మనదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బెస్ట్ సెల్లింగ్ బైక్ ఏదో తెలుసా? రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మరి మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఏది? చాలా మంది రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్కువగా అమ్ముడుపోతుందని అనుకుంటారు. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మనదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350నే బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా నిలిచింది. క్లాసిక్ 350 తర్వాత హంట్ 350ని వినియోగదారులు ఎక్కువగా కొంటున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 సేల్స్‌లో నంబర్ 3గా నిలిచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ.1.93 లక్షలుగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే క్లాసిక్ 350 సేల్స్ ఈ సంవత్సరం ఎనిమిది శాతం పడిపోయాయి.