అన్వేషించండి

MG Comet EV: డిజైనే దీనికి పెద్ద ప్లస్ - అమ్మకాల్లో దూసుకుపోతున్న ఎంజీ కామెట్ - ధర రూ.8 లక్షల నుంచే!

ఎంజీ కామెట్ ఈవీకి సంబంధించిన సేల్స్ జోరుగా సాగుతున్నాయి.

MG Comet EV: ఎంజీ మోటార్స్ ఇటీవల కామెట్ ఈవీ రూపంలో దేశంలో తన రెండో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఇంతకు ముందు ఎంజీలో జెడ్ఎస్ ఈవీ మాత్రమే ఎలక్ట్రిక్ కారు. MG కామెట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.98 లక్షల నుంచి రూ.9.98 లక్షల మధ్య ఉంది. ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

మూడేళ్ల తర్వాత 60 శాతం బ్యాక్
ఎంజీ మోటార్ నుంచి ఈ కారుపై వినియోగదారుల కోసం ప్రత్యేక బైబ్యాక్ స్కీమ్ కూడా ఉంది. దీని కింద వినియోగదారులు కామెట్‌ను మూడేళ్ల తర్వాత కంపెనీకి తిరిగి ఇవ్వవచ్చు. దాని ధరలో 60 శాతం తిరిగి పొందవచ్చు. ఈ కారుకు సంబంధించి గత నెలలో 1,184 యూనిట్లు అమ్ముడు పోయాయి. గత నెలలో ఎంజీకి సంబంధించి అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా నిలిచింది.

2023 జూన్‌లో ఎంజీ మోటార్ ఇండియాలో హెక్టర్, హెక్టర్ ప్లస్‌లకు సంబంధించి అత్యధికంగా 2,170 యూనిట్లు విక్రయించింది. ఎంజీ కామెట్ రెండో స్థానంలో ఉండగా, ఎంజీ ఆస్టర్ మూడో స్థానంలో, జెడ్ఎస్ ఈవీ నాలుగో స్థానంలో, గ్లోస్టర్‌ ఐదో స్థానంలో ఉన్నాయి.

ఎంజీ జెడ్ ఈవీ వెలుపలి భాగంలో ఎల్ఈడీ లైట్ బార్, ఓఆర్వీఎంలను కనెక్ట్ చేసే ఎల్ఈడీ స్ట్రిప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌తో కూడిన ఆధునిక డిజైన్ ఉంది. ఇది 12 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఈ కారు మూడు మీటర్ల పొడవు ఉంది. అంతేకాకుండా 1,640 మిల్లీమీటర్ల ఎత్తు, 1,505 మిల్లీమీటర్ల వెడల్పు, 2,010 మిల్లీమీటర్ల పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఎంజీ కామెట్ ఈవీ డ్యూయల్ టోన్ (యాపిల్ గ్రీన్ + స్టార్రీ బ్లాక్, క్యాండీ వైట్ + స్టార్రీ బ్లాక్), యాపిల్ గ్రీన్, క్యాండీ వైట్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్‌తో సహా ఐదు రకాల కలర్ ఆప్షన్లను పొందుతుంది.

ఇంటీరియర్ ఇలా?
ఈ కారు విశాలమైన క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇది నలుగురు కూర్చునేందుకు సరిపోతుంది. ఇందులో 10.25 అంగుళాల స్క్రీన్‌లతో కూడిన ఆల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే యూనిట్‌ను, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. అంటే రెండు డిస్‌ప్లేలు ఉండనున్నాయన్న మాట. దీంతోపాటు మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్న 2 స్పోక్ స్టీరింగ్ వీల్, మూడు యూఎస్‌బీ పోర్ట్‌లు, 55కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్‌లను కూడా పొందుతుంది.

బ్యాటరీ, రేంజ్ ఎలా ఉన్నాయి?
ఎంజీ కామెట్ ఈవీ 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఐపీ67 రేటింగ్‌తో వస్తుంది. 42 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎం టార్క్‌ను పొందుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు దీన్ని డ్రైవ్ చేయవచ్చు. కంపెనీ దీని బ్యాటరీపై  మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలో మీటర్ల వారెంటీని కూడా ఇస్తోంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tata Tiago EV: టాటా టియాగో ఈవీ కొనేందుకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ? నెలవారీ EMI ప్లాన్, రేంజ్ వివరాలు
Tata Tiago EV కొనేందుకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ? నెలవారీ EMI ప్లాన్, రేంజ్ వివరాలు
పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది
Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది
Triumph Bike Prices Increased: ట్రయంఫ్ బైకుల ధరలు భారీగా పెంపు: స్పీడ్ 400, స్క్రాంబ్లర్ సిరీస్ పై భారీగా భారం.. కొత్త రేట్ల కంప్లీట్ డీటెయిల్స్
ట్రయంఫ్ బైకుల ధరలు భారీగా పెంపు: స్పీడ్ 400, స్క్రాంబ్లర్ సిరీస్ పై భారీగా భారం.. కొత్త రేట్ల కంప్లీట్ డీటెయిల్స్

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Embed widget