఆప్షన్ లభిస్తుంది. సెల్టోస్‌లో మాత్రం ఫ్రంట్ వీల్ డ్రైవ్ మాత్రమే ఉంది.
ఇంజిన్ ఆప్షన్లలో - సెల్టోస్‌లో టర్బో పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు ఉన్నాయి. విక్టోరిస్‌లో టర్బో పెట్రోల్ లేదు కానీ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉంది.
భద్రత
భద్రత విషయంలో ఈ రెండు కార్లు దాదాపు సమానంగా ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS సూట్ రెండింట్లోనూ అందుబాటులో ఉన్నాయి.
ధర & విలువ
| | Seltos GTX (A), X-Line (A) | Victoris ZXI+ (O) |
| Petrol manual | - | రూ. 15.97 లక్షలు |
| Petrol automatic | రూ. 19.49 లక్షలు | రూ. 17.92-19.37 లక్షలు |
| Turbo-petrol automatic | రూ. 19.99 లక్షలు | - |
| Strong-hybrid petrol | - | రూ. 19.99 లక్షలు |
| Diesel automatic | రూ. 19.99 లక్షలు | - |
విక్టోరిస్ ZXi+ (O) మాన్యువల్ ఆప్షన్‌తో లభించడం వల్ల కొంచెం తక్కువ ధరకు దొరుకుతుంది. విక్టోరిస్ FWD వేరియంట్ సెల్టోస్ కంటే సుమారు రూ.1.57 లక్షలు తక్కువ. AWD వేరియంట్ కూడా సెల్టోస్ ఆటోమేటిక్ కంటే స్వల్పంగా తక్కువ ధరకు లభిస్తుంది.
ఇంధన సామర్థ్యం కోరుకునే వారికి సెల్టోస్ డీజిల్, విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ దాదాపు ఒకే ధర వద్ద ఉన్నాయి.
మొత్తం మీద, ఫీచర్ల పరంగా చూస్తే కొత్త కియా సెల్టోస్ కొంచెం ముందంజలో ఉంటుంది. పెద్ద స్క్రీన్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ ఫీచర్లు దీనికి ప్లస్. ధర ముఖ్యమైతే విక్టోరిస్ మంచి డీల్. పెర్ఫార్మెన్స్, యాక్సిలరేషన్ కోరుకునే వారికి టర్బో పెట్రోల్ సెల్టోస్ సరైన ఎంపికగా నిలుస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















