అన్వేషించండి

KTM 200 Duke కొత్త ఫీచర్లు లీక్.. 25hp పవర్‌తో మరింత స్పోర్టీ రైడింగ్, ధర స్వల్పంగా పెరిగే అవకాశం!

KTM 200 Dukeలో Bi-directional Quickshifter, Ride-by-Wire, Traction Control, Ride Modes వంటి కొత్త ఫీచర్లు రానున్నాయి. ధర స్వల్పంగా సుమారు రూ.4,000 పెరిగే అవకాశం ఉంది.

Updated KTM 200 Duke 2026: స్పోర్ట్స్ బైక్ తయారీ కంపెనీ KTM, తన పాపులర్‌ 200 Duke మోటార్‌సైకిల్‌ను మరిన్ని ఫీచర్లతో అప్‌డేట్ చేసేందుకు సిద్ధమైంది. కొత్త వెర్షన్ డీలర్‌షిప్ వద్ద కనిపించడంతో ఈ బైక్‌ అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. ఇందులో బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, రైడ్-బై-వైర్ థ్రాటిల్, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్స్‌ వంటి కీలక ఫీచర్లు చేరనున్నాయి. ఇప్పటికే స్పోర్టీ పనితీరుతో యువతను ఆకట్టుకుంటున్న ఈ బైక్‌కు కొత్త రైడర్ ఎయిడ్స్ అదనపు ఆకర్షణగా మారనున్నాయి. అయితే, అప్‌డేట్‌ మోడల్‌  లాంచ్ తేదీని, పూర్తి వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

ఏమేం కొత్త ఫీచర్లు వచ్చాయి?

ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్. దీని సాయంతో క్లచ్‌ను ప్రతిసారీ ఉపయోగించకుండా గేర్లను పైకి, కిందికి మార్చుకోవచ్చు. స్పోర్టీ రైడింగ్ సమయంలో గేర్ మార్పులను సులభతరం చేయడమే దీని లక్ష్యం. KTM 390 Duke, 250 Duke వంటి పెద్ద మోడళ్లలోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

కొత్తగా రైడ్-బై-వైర్ థ్రాటిల్‌ను కూడా తీసుకొస్తున్నారు. సాధారణ మెకానికల్ థ్రాటిల్‌కు బదులుగా ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థ ద్వారా ఇంజిన్‌కు ఇంధనం, పవర్ అందించే విధానాన్ని ఇది నిర్వహిస్తుంది. ఈ మార్పుతో రైడ్‌ మోడ్స్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లను అందించేందుకు అవకాశం ఏర్పడింది.

రైడ్‌ మోడ్స్‌ ద్వారా రైడర్‌కు అవసరమైన రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా బైక్ స్పందనను ఎంచుకునే వీలుంటుంది. ట్రాక్షన్‌ కంట్రోల్‌.. వెనుక చక్రం రోడ్డుపై పట్టును కోల్పోయే పరిస్థితుల్లో దాని స్పిన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా జారుడు రోడ్లపై ఇది ఉపయోగపడవచ్చు. అయితే ఈ బైక్‌లో ఎన్ని రైడ్ మోడ్స్‌ ఉంటాయి, వాటి పనితీరు ఎలా ఉంటుందనే వివరాలను KTM ఇంకా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: క్రెటా కంటే తక్కువ ధరకే Hyundai Bayon SUV లాంచ్‌.. HX6, HX8, HX10 వేరియంట్లలో మీకు ఏది బెస్ట్‌?

స్విచ్‌గేర్‌లోనూ మార్పులు

కొత్త KTM 200 Dukeలో స్విచ్‌గేర్‌ను కూడా అప్‌డేట్ చేశారు. ఎడమవైపు స్విచ్‌గేర్ పాత మోడల్‌లో ఉన్నట్లుగానే కనిపిస్తోంది. కుడివైపు మాత్రం KTM 390 Dukeలో ఉన్న యూనిట్‌ను పోలిన కొత్త స్విచ్‌గేర్‌ను అందించారు.

మిగతా డిజైన్‌లో పెద్ద మార్పులు కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే 200 Dukeకు పెద్ద ఫ్రంట్ డిస్క్ బ్రేక్, తక్కువ బరువున్న వీల్స్ వంటి అప్‌డేట్లు వచ్చాయి. ఇప్పుడు కొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లు చేరడంతో బైక్ ప్యాకేజీ మరింత మెరుగుపడనుంది.

అయితే రైడ్-బై-వైర్ ఉన్నప్పటికీ ఈ మోడల్‌లో క్రూజ్‌ కంట్రోల్‌ ఫీచర్ ఉండదని తెలుస్తోంది. ఇది ప్రధానంగా స్పోర్టీ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బైక్ కావడంతో ఈ ఫీచర్‌ను అందించడం లేదని భావించవచ్చు.

ఇంజిన్‌లో మార్పులు ఉంటాయా?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త KTM 200 Dukeలో ఇంజిన్ మార్పులు ఉండే అవకాశం తక్కువ. ఇందులో 199.5cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కొనసాగవచ్చని అంచనా. ఈ ఇంజిన్ 10,000rpm వద్ద 25hp పవర్, 8,000rpm వద్ద 19.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేస్తారు.

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 43mm USD ఫోర్క్, వెనుకవైపు WP మోనోషాక్ కొనసాగనున్నట్లు కనిపిస్తోంది. అంటే ప్రధాన మార్పులు ఇంజిన్ లేదా సస్పెన్షన్‌లో కాకుండా.. గేర్‌షిఫ్టింగ్ సౌలభ్యం, ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్‌పైనే కేంద్రీకృతమయ్యాయి.

ఇది కూడా చదవండి: రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!

ధర ఎంత పెరగొచ్చు?

ప్రస్తుతం KTM 200 Duke ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.2.05 లక్షలు. కొత్త ఫీచర్ల కారణంగా ధర సుమారు రూ.4,000 పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే తుది ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ బైక్‌కు ప్రధాన ప్రత్యర్థిగా Bajaj Pulsar NS200 నిలుస్తోంది. Pulsar NS200 ధర సుమారు రూ.1.60 లక్షల ఎక్స్‌షోరూమ్ స్థాయిలో ఉంది. ధర పరంగా బజాజ్ మోడల్ తక్కువగా ఉన్నప్పటికీ, KTM 200 Duke తన స్పోర్టీ పనితీరు, ప్రీమియం ఫినిషింగ్‌తో ప్రత్యేకతను చాటుకుంటోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
క్రెటా కంటే తక్కువ ధరకే Hyundai Bayon SUV లాంచ్‌.. HX6, HX8, HX10 వేరియంట్లలో మీకు ఏది బెస్ట్‌?
కొత్త హ్యుందాయ్ బేయాన్‌లో 7 ట్రిమ్‌లు, 11 వేరియంట్లు.. మీ డబ్బుకు తగ్గ విలువ ఇచ్చేది ఏది?
రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!
Hyundai Bayon SUV లాంచ్.. Creta కంటే ధర తక్కువే, ఫీచర్లు మాత్రం అదుర్స్!
భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Dube Selection Danger: యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
క్రెటా కంటే తక్కువ ధరకే Hyundai Bayon SUV లాంచ్‌.. HX6, HX8, HX10 వేరియంట్లలో మీకు ఏది బెస్ట్‌?
కొత్త హ్యుందాయ్ బేయాన్‌లో 7 ట్రిమ్‌లు, 11 వేరియంట్లు.. మీ డబ్బుకు తగ్గ విలువ ఇచ్చేది ఏది?
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Embed widget