అన్వేషించండి

Maruti Suzuki Brezza: బ్రెజా కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ మారిన ఫీచర్ల గురించి తెలుసుకున్నారా?

మారుతి సుజుకి కంపెనీ తన బ్రెజా ఎస్‌యూవీకి కొన్ని మార్పులు చేసింది.

Maruti Suzuki Brezza Features: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ బ్రెజా టెక్నాలజీ, ఫీచర్లలో కొన్ని మార్పులు చేసింది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్ రిమైండర్‌ను ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. అయితే ఇంతకుముందు ఇది ముందు సీట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ దీంతో హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ దాని సీఎన్‌జీ మోడల్ నుంచి తీసివేశారు.

మారుతి ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ నుంచి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా తొలగించింది. ఇప్పుడు ఇది 17.38 లీటరుకు కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది. బ్రెజా ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 20.15 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

ఈ ఎస్‌యూవీ సీఎన్‌జీ వేరియంట్ కిట్‌తో పాటు 1.5 లీటర్ పెట్రోల్ మోటార్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ గరిష్టంగా 87.8 బీహెచ్‌పీ పవర్‌ని, 121.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు 5 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను పొందుతుంది.

అనేక ఫీచర్లను తగ్గించిన తర్వాత కూడా కంపెనీ ఈ ఎస్‌యూవీ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మారుతి బ్రెజా ధర ప్రస్తుతం రూ. 8.29 లక్షల నుంచి రూ. 13.98 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. దాని సీఎన్‌జీ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.24 లక్షల నుంచి రూ. 12.15 లక్షల మధ్య ఉంది.

మారుతి తన వాహనాల పోర్ట్‌ఫోలియోను నిరంతరం పెంచుకుంటూ పోతూనే ఉంది. కంపెనీ ఈ సంవత్సరం మూడు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఇందులో లేటెస్ట్‌గా వచ్చిన ఫ్రాంక్స్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్, 5 డోర్ జిమ్నీ, ఇన్విక్టో ప్రీమియం స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎమ్‌పీవీ ఉన్నాయి. టాటా నెక్సాన్‌తో మారుతి సుజుకి బ్రెజా  పోటీపడుతుంది.

మారుతి సుజుకి విటారా బ్రెజా 2016లో మొదటిసారిగా లాంచ్ అయింది. ఇందులో కేవలం డీజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. 2020లో బీఎస్6 నిబంధనలు అందుబాటులోకి రావడంతో కంపెనీ డీజిల్ ఇంజిన్ల తయారీని ఆపేసింది. 1.5 లీటర్ బీఎస్6 ఎస్‌హెచ్‌వీఎస్ పెట్రోల్ ఇంజిన్‌తో మారుతి సుజుకి విటారా బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ అప్పట్లోనే లాంచ్ చేసింది. ప్రస్తుతం ఎస్‌యూవీ విభాగంలో పోటీ కూడా విపరీతంగా ఎక్కువైంది. మారుతి సుజుకి కొత్త తరం బ్రెజాను కూడా ఇటీవలే లాంచ్ చేసింది. అంతేకాకుండా కారు పేరులో విటారా కూడా తీసేసి కేవలం ‘బ్రెజా’గానే మార్కెట్ చేసింది. ఈ మారుతి సుజుకి బ్రెజా ధర రూ.7.99 లక్షల నుంచి రూ.13.96 లక్షల మధ్య నిర్ణయించారు. దీని ముందు వెర్షన్ మారుతి సుజుకి విటారా బ్రెజా ధర రూ.7.34 లక్షల నుంచి రూ.11.40 లక్షల మధ్య ఉంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget