అన్వేషించండి

700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం

Mercedes-AMG సూపర్‌కార్‌లాంటి పనితీరుతో కొత్త ఎలక్ట్రిక్ GT SUVను లాంచ్ చేసింది. 1,169 బీహెచ్‌పీ పవర్, 700 km రేంజ్, కేవలం 12 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెర్సిడెస్, తొలి ఆల్-ఎలక్ట్రిక్ AMG GT SUVను ఆవిష్కరించింది.
  • ఇది 1169bhp పవర్, 700 కి.మీ. రేంజ్ అందిస్తుంది.
  • వేగంగా ఛార్జ్ అయ్యే 800-వోల్ట్ బ్యాటరీ, లగ్జరీ క్యాబిన్ ఉన్నాయి.
  • కేవలం 2.5 సెకన్లలో 0-100 కి.మీ./గం. వేగం అందుకుంటుంది.

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ (Mercedes) ఆటో మార్కెట్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. కంపెనీ నుంచి తొలి ఆల్ ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ కార్ Mercedes-AMG GT SUVను ఆవిష్కరించింది. ఈ కారును మెర్సిడెస్ తన ప్రత్యేక AMG హై-పెర్ఫార్మెన్స్ ఆర్కిటెక్చర్‌పై సొంతంగా రూపొందించింది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ కారు కాదు. స్పోర్ట్స్ కార్‌కి ఉండే సూపర్ ఫాస్ట్ వేగం, పెద్ద సైజు SUV దీని ప్రత్యేకత. ఈ కారులో వినియోగదారులకు 1,169 bhp పవర్, సింగిల్ ఛార్జ్‌లో 700 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. Mercedes ఈ మెరిసే ఎలక్ట్రిక్ SUVలో ఏ ప్రత్యేక ఫీచర్లు, టెక్నాలజీ ఉన్నాయో వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

బెస్ట్ వేరియంట్లు, స్పోర్టీ లుక్

ఈ సూపర్ ఎలక్ట్రిక్ కారును మెర్సిడెస్ కంపెనీ మార్కెట్లోకి 3 అద్భుత వేరియంట్లు తీసుకొచ్చింది. వాటి పేర్లు GT 53, GT 55, అలాగే టాప్ మోడల్ GT 63 ఉన్నాయి. భారత్‌లో దీని ధర, లభ్యతపై Mercedes ఎలాంటి ప్రకటన చేయలేదు. లుక్ విషయానికి వస్తే, ముందు భాగంలో నిలువు స్లాట్లతో AMG-స్పెషల్ రేడియేటర్ గ్రిల్, స్టార్ ఆకారంలో ఉన్న LED డే-టైమ్ రన్నింగ్ లైట్లు కనిపిస్తాయి. కార్ వెనుక భాగంలో టర్బైన్ నుంచి ఆరు గుండ్రని టెయిల్‌లైట్లు ఉన్నాయి. ఇవి రాత్రివేళ దీనికి స్పెషల్ లుక్ ఇస్తాయి. వాహనాన్ని అధిక వేగంలో స్థిరంగా ఉంచేందుకు ఇందులో యాక్టివ్ రూఫ్ స్పాయిలర్ వంటి టెక్నాలజీని ఉపయోగించారు.

కేబిన్‌లో సూపర్ లగ్జరీ, AI టెక్నాలజీ

Mercedes AMG GT SUV ఇంటీరియర్ ఒక విమానం కాక్‌పిట్‌లా ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. డాష్‌బోర్డ్‌పై డ్రైవర్ కోసం 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో 14 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ముందు కూర్చునే వారికి వినోదం కోసం ప్రత్యేకంగా మరో 14 అంగుళాల స్క్రీన్ ఇచ్చారు. కార్ కేబిన్‌లో పనోరమిక్ గ్లాస్ రూఫ్ లభిస్తుంది. మీ అవసరానికి తగ్గట్లుగా దాన్ని ఒక బటన్ నొక్కి పారదర్శకంగా లేదా పూర్తిగా మసకగా మార్చుకోవచ్చు.

ఈ వాహనంలో Mercedes తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌ ఇచ్చారు. ఇందులో ChatGPT, Microsoft Bing, గూగుల్ జెమినీ వంటి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్లు నేరుగా ఇన్‌బిల్ట్‌గా వస్తాయి.

కేవలం 12 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

Mercedes-AMG ఈ కారులో 800-వోల్ట్ ఆధునిక బ్యాటరీ ఇచ్చింది. కంపెనీ ఇందులో 106kWh, 128kWh సామర్థ్యాలున్న 2 వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లు ఇవ్వనుంది. పెద్ద 128kWh బ్యాటరీ సాయంతోనే ఈ కారు 700 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. ఈ కారు 710kW వరకు అల్ట్రా ఫాస్ట్ DC ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ చార్జర్ సాయంతో పెద్ద బ్యాటరీని కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది.  ఈ భారీ కారును కేవలం 12 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేయవచ్చు.

మంచి వేగం, రాకెట్‌లాంటి పవర్

పవర్ పరంగా Mercedes ఈ కారును రెండు వేర్వేరు ఎలక్ట్రిక్ మోటార్ కాన్ఫిగరేషన్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బేస్ వేరియంట్ GT 53లో రెండు మోటార్లు ఉన్నాయి. ఇవి కలిసి 544 బీహెచ్‌పీ పవర్, 800 nm టార్క్ ఇస్తాయి. ఇక మిడ్ వేరియంట్ GT 55లో ఈ పవర్ 816 బీహెచ్‌పీ వరకు పెరుగుతుంది.

ఇందులో 3 పవర్‌ఫుల్ మోటార్లను ఇస్తున్నారు. ఈ మోటార్లు కలిసి కారుకు 1,169 బీహెచ్‌పీ పవర్ 2,000 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తాయి. ఈ పవర్ కారణంగా ఈ SUV కేవలం 2.5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ/ గం వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 270 కిలోమీటర్లు.

 

Frequently Asked Questions

మెర్సిడెస్-AMG GT SUV ప్రత్యేకతలు ఏమిటి?

ఇది మెర్సిడెస్ నుండి వచ్చిన తొలి ఆల్-ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ కారు. స్పోర్ట్స్ కారు వేగంతో పాటు SUV సైజును కలిగి ఉంటుంది.

Mercedes-AMG GT SUV ఎంత పవర్ మరియు రేంజ్ ఇస్తుంది?

ఈ కారు 1,169 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంది. సింగిల్ ఛార్జ్‌లో 700 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది.

Mercedes-AMG GT SUV ఎంత వేగంగా ఛార్జ్ అవుతుంది?

ఇది 710kW అల్ట్రా ఫాస్ట్ DC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 12 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Mercedes-AMG GT SUV క్యాబిన్‌లో ఎలాంటి టెక్నాలజీ ఉంది?

క్యాబిన్‌లో 10.2 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 14 అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ ఉన్నాయి. ChatGPT, Microsoft Bing వంటి AI అసిస్టెంట్‌లు కూడా ఇన్-బిల్ట్‌గా వస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి
ఇటలీ నుంచి వస్తున్న Italjet Dragster 300.. ఈ స్కూటర్ గురించి 6 ఆసక్తికర విషయాలు
Electric Car Sales: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు
జోరుగా హుషారుగా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌.. అప్పుడే 3 లక్షల మార్క్ దాటిన అమ్మకాలు
రెట్రో లుక్‌, మోడ్రన్‌ టచ్‌తో Vespa ఆల్‌-న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు
Vespa నుంచి మూడు గ్లోబల్‌ రేంజ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తాయంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget