Maruti Suzuki Fronx: సేల్స్‌లో రికార్డు సృష్టిస్తున్న మారుతి సుజుకి కారు - మార్కెట్లో భారీ డిమాండ్!
Maruti Suzuki Fronx Sales: మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు సేల్స్ విషయంలో దూసుకుపోతుంది. 2023 ఏప్రిల్‌లో విడుదల అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇప్పటికే రెండు లక్షల సేల్స్ మార్కును దాటింది.
Maruti Suzuki Fronx SUV: భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి డిమాండ్ వేగంగా పెరిగింది. ఇటీవల మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ పెద్ద రికార్డును సృష్టించింది. దీని మంచి డిజైన్, ఫీచర్లు, తక్కువ ధరలో మైలేజీ కారణంగా ఈ ఎస్‌యూవీ బాగా ప్రాచుర్యం పొందింది. దీనికి సంబంధించిన సేల్స్ కూడా వివరీతంగా దూసుకెళ్తున్నాయి.
ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి?
2023 ఏప్రిల్‌లో లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీ రెండు లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. ఈ ఏడాది జనవరిలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ లక్ష యూనిట్ల మార్కును దాటింది. దీన్ని బట్టి చూస్తే కస్టమర్లలో ఈ కారుపై ఎంత క్రేజ్ ఉందో ఊహించుకోవచ్చు. దాని సరసమైన ధర, అద్భుతమైన ఫీచర్ల కారణంగా వినియోగదారులు ఈ ఎస్‌యూవీని చాలా ఇష్టపడతారు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
అద్భుతమైన ఫీచర్లు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హెడ్ అప్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కారు లోపలి భాగాన్ని డ్యూయల్ టోన్ ప్లష్‌లో అందించారు. ఫ్రాంక్స్‌లో 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారులో ఆర్కామిస్ అందిస్తున్న తొమ్మిది అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. వైర్‌లెస్ ఛార్జర్‌తో మొబైల్ ఫోన్‌లను ఛార్జింగ్ చేసే ఫీచర్ కూడా కారులో అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. తద్వారా మీరు మీ కారుకు దూరంగా ఉన్నప్పుడు కూడా దాని గురించి పూర్తి అప్‌డేట్స్‌ను పొందవచ్చు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ కనెక్ట్ చేయవచ్చు. మీరు రిమోట్ ఆపరేషన్ల ద్వారా కూడా మీ కారుకు కనెక్ట్ అయి ఉండవచ్చు.
ఈ కారులో వాహన ట్రాకింగ్, సెక్యూరిటీకి సంబంధించిన అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాని డెల్టా + (వో) వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల ఫీచర్‌ను కూడా పరిచయం చేశారు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర గురించి మాట్లాడితే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.51 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు టాటా పంచ్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలతో పోటీ పడనుంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Next stop Japan: Draped in pristine white, the first consignment of 1600+ Fronx vehicles has set sail for Japan’s Toyohashi port from Gujarat’s Pipavav port. Fronx is exclusively manufactured at MSIL’s Gujarat plant.@makeinindia@CimGOI@MORTHIndia@NITIAayog@MHI_GoI pic.twitter.com/ttVPXdKHoU
— Maruti Suzuki (@Maruti_Corp) August 14, 2024
समय बदल रहा है !
— Piyush Goyal (@PiyushGoyal) August 13, 2024
A truly proud moment as a consignment of over 1600 'Made In India' SUVs from @Maruti_Corp is exported for the first time to Japan.
Modi Government has implemented several policies to boost Indian manufacturing industry over the last decade.
With an emphasis… pic.twitter.com/mX7FNn8X8N