GST ట్రిమ్మింగ్‌తో Maruti Dzire రూ.87,000 ఆదా చేస్తుంది - హోండా అమేజ్, టాటా టిగోర్ రేట్లు కూడా తగ్గాయి!
GST Reforms 2025: 5-స్టార్ భద్రతా రేటింగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న మారుతి డిజైర్, దాని విభాగంలో హోండా అమేజ్ & టాటా టిగోర్ వంటి కార్లకు ఛాలెంజ్ విసురుతుంది.

Maruti Dzire New Price After GST Cut: జీఎస్‌టీ తగ్గింపు తర్వాత, మారుతి డిజైర్ ధర రూ. 87,000 వరకు తగ్గింది. దీనివల్ల, ఈ సెడాన్ ఎప్పుడూ లేనంత తక్కువ రేటులో ఇప్పుడు దొరుకుతోంది. మీరు మారుతి డిజైర్ కొనాలని భావిస్తుంటే, ఇదే మీకు గోల్డెన్ టైమ్. ఈ కారు ధర పరంగానే కాకుండా ఫీచర్లు & భద్రత పరంగా కూడా అద్భుతమైన సెడాన్‌గా గుర్తింపు పొందింది.
మారుతి డిజైర్ లుక్స్ చాలా స్టైలిష్‌గా, యువతరాన్ని ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. షార్ప్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ టచ్‌తో కూడిన గ్రిల్ కారుకు ప్రీమియం ఫీల్‌ను ఇస్తోంది. కొత్త అలాయ్ వీల్స్ డిజైర్ సైడ్ ప్రొఫైల్‌ను మరింత స్పోర్టీగా చూపిస్తున్నాయి. కాంపాక్ట్ సెడాన్ అయినప్పటికీ, డిజైర్ వెనుక భాగం ఎలిగెంట్ లుక్‌తో దీని క్లాస్‌ను పెంచింది. మొత్తంగా చూస్తే, కొత్త డిజైర్ డిజైన్ ఆధునికతను, ఎలిగెన్స్‌ను కలిపి రూపొందించిన ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లా ఉంటుంది.
కొత్త GST 2.0 (GST Reforms 2025) అమలు తర్వాత, డిజైర్ అన్ని వేరియంట్‌ల ధరలు రూ. 58,000 నుంచి రూ. 87,000 వరకు దిగి వచ్చాయి. మారుతి డిజైర్‌లో ఏ వేరియంట్ ఇప్పుడు ఎంత ఆదా చేస్తుందో ఇక్కడ చూద్దాం.
మారుతి డిజైర్ కొత్త ధరలు, వేరియంట్ వారీగా:
LXI 1.2L 5MT వేరియంట్ కొత్త ధర ఇప్పుడు రూ. 6.25 లక్షలకు తగ్గింది
VXI 1.2L 5MT వేరియంట్ కొత్త ధర రూ. 7.17 లక్షలుగా మారింది
ZXI 1.2L 5MT వేరియంట్ ధర రూ. 8.17 లక్షలకు దిగి వచ్చింది
టాప్ వేరియంట్ ZXI CNG 1.2L 5MT కొత్త ధర రూ. 9.04 లక్షలు అయింది
మారుతి డిజైర్ ప్రత్యర్థి కార్లు కూడా చౌకగానే దొరుకుతున్నాయి!
అద్భుతమైన డిజైన్ , ప్రీమియం ఫీచర్లు & 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న మారుతి డిజైర్, దాని విభాగంలో Honda Amaze & Tata Tigor వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. టాటా టిగోర్ ఇప్పుడు రూ. 75,000 తక్కువకు వస్తుంది. Tata Altroz ధర కూడా రూ. 1.10 లక్షల వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో, హోండా అమేజ్ ఎక్స్-షోరూమ్ ధర గతంలో రూ. 8.14 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.24 లక్షల వరకు ఉండేది. కొత్త GST 2.0 రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత, Honda Amaze ధరలు రూ. 1.20 లక్షల వరకు తగ్గాయి. గతంలో రూ. 7,62,800 ఎక్స్-షోరూమ్ రేటుకు వచ్చిన బేస్ వేరియంట్ S MT (Old Gen) ఇప్పుడు ₹6,97,700 ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది.
భద్రత పరంగానూ మారుతి డిజైర్ కస్టమర్లకు మంచి ఎంపిక. ఈ కారుకు గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. మారుతి డిజైర్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ( ESC) సహా చాలా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి, ఇది మన దేశంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.





















