అన్వేషించండి

Maruti Suzuki E Vitara Latest Updates: ఈ-విటారా లాంఛ్ కు రంగం సిద్ధం.. ఈ డిసెంబ‌ర్ లోనే ఆవిష్క‌రించ‌నున్న మారుతి సుజుకి.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు..

దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ కార్ల త‌యారీ కంపెనీ అయిన మారుతి సుజుకి నుంచి తొలి ఈవీ ఈ ఏడాదే మార్కెట్లోకి రానుంది. నిజానికి ఈ ఏడాది చివ‌ర్లో ఇండియాలో దీన్ని లాంఛ్ చేయ‌నున్నారు. దీని ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే..!

Maruti Suzuki eVitara  Launch Letest News:  మారుతి సుజుకి మరియు సుజుకి గ్లోబల్ సంయుక్తంగా తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్ వాహనం (EV) ఈ-విటారా (eVitara) భారత మార్కెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్‌లలో ఒకటిగా నిలిచిందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పటికే, 2,900 సుజుకి ఈ-విటారా యూనిట్ల మొదటి బ్యాచ్‌ను భారతదేశంలో తయారు చేసి ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేయడం ద్వారా, మారుతి సుజుకి తన తయారీ సామర్థ్యాన్ని చాటిచెప్పింది . భారత ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఇది పెద్ద ప్రోత్సాహాన్ని అందించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2025 ఆటో ఎక్స్‌పో (భారత్ మొబిలిటీ ఎక్స్‌పో)లో ఈ-విటారాను ఆవిష్కరించారు. 

తొలి అడుగు..
మారుతి సుజుకి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఇది మొదటి అడుగు అని చెప్పుకోవ‌చ్చు. దీంతో ఇప్ప‌టికే ఈవీ రంగంలో ఉన్న ప్ర‌ధాన కంపెనీల‌కు స‌వాలు విస‌ర‌గ‌లిగే రీతిలో ఈ విటార‌ను త‌యారు చేసిన‌ట్లు కంపెనీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.  ఈ వాహనం డిసెంబర్ 2025లో ఇండియాలో విడుదల కానుంది. దీని ఉత్పత్తి మొత్తం మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్‌లో మాత్రమే జరుగుతుంది. ఇక్కడి నుంచే గ్లోబల్-స్పెక్ మోడళ్లను ఉత్పత్తి చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా మార్కెట్‌లకు పంపనున్నారు. ఈ-విటారాను ఆధారంగా చేసుకుని, టయోటా కూడా తన అర్బన్ క్రూయిజర్ ఈవీ (Urban Cruiser EV)ని విడుదల చేయనుంది, ఇది కూడా ఇక్కడే తయారవుతుంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ,మహీంద్రా బీఈ 6 వంటి మోడళ్లు ఈ-విటారాకు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

ఫీచర్లు, బ్యాటరీ ఆప్షన్లు ..
మారుతి సుజుకి ఈ-విటారా నెక్సా (Nexa) ఔట్‌లెట్ల ద్వారా విక్రయించబడుతుంది, ఇది డెల్టా, జెటా,  ఆల్ఫా అనే మూడు విభిన్న ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. భారతదేశంలో విడుదలయ్యే అన్ని ట్రిమ్స్‌లో ఫార్వ‌ర్డ్ వీల్ డ్రైవ్ (FWD) లేఅవుట్ ప్రామాణికంగా ఉంటుంది. ప్రారంభంలో డ్యూయల్-మోటార్ వెర్షన్లు ఉండకపోవచ్చు. మారుతి రెండు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది: 49 kWh , 61 kWh. ఈ బ్యాటరీ ఆప్షన్లను బట్టి, సింగిల్ ఎఫ్‌డబ్ల్యుడి మోటార్‌తో వరుసగా 142 బిహెచ్‌పి లేదా 172 బిహెచ్‌పి గరిష్ట శక్తిని అందించవచ్చు. ఫీచర్లు , పరికరాల విషయంలో మారుతి ఎక్కడా రాజీ పడకుండా, అధునాతన హంగులను అందించనుందని తెలుస్తోంది.
 ఈ-విటారాలో ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, డాష్‌బోర్డ్ ,డోర్ ట్రిమ్స్‌పై సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్, గ్లాస్ రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ,వెంటిలేటెడ్ సీట్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ-విటారా పొడవు 4.27 మీటర్లు ఉన్నప్పటికీ, దీనికి 2,700 మి.మీ. పొడవైన వీల్‌బేస్ ఉంది, ఇది లోపల ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. ఈ-విటారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కి.మీ గరిష్ట రేంజ్‌ను అందించే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు రేంజీ విష‌యంలో మరింత భరోసాను ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

EV Charger: ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్‌కు ఎంత కెపాసిటీ ఛార్జర్ కావాలి? కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఇంట్లోనే EV ఛార్జర్... 3.3 kW, 7.2 kW, 11 kWలో మీ కారుకు ఏది సరిపోతుందో తెలుసుకోండి
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
భారత్‌లో తిరిగే కార్లన్నీ మన దేశానికి చెందినవి కావు.. ఏ కారు ఏ దేశానిదో తెలుసా?
Bajaj Pulsar N250 SS ఫస్ట్ రైడ్ రివ్యూ: పవర్, టెక్నాలజీ.. కొత్త అప్‌డేట్స్‌తో ఈ బండి మరింత స్పెషల్!
పాత పల్సర్‌కు కొత్త హంగులు.. కొత్త పల్సర్‌ N250 SSలో వచ్చిన 5 కీలక మార్పులేవో మీకు తెలుసా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Dry Fruits Benefits : బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
Bigg Boss Season 10 Today November 15th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శ్వేత ఎలిమినేట్! టాప్ 3.. లీస్ట్ త్రీ వాళ్లే! సెలబ్రిటీల బెస్ట్ హింట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శ్వేత ఎలిమినేట్! టాప్ 3.. లీస్ట్ త్రీ వాళ్లే! సెలబ్రిటీల బెస్ట్ హింట్స్!
Embed widget