అన్వేషించండి

Maruti Brezza 2026 On Road Price Hyderabad: హైదరాబాద్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా ఆన్‌రోడ్‌ ధర ఎంత? ఫీచర్లు, ఇతర పూర్తి వివరాలు ఇవే!

హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా 2026 ఆన్‌రోడ్డు ధరలు బేస్ వేరియంట్‌ ఎల్‌ఎక్స్‌ఐకి రూ. 10.03 లక్షల నుంచి ప్రారంభమై.... టాప్ ఎండ్‌ ZXi ప్లస్‌ ఆటోమేటిక్‌ డ్యూయల్‌ టోన్ వేరియంట్‌ 16.36 లక్షల వరకు ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి బ్రెజ్జా హైదరాబాద్ ఆన్-రోడ్ ధరలు, వేరియంట్లు వివరించబడ్డాయి.
  • 15 వేరియంట్లలో బ్రెజ్జా ధరలు, వివరాలు పట్టికలో లభ్యం.
  • మైలేజ్, రీసేల్ విలువ, విశాలమైన క్యాబిన్ ప్రధాన కొనుగోలు కారణాలు.
  • రూ. లక్ష డౌన్‌పేమెంట్‌కు బ్రెజ్జా ఈఎంఐ అంచనాలు వివరణ.

Maruti Brezza 2026 On Road Price Hyderabad: భారతీయ ఆటోమొబైల్ రంగంలో కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగానికి ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన మోడల్ మారుతి సుజుకి బ్రెజ్జా. నగర వీధుల్లో సులువుగా ప్రయాణించడమే కాకుండా, లాంగ్ డ్రైవ్స్‌లోనూ అద్భుతమైన కంఫర్ట్‌, నమ్మకమైన మైలేజీని అందించే ఈ కారు, హైదరాబాద్‌ వినియోగదారులను ఎంతగానో కట్టుకుంటోంది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ కారు ధరలు, వేరియంట్స్‌, ఫీచర్లలో  వచ్చిన మార్పులు గురించి తెలుసుకుందాం. 

ఒక కారును కొనుగోలు చేసే సమయంలో కేవలం ఎక్స్‌షోరూమ్‌ ధర మాత్రమే కాకుండా, రోడ్డుపైకి వచ్చేసరికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అత్యంత కీలకం. హైదరాబాద్‌ నగర పరిధిలో వర్తించే రోడ్‌ టాక్స్‌, ఇన్సూరెన్స్‌ ఛార్జీలతో కూడిన పూర్తి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

మారుతి బ్రెజ్జా మొత్తం 15 వేరియంట్లను మార్కెట్‌లో అమ్మకానికి ఉంచింది. వాటి హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధరల గురించి చూద్దాం. 

వేరియంట్‌ పేరు ఫ్యూయల్ టైప్‌ ట్రాన్స్‌మిషన్ ఎక్స్‌షోరూమ్‌ ధర ఆన్‌రోడ్ ప్రైస్
బ్రెజ్జాLXi  పెట్రోల్  మాన్యువల్  ₹ 8,25,900  ₹ 10,02,567
బ్రెజ్జాLXi  సీఎన్‌జీ  మాన్యువల్  ₹ 9,16,900  ₹ 11,11,929
బ్రెజ్జాVXi  పెట్రోల్  మాన్యువల్  ₹ 9,25,900  ₹ 11,21,832
బ్రెజ్జాVXi  సీఎన్‌జీ  మాన్యువల్  ₹ 10,16,900  ₹ 12,82,273
బ్రెజ్జాZXi  పెట్రోల్  మాన్యువల్  ₹ 10,39,900  ₹ 13,10,762
బ్రెజ్జాZXi DT పెట్రోల్  మాన్యువల్  ₹ 10,55,300  ₹ 13,29,682
బ్రెజ్జాVXi AT  పెట్రోల్  ఆటోమేటిక్  ₹ 10,59,900  ₹ 13,34,718
బ్రెజ్జాZXi  సీఎన్‌జీ  మాన్యువల్  ₹ 11,30,900  ₹ 14,25,134
బ్రెజ్జాZXi DT  సీఎన్‌జీ  మాన్యువల్  ₹ 11,46,300  ₹ 14,43,853
బ్రెజ్జాZXi Plus పెట్రోల్  మాన్యువల్  ₹ 11,50,900 ₹ 14,49,324
బ్రెజ్జాZXi Plus DT  పెట్రోల్  మాన్యువల్  ₹ 11,66,300   ₹ 14,68,032
బ్రెజ్జాZXi AT  పెట్రోల్  ఆటోమేటిక్  ₹ 11,74,900  ₹ 14,78,670
బ్రెజ్జాZXi AT DT  పెట్రోల్  ఆటోమేటిక్  ₹ 11,90,300  ₹ 14,97,378
బ్రెజ్జాZXi Plus AT  పెట్రోల్  ఆటోమేటిక్  ₹ 12,85,900  ₹ 16,17,008
బ్రెజ్జాZXi Plus AT DT  పెట్రోల్  ఆటోమేటిక్  ₹ 13,01,300   ₹ 16,35,715

బ్రెజ్జా ఎందుకు కొనాలి?

మారుతి సుజుకి బ్రెజ్జా కేవలం ఒక బ్రాండ్‌ పేరుతో మాత్రమే కాకుండా రోడ్లపై బలమైన ముద్ర వేసింది. పోటీదారుల కంటే భిన్నంగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్‌ కే15సి స్మార్ట్ హైబ్రిడ్‌ పెట్రోల్‌ ఇంజన్ లాంగ్ డ్రైవ్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇది 102 బీహెచ్‌పీ పవర్‌, 136.8ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. సిటీ ట్రాఫిక్‌లోనైనా, హైవేలపైనైనా బ్రెజ్జా మైలేజ్‌ అత్యంత ఆకట్టుకుంటుంది. పెట్రోల్‌ వేరియంట్లు లీటరుకు సుమారు 17.38 కిలోమీటర్ల నుంచి 19.89 వరకు మైలేజీ అందిస్తుండగా, సీఎన్జీ వేరియంట్లు కేజీకి 25.51 కిలోమీటర్ల మైలేజీ అందిస్తాయి. 

భారత్‌లో మారుతి సుజుకి వాహనాలకు ఉన్న రీసేల్ మార్కెట్‌ మరో ఇతర బ్రాండ్‌కు లేదు. ఐదేళ్ల తర్వాత విక్రయించినా మంచి ధర పలుకుతుంది. ఐదుగురు ప్రయాణికులు ఎంతో సౌకర్యవంతంగా కూర్చుకోవడానికి తగిన లెగ్‌రూమ్‌, హెడ్‌రూమ్‌ ఇందులో ఉన్నాయి. లాంగ్ జర్నీల్లో అలట లేకుండా ప్రయాణించవచ్చు. 

ఈఎంఐ అంచనాలు!

మీరు హైదరాబాద్‌లో బ్రెజ్జా మోడల్‌ ఎల్‌ఎక్స్‌ఐను లోన్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, దీని కోసం కనీసం లక్ష రూపాయలు డౌన్‌పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగతా 9 లక్షలకుపైగా నగదును బ్యాంక్ లోన్ ద్వారా పొందవచ్చు. దీనికి 9.5 శాతం వడ్డీతో ఐదేళ్ల కాలపరిమితితో లోన్ తీసుకుంటే నెలకు 19 వేల నుంచి 19500 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీకు ఉన్న సిబిల్ స్కోర్‌ ఆధారంగా బ్యాంకు వడ్డీ, బ్యాంక్‌ లోన్ ఆధారపడి ఉంటుంది. 

Frequently Asked Questions

కారు కొనుగోలు చేసేటప్పుడు ఆన్-రోడ్ ధర ఎందుకు ముఖ్యం?

ఎక్స్-షోరూమ్ ధరతో పాటు, రోడ్ టాక్స్ మరియు ఇన్సూరెన్స్ ఛార్జీలు వంటి ఖర్చులను ఆన్-రోడ్ ధరలో చేర్చడం వలన మొత్తం ఖర్చు తెలుస్తుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు చాలా కీలకం.

మారుతి బ్రెజ్జా ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది?

మారుతి బ్రెజ్జా మొత్తం 15 వేరియంట్లలో మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ వేరియంట్‌ల హైదరాబాద్ ఆన్-రోడ్ ధరలు వివరంగా ఇవ్వబడ్డాయి.

మారుతి సుజుకి బ్రెజ్జా ఎందుకు కొనాలి?

ఇది 1.5 లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, మంచి మైలేజీని (పెట్రోల్ 17.38-19.89 కి.మీ/లీ, CNG 25.51 కి.మీ/కేజీ) అందిస్తుంది. దీనికి బలమైన రీసేల్ మార్కెట్ కూడా ఉంది.

హైదరాబాద్‌లో బ్రెజ్జా ఎల్‌ఎక్స్‌ఐ మోడల్‌కు కనీస ఈఎంఐ ఎంత ఉండవచ్చు?

లక్ష రూపాయల డౌన్‌పేమెంట్‌తో, 9.5% వడ్డీతో ఐదేళ్ల కాలపరిమితికి నెలకు 19,000 నుండి 19,500 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సిబిల్ స్కోర్‌పై వడ్డీ ఆధారపడి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget