అన్వేషించండి

MG Windsor EV: బ్యాటరీతో ఒక రేటు, లేకుండా మరో రేటు - ఎంజీ విండ్సర్ ఈవీ ధర ఎంతో తెలుసా?

MG Windsor EV Ex Showroom Price: ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ ఇటీవలే లాంచ్ చేసిన విండ్సర్ ఈవీ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని ధర రూ.9.99 లక్షల వరకు ఉంది.

MG Windsor EV Price: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల తన ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎంజీ విండ్సర్ ఈవీ సెప్టెంబర్ 11వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ ఈవీని బ్యాటరీతో పాటు, బ్యాటరీ లేకుండా కూడా పొందవచ్చు. బ్యాటరీ లేకుండా విండ్సర్ ఈవీ ధర రూ. 10 లక్షల రేంజ్‌లో ఉంది. ఇప్పుడు ఎంజీ మోటార్స్ కూడా బ్యాటరీతో కూడిన కారు ధరలను ప్రకటించింది.

ఇటీవలే ఎంజీ విండ్సర్ ఈవీ మార్కెట్లోకి...
ఎంజీ విండ్సర్ ఈవీ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఎంజీ మోటార్స్‌కు చెందిన ఈ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ఉండదని, కారు బ్యాటరీకి అయ్యే ఖర్చును ప్రయాణించిన కిలోమీటర్ల దూరం ఆధారంగా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ఈ కారులో కొత్త ఫీచర్‌ను ఉపయోగించింది. ఎంజీ విండ్సర్ ఈవీ బేస్ వేరియంట్ తీసుకుంటే బ్యాటరీ కోసం ప్రతి కిలోమీటరుకు రూ. 3.5 చెల్లించాలి.

ఎంజీ విండ్సర్ ఈవీ ధర
ఇప్పుడు ఎంజీ మోటార్స్ ఫిక్స్‌డ్ బ్యాటరీతో కూడా కారు ధరను వెల్లడించింది. అంటే కిలోమీటరుకు ఇంత అని కాకుండా పూర్తిగా బ్యాటరీతో పాటు కారును కొనుగోలు చేయవచ్చన్న మాట. బ్యాటరీతో విండ్సర్ ఈవీ ధర రూ.3.5 లక్షలు పెరుగుతుంది. బ్యాటరీ ప్యాక్‌తో కూడిన విండ్సర్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దాని టాప్ వేరియంట్ ధర రూ. 15.50 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు సర్టిఫైడ్ రేంజ్ సింగిల్ ఛార్జింగ్‌కు 332 కిలోమీటర్లుగా ఉంది.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

విండ్సర్ ఈవీ పోటీ పడేది ఈ వాహనాలతోనే...
విండ్సర్ ఈవీ అనేది సీయూవీ (క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్) మోడల్ అని ఎంజీ మోటార్స్ చెప్పింది. ఇది ఈ కారు సెడాన్ లాంటి సౌకర్యాన్ని, ఎస్‌యూవీ లాంటి స్థలాన్ని ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. బ్యాటరీ ప్యాక్‌తో కూడిన విండ్సర్ ఈవీ ధర మార్కెట్లో లభించే కార్లకు గట్టి పోటీనిస్తుంది. ఈ కారు టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400లతో పోటీ పడనుంది.

విండ్సర్ ఈవీ ఫీచర్లు
ఎంజీ మోటార్స్ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉండనుంది. మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఖరీదైన గాజు పైకప్పును కలిగి ఉండబోతోంది. అదే సమయంలో దాని టాప్ మోడల్‌లో ఏరో లాంగ్ సీట్లు కూడా కనిపిస్తాయి. ఈ కారు నాలుగు కలర్ వేరియంట్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇది స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ కలర్‌లను కలిగి ఉంది.

Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Embed widget