55.4hp పవర్‌తో దూసుకొస్తున్న KTM RC450 - చైనా అప్రూవల్ లిస్టింగ్‌లో లీకైన ఫీచర్లు
KTM కొత్త స్పోర్ట్స్ బైక్ RC450, చైనా టైప్-అప్రూవల్ డాక్యుమెంట్లలో లీక్ అయింది. 55.4hp ట్విన్ ఇంజిన్, సింగిల్-సైడెడ్ స్వింగ్ ఆర్మ్, WP సస్పెన్షన్‌తో ఈ మోటార్‌సైకిల్ వస్తుందని సమాచారం.

Upcoming KTM Motorcycles: KTM బ్రాండ్‌కి భారత మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువతలో ఈ కంపెనీకి ఉన్న ఫాలోయింగ్ ఎంతుందో అందరికీ తెలిసిందే. KTM నుంచి వచ్చే ప్రతి కొత్త మోడల్ కోసం బైక్ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా, ఇంకా లాంచ్ కాని KTM RC450 స్పోర్ట్స్ బైక్ గురించి పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. చైనా టైప్-అప్రూవల్ డాక్యుమెంట్లలో ఈ బైక్ కనిపించడం ఇప్పుడు ఆటో సెగ్మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కొన్ని నెలల క్రితం, RC సిరీస్‌లో, కొత్త KTM బైక్ టెస్టింగ్ సమయంలో కనిపించిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ డౌట్స్‌కు ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చినట్టే కనిపిస్తోంది. KTM & CFMoto కలిసి చైనాలో ఫైల్ చేసిన డాక్యుమెంట్లలో RC450 సంబంధించిన ఫోటోలు, టెక్నికల్ వివరాలు స్పష్టంగా కనిపించాయి.
CFMoto 450SR-S ప్లాట్‌ఫామ్‌పైనే RC450
ఈ కొత్త KTM RC450 అసలైన బేస్ ప్లాట్‌ఫామ్ CFMoto 450SR-S నుంచే తీసుకుంటున్నారు. ఈ స్పోర్ట్స్ బండిలోని అదే 449cc ప్యారల్-ట్విన్ ఇంజిన్‌తోనే KTM RC450 వస్తోంది. అయితే KTM ఈ ఇంజిన్‌ను ట్యూన్ చేసి మరింత పవర్ ఇచ్చింది. CFMoto మోడల్ 51.7hp పవర్ ఇస్తే, RC450 మాత్రం 55.4hp పవర్ ఇస్తుంది. దీని వల్ల బైక్ మరింత శక్తిమంతంగా ఉండబోతోంది.
వెయిట్ విషయంలో కూడా KTM RC450 కాస్త ముందుంది. CFMoto బైక్ 171kg ఉంటే, RC450 బరువు 168kg మాత్రమే. అంటే బైక్ లైట్‌గా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్‌గా ఉంటుంది. డాక్యుమెంట్ల ప్రకారం ఈ బైక్ టాప్ స్పీడ్ 195kmph అని కూడా పేర్కొన్నారు.
సింగిల్-సైడెడ్ స్వింగ్ ఆర్మ్, WP సస్పెన్షన్
KTM బ్రాండ్‌కు పేరు తెచ్చిన మరో ముఖ్య అంశం హై-పర్ఫార్మెన్స్ సస్పెన్షన్. ఈసారి కూడా WP సస్పెన్షన్ సెటప్‌ను RC450లో వాడుతున్నారు. CFMoto మాత్రం KYB యూనిట్స్ వాడుతుండగా, KTM ఈ విషయంలో ముందంజలో ఉంది.
సింగిల్-సైడెడ్ స్వింగ్ ఆర్మ్ కూడా RC450ను ఒక ప్రీమియం-స్పోర్ట్స్ బైక్‌గా కనిపించేలా చేస్తుంది. ఒక్క ఫోటో మాత్రమే లీక్ అయినప్పటికీ, అందులో క్విక్‌షిఫ్టర్, స్టీరింగ్ డాంపర్ ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి రేసింగ్ ఫీల్‌ను ఇస్తాయి.
ఫుట్‌పెగ్స్ కూడా కాస్త ఎత్తులో ఉండే అవకాశం ఉంది. అలాగే హ్యాండిల్‌బార్ కూడా మరింత కిందకు పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల రైడింగ్ పొజిషన్ పూర్తిగా రేస్ ట్రాక్ ఫీలింగ్ ఇస్తుంది.
కొంచెం షార్ప్ జియోమెట్రీ
RC450 వీల్‌బేస్ 1360mmగా ఉంది. ఇది CFMoto కంటే 10mm తక్కువ. వీల్‌బేస్ తగ్గితే బైక్ హ్యాండ్లింగ్ మరింత షార్ప్‌గా ఉంటుంది. KTM బైకుల్లో ఉండే ఆ అగ్రెసివ్ స్టైలింగ్ ఈ మోడల్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముందు ఫెయరింగ్‌లో చిన్న వింగ్‌లెట్స్ కూడా ఉంచారు.
బ్రేకింగ్, టైర్ల వివరాలు
బ్రేకింగ్ కోసం బోష్ కంపెనీ హార్డ్‌వేర్ వాడారు. టైర్ల విషయంలో మాత్రం CFMoto సెటప్‌నే కొనసాగించారు - 110/70-17 ఫ్రంట్, 150/60-17 రియర్. ఇవి స్పోర్ట్స్ బైక్‌కు సరిగ్గా సరిపోయే సైజులు.
భారత మార్కెట్లోకి వస్తుందా?
RC450 అధికారిక లాంచ్ టైమ్‌లైన్ ఇంకా ప్రకటించలేదు. అయితే, అప్రూవల్ డాక్యుమెంట్లలో ప్రొడక్షన్ రెడీ మోడల్ కనిపించడాన్ని చూస్తే, గ్లోబల్ లాంచ్ త్వరలో ఉండొచ్చని భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఈ బైక్ లాంచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇది CFMoto ప్లాట్‌ఫామ్‌పై తయారవుతోంది. భారత్‌లో KTM స్వయంగా ఈ మోడల్ తయారు చేయడం లేదు. అందుకే RC450 ఇండియాలోకి త్వరగా రాకపోవచ్చు.
అయినా బైక్ లవర్స్ మాత్రం ఈ అప్‌డేట్‌తో ఎక్సైటెడ్‌గా ఉన్నారు. KTM నుంచి కొత్త రేస్-ఓరియెంటెడ్ ట్విన్-సిలిండర్ బైక్ రావడం అంటే ఆటో సెగ్మెంట్‌లో మరో పెద్ద వార్తే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















