Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Maruti Suzuki Cars: ప్రస్తుతం మనదేశంలో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మారుతి సుజుకి బ్రాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిలో బెస్ట్ మైలేజీని ఇచ్చే కార్లు ఏవో చూద్దాం.
Maruti Suzuki Affordable Cars: మారుతి సుజుకి కార్లు అంటే భారతదేశంలోని వినియోగదారులు అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు మంచి మైలేజీని కూడా ఇస్తాయి. మీరు సరసమైన ధరలో మారుతి కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇక్కడ మంచి మైలేజీని ఇచ్చే మూడు ఆప్షన్లను చూద్దాం. మీరు కొనుగోలు చేయడానికి ఏ కారు సరైనదో మీరే నిర్ణయించుకోవచ్చు.
మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10)
భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధరకు లభించే కార్లలో ఒకటి మారుతి ఆల్టో కే10. ఆల్టో ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి మొదలయి రూ. 5.96 లక్షల వరకు ఉంది. మైలేజీ గురించి చెప్పాలంటే ఆల్టో కే10 పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.39 నుంచి 24.90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని సీఎన్‌జీ వేరియంట్ కిలోగ్రాముకు 33.40 నుంచి 33.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి ఆల్టో కే10లో కంపెనీ 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 66 బీహెచ్‌పీ పవర్‌తో 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయి ఉంటుంది. ఈ కారులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)
కంపెనీ మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో 998 సీసీ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 55.92 బీహెచ్‌పీ పవర్‌తో 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారులో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ కారు మీకు దాదాపు 23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.54 లక్షల నుంచి మొదలై రూ. 7.33 లక్షల వరకు ఉంది. అలాగే మార్కెట్‌లో ఈ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో, రెనో క్విడ్ వంటి కార్లకు డైరెక్ట్‌గా పోటీని ఇస్తుంది.
Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు 1 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది. దాని సీఎన్‌జీ వెర్షన్‌లో ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. ఇది 56.7 పీఎస్ పవర్, 82 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 60 లీటర్ సీఎన్‌జీ ట్యాంక్ అందుబాటులో ఉంది.
మారుతి సెలెరియో పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అయితే సీఎన్‌జీ వేరియంట్ కిలోగ్రాముకు 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఏసీ వెంట్స్, మ్యూజిక్ కంట్రోల్‌తో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్!