Top 5 Electric Cars: భారతీయులు కొనుగోలు చేస్తున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లివే….
ట్రెండ్ కి తగ్గట్టు ప్రముఖ కార్ల కంపెనీలు రూటు మారుస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ కి సంబంధించి కొత్త కొత్త వెర్షన్లు విడుదల చేస్తున్నప్పటికీ..అదే సమయంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ పైనా దృష్టి సారిస్తున్నాయి.
ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఆటో మొబైల్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాల గురించే చర్చంతా. పెరుగుతున్న పెట్రోల్ రేట్ల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్న వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధర ఇంచుమించు అదే ఉండడంతో ఈవీ వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం వాహనదారులను ఆకట్టుకుంటున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లేంటో చూద్దాం….
Tata Tigor EV:
ప్రస్తుతం సామాన్యుడికి అందుబాటులో ఉన్న విద్యుత్ కార్లలో టాటా టిగోర్ EVదే ప్రధమ స్థానం. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జింగ్ చేస్తే దాదాపు 213 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఈ బ్యాటరీ ఫుల్ చార్జింగ్ కి 12 గంటల సమయం అవసరం. దీని ఆన్ రోడ్ ప్రైస్ 10 లక్షల లోపే…
Tata Nexon EV:
టాటా టిగోర్ తర్వాత అందరకీ అందుబాటులో ఉండే ఫోర్ వీలర్ టాటా నెక్సోన్ ఎలక్ట్రిక్ వెహికల్. సింగిల్ ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. టాటా నెక్సోన్ కారు చూడడానికి మిడ్ సైజ్ SUV మోడల్ లా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే స్పోర్ట్స్ కార్ లా ఉంటుంది. ఎస్‌యూవీ 30.2 కిలోవాట్ల బ్యాటరీ, 129 హార్స్ పవర్, 249 NM టార్క్ తో అందిస్తోంది. Tata Nexon EV ఆన్ రోడ్ ప్రైస్ 14 లక్షల నుంచి 18 లక్షల వరకూ ఉంది.
MG ZS EV: టాటా టిగోర్, టాటా నెక్సోన్….ఈ రెండు విద్యుత్ కార్లు సామాన్యులవైతే...హోదా చూపించాలనుకునేవారు MG ZS EV ని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ కార్ల ప్రత్యేకత ఏంటంటే…44.5 కిలోవాట్స్ బ్యాటరీ..143hp, 353Nmతో ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే 419 కిలోమీటర్లు రయ్ రయ్ మని దూసుకుపోవచ్చు. MG ZS EV ఆన్ రోడ్ ప్రైస్ రూ. 20.99 లక్షలు
Hyundai Kona Electric: కొనుగోలుదారులను ఎట్రాక్ట్ చేసే ఫోర్ వీలర్ కంపెనీల్లో ఒకటైన హుండాయ్ నుంచి వచ్చిన విద్యుత్ వాహనమే Kona Electric. ఈ వెహికల్ 39kWh బ్యాటరిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. Hyundai Kona Electric విద్యత్ వాహనం ఆన్ రోడ్ ప్రైస్ 23.7 లక్షలు.
Mercedes-Benz EQC:విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ నుంచి వచ్చిన ఎలక్ట్రి క్ ఫోర్ వీలర్ Mercedes-Benz EQC. సైజ్, రేంజ్, పవర్, క్లాస్…వీటన్నింటితో పాటూ ధర కూడా ఆ రేంజ్ లోనే ఉంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ కొటి రూపాయల పైనే. 80కిలోవాట్స్ బ్యాటరీ…408hp, 760Nmతో ఫుల్ ఛార్జ్ చేస్తే 414 కిలోమీటర్లు దూసకుపోవచ్చు. MG ZS EV, Kona EV తో పోల్చుకుంటే Mercedes-Benz EQCలో ప్రయాణించే దూరం ఓ మోస్తరుగా తక్కువే అని చెప్పుకోవాలి…