అన్వేషించండి

లాంచ్‌ నుంచి నంబర్‌ 1 స్థానంలోనే MG Windsor - ఎలక్ట్రిక్‌ కార్లలో బెస్ట్‌ సెల్లర్‌గా రికార్డ్‌

Best Selling Electric Car India: MG Windsor EV కొత్త రికార్డు సృష్టించింది. గత నెలలో 4,308 యూనిట్లు అమ్మింది, వరుసగా 10వ నెల కూడా భారతదేశంలో నంబర్-1 EVగా నిలిచింది. మరిన్ని వివరాలు తెలుసుకోండి.

MG Windsor Best Selling EV In India: MG విండ్సర్ EV భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మరో కొత్త రికార్డును సృష్టించింది. గత నెల (జులై 2025‌) లో, ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు 4,308 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది ఇప్పటి వరకు అత్యధిక నెలవారీ సంఖ్య. అంటే, ఈ ఎలక్ట్రిక్‌ కారుకు డిమాండ్‌ పీక్‌ స్టేజ్‌లో ఉందని అర్ధం. దీంతోపాటు, విండ్సర్ వరుసగా 10వ నెల కూడా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన EV టైటిల్‌ను గెలుచుకుంది.

MG Windsor EV స్లీక్‌ బాడీ షేప్‌, ఆధునిక ఎయిరోడైనమిక్‌ డిజైన్‌తో నగర రోడ్లపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. 18-అంగుళాల డైమండ్‌-కట్‌ అలాయ్‌ వీల్స్‌, ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌ & ఎక్స్‌పాండ్‌ అయ్యే LED లైట్‌ బార్స్‌ దీని ప్రీమియం లుక్‌కు మరింత వన్నె కల్పిస్తాయి. గ్లాస్‌ ప్యానోరమిక్‌ రూఫ్‌, 256-రంగుల ఆంబియెంట్‌ లైటింగ్‌ & రిక్లైనింగ్‌ Aero-Lounge రియర్‌ సీట్లు ఈ కారులో ప్రయాణాన్ని లగ్జరీ అనుభూతిలోకి మారుస్తాయి. స్మూత్‌ బాడీ లైన్స్‌తో MPV తరహా షేప్‌ ఉన్నా, SUV స్టైల్‌ టచ్‌తో MG Windsor EV అద్భుతమైన అర్బన్‌ ప్రెజెన్స్‌ను ఇస్తుంది.      

లాంచ్‌ నుంచి అద్భుతమైన అమ్మకాలు
MG విండ్సర్‌ను అక్టోబర్ 2024లో లాంచ్‌ చేశారు. ఈ కారు అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం 10 నెలల్లోనే 35,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. కంపెనీ EV మార్కెట్ వాటా Q2 CY2025లో 28% నుంచి 32%కి పెరిగింది. ఈ కాలంలో, విండ్సర్ సగటు నెలవారీ అమ్మకాలు 17% పెరిగాయి. 

MG విండ్సర్‌ లాంచ్‌ అయిన అక్టోబర్ 2024 నుంచి జులై 2025 వరకు, మొత్తం 35,100 కార్లను కస్టమర్లు కొన్నారు. అంటే, సగటున, ప్రతి నెలా దాదాపు 3,510 యూనిట్లు అమ్ముడయ్యాయి.

కీలక గణాంకాలు
డిసెంబర్ 2024లో, MG విండ్సర్ 3,785 యూనిట్లు అమ్ముడయ్యాయి, మే 2025లో ఈ సంఖ్య 3,939 యూనిట్లకు చేరుకుంది. జులై 2025లో 4,308 యూనిట్ల డెలివరీలు జరిగాయి, అమ్మకాలు కొత్త రికార్డును సృష్టించాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫిబ్రవరి 2025 వంటి నెమ్మదిగా ఉన్న నెలల్లో కూడా ఈ ఎలక్ట్రిక్‌ కారు అమ్మకాలు బలంగా ఉన్నాయి.

ప్రీమియం డిజైన్ & ఫీచర్లు
MG విండ్సర్‌ 'ఏరోగ్లైడ్' డిజైన్ కారణంగా దీనికి సెడాన్‌ తరహా ప్రయోజనం & SUV తరహా ప్రాక్టికాలిటీ రెండూ అందుబాటులో ఉంటాయి. దీనిలో అమర్చిన ఏరో లాంజ్ సీట్లు 135 డిగ్రీల వరకు వంగుతాయి & బిజినెస్‌ క్లాస్‌ లాంటి సౌకర్యాన్ని అందిస్తాయి. ఇంటీరియర్‌ విషయానికి వస్తే.. 15.6-అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్ డిస్‌ప్లే దీనిలో ఉంది, ఇది అత్యంత గొప్ప అనుభవాన్ని అందిస్తుంది.   

ధర 
బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్ కింద MG విండ్సర్ ధర కేవలం రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, బ్యాటరీ ఛార్జ్ కిలోమీటరుకు 3.9 రూపాయలు. ఈ ప్లాన్‌ వల్ల, ఈ ప్రీమియం EVకి ఓనర్‌ కావడం సులభంగా మారుతుంది. అందువల్లే ఎక్కువ మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ కార్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
మీ బడ్జెట్‌లోనే ఆటోమేటిక్ కారు కావాలా? రూ.5 లక్షల లోపే ప్రారంభమయ్యే 10 బెస్ట్ ఆప్షన్లు
ధర రూ.5 లక్షల లోపే - ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో వచ్చిన టాప్ 10 కార్ల లిస్ట్‌
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Embed widget