అన్వేషించండి

మహీంద్రా థార్‌ ధరలతో జనానికి షాక్‌: బేస్‌ వేరియంట్‌ తప్ప మిగతా అన్ని వేరియంట్ల రేట్లు పెంపు

మహీంద్రా థార్‌ ధరలను కంపెనీ పెంచింది. బేస్‌ వేరియంట్‌ ధర యథాతథంగా ఉండగా, మిగతా అన్ని వేరియంట్ల ధరలు రూ. 20,000 వరకు పెరిగాయి. తాజా ధరలు, వేరియంట్ల వివరాలు తెలుసుకోండి.

Mahindra Thar India Price: లైఫ్‌స్టైల్‌ SUV సెగ్మెంట్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న మహీంద్రా థార్‌ ఇప్పుడు కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. భారత మార్కెట్‌లో థార్‌ ధరలను మహీంద్రా కంపెనీ తాజాగా పెంచింది. ఈ ధరల పెంపు వెంటనే అమల్లోకి వచ్చింది. అయితే ఒక విషయంలో మాత్రం కొనుగోలుదారులకు ఊరట ఉంది. బేస్‌ వేరియంట్‌ ధరను కంపెనీ యథాతథంగా కొనసాగించింది.

మహీంద్రా థార్‌ ధరలు రూ. 20,000 వరకు పెరిగాయి. అయితే AXT డీజిల్‌ 2WD బేస్‌ వేరియంట్‌ ధర మాత్రం ఇప్పటికీ రూ.9.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గానే ఉంది. మిగతా అన్ని వేరియంట్ల ధరలకు రూ. 20,000 పెంపు వర్తిస్తుంది.

ఏయే వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి?

మహీంద్రా థార్‌ ప్రస్తుతం AXT, LXT అనే రెండు ట్రిమ్‌ లెవెల్స్‌లో లభిస్తోంది. కొనుగోలుదారుడి అవసరాలను బట్టి ఇందులో 2WD, 4WD ఆప్షన్లు కూడా అందిస్తున్నారు. ఆఫ్‌ రోడ్‌ డ్రైవింగ్‌ ఇష్టపడే వారికి 4WD వేరియంట్లు ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

తాజా ధరల పరిధి

ధరల పెంపు తర్వాత. మహీంద్రా థార్‌ ధరలు ఇప్పుడు రూ.9.99 లక్షల నుంచి రూ. 17.19 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉన్నాయి. టాప్‌ వేరియంట్‌ ధర పెరిగి రూ. 17.19 లక్షలు చేరింది.

వేరియంట్‌ వారీగా తాజా ధరలు (ఎక్స్‌-షోరూమ్‌ ధరలు) (రూ.లక్షల్లో)

వేరియంట్‌ 
కొత్త ధర
పాత ధర
వ్యత్యాసం
AXT Diesel 2WD
 
9.99
9.99
మార్పు లేదు
LXT Diesel 2WD MT
 
12.39
12.19
రూ. 20,000 పెంపు
LXT Petrol 2WD AT
 
14.19
13.99
రూ. 20,000 పెంపు
LXT Petrol 4WD MT
 
14.89
14.69
రూ. 20,000 పెంపు
LXT Diesel 4WD MT
 
15.69
15.49
రూ. 20,000 పెంపు
LXT Petrol 4WD AT
 
16.45
16.25
రూ. 20,000 పెంపు
LXT Diesel 4WD AT
 
17.19
16.99
రూ. 20,000 పెంపు

ఈ ధరలతో ఇప్పుడు థార్‌ టాప్‌ వేరియంట్‌ మరింత ఖరీదైన SUVగా మారింది.

ఇంజిన్‌ ఆప్షన్లు ఎలా ఉన్నాయి?

మహీంద్రా థార్‌ 2025లో ఫేస్‌లిఫ్ట్‌తో వచ్చింది. అయినప్పటికీ ఇంజిన్‌ ఆప్షన్లలో పెద్ద మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఈ SUV మూడు ఇంజిన్‌ ఆప్షన్లతో లభిస్తోంది.

1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ - 119 hp పవర్‌ ఇస్తుంది, మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది

2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ - 152 hp పవర్‌ ఇస్తుంది, మాన్యువల్‌ & ఆటోమేటిక్‌ ఆప్షన్లు ఉన్నాయి

2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ - 132 hp పవర్‌ ఇస్తుంది, మాన్యువల్‌ & ఆటోమేటిక్‌ ఆప్షన్లు ఉన్నాయి

పెట్రోల్‌ ఇంజిన్‌తో 4WD ఆప్షన్‌ ఐచ్ఛికంగా లభిస్తుండగా, 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో 4WD స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.

కొనాలనుకునే వారికి సూచన

ధరలు పెరిగినా, మహీంద్రా థార్‌ ఇప్పటికీ లైఫ్‌స్టైల్‌ SUV సెగ్మెంట్‌లో తన ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంటోంది. ఆఫ్‌ రోడ్‌ డ్రైవింగ్‌, అడ్వెంచర్‌ ట్రిప్స్‌ ఇష్టపడే వారికి ఇది ఇప్పటికీ డ్రీమ్‌ SUVగానే ఉంది. అయితే కొనుగోలు ముందు తాజా ధరలను షోరూంలో మరోసారి నిర్ధారించుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget