Maruti Suzuki Ertiga EMI: 7 సీటర్ కారుకు పెరిగిన డిమాండ్, రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ తో ఎర్టిగా సొంతం చేసుకోండి
ERTIGA Car EMI | ఫ్యామిలీ ట్రిప్స్ కోసం మారుతి ఎర్టిగా కొనుగోళ్లు పెరుగుతున్నాయి. 7 సీటర్ కారును ఈఎంఐ రూపంలో కూడా కొనుగోలు చేసి సొంత కారు కల సాకారం చేసుకోవచ్చు.

Maruti Suzuki Ertiga CNG Finance Plan: ప్రస్తుతం కుటుంబ ప్రయాణాల కోసమైనా సరే భారత్ లో కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. అయితే బడ్జెట్ చూసుకుని మరీ వాహనాలు కొనుగోలు చేయాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా చవకైన ఫ్యామిలీ కారుగా ఫేమస్ అవుతోంది. దాంతో ఈ కారుకు డిమాండ్ బాగా పెరిగింది. గత నెలలో మారుతి ఎర్టిగాకు 14, 151 మంది కొత్త కస్టమర్లు వచ్చారు. మీరు కూడా ఈ MPVని కొనాలనుకుంటే, కారు ఆన్-రోడ్ ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకోండి.
మీరు మారుతి సుజుకి ఎర్టిగాను కొనాలనుకుంటే, కానీ మీ దగ్గర పూర్తి డబ్బులు లేవని ఆందోళన అవసరం లేదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మీరు కేవలం 1 లక్ష రూపాయల డౌన్ పేమెంట్తో మారుతి ఎర్టిగాను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్యామిలీ కారు కొనేందుకు EMI పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
మారుతి సుజుకి ఎర్టిగా ధర వివరాలు..
మారుతి సుజుకి ఎర్టిగా CNG (Maruti Suzuki Ertiga Price) ఎక్స్-షోరూమ్ ధర 10.78 లక్షల రూపాయలు. మీరు ఈ కారును ఢిల్లీaలో కొనుగోలు చేస్తే, కనుక ఈ కారుపై 1 లక్ష 12 వేల 630 రూపాయల RC ఛార్జ్ తో పాటు 40,384 రూపాయల ఇన్సూరెన్స్ కోసం చెల్లించాలి. దీనితో పాటు మరో 12, 980 రూపాయల అదనపు ఛార్జ్ చేస్తారు. దాంతో అన్ని ఖర్చులు చూస్తే ఎర్టిగా ఆన్-రోడ్ ధర రూ.12 లక్షల 43 వేల 994 రూపాయలు అవుతుంది.
ప్రతి నెలా ఇంత EMI చెల్లించాలి
మీరు 12.43 లక్షల రూపాయల ఆన్-రోడ్ ధరపై 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి. దాంతో 11 లక్షల 43 వేల 994 రూపాయల కారు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 10 శాతం వార్షిక వడ్డీతో ప్రతి నెలా రూ.24, 306 రూపాయల మొత్తం ఈఎంఐ రూపంలో మొత్తం 60 వాయిదాలు చెల్లించాలి. అయితే కేవలం లక్ష చెల్లించి కారు సొంతం చేసుకోవడం, లోన్ తీసుకుంటున్నందున మీరు కారు మీద వడ్డీనే 3,14,396 రూపాయలు చెల్లిస్తారు.
(Maruti Suzuki Ertiga) మారుతి సుజుకీ ఎర్టిగా ఫీచర్లు
మారుతి ఎర్టిగా CNG వేరియంట్ సుమారుగా ఒక లీటర్ కు 26.11 kmpl మైలేజీని ఇస్తుంది. కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే మార్కెట్లోని అద్భుతమైన MPVగా పరిగణిస్తారు. ఈ 7 సీటర్ కారు 1462 cc పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. మారుతి ఎర్టిగా ఇంజిన్ 101.64 bhp మ్యాగ్జిమం ఎనర్జీతో పాటు 136.8 Nm అధిక టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెలక్ట్ చేసుకోవచ్చు. కంపెనీ చెప్పే వివరాల ప్రకారం మారుతి ఎర్టిగా కారు 20.51 kmpl మైలేజీతో నడుస్తుంది.






















