2026 Kawasaki Ninja 650: ఇంజిన్, ఫీచర్లు ఏంటి? విజయవాడ-హైదరాబాద్ ఆన్-రోడ్ రేటు ఎంత?
2026 కవాసాకి నింజా 650 ఇటీవలే భారత్‌లో లాంచ్ అయింది. ఇంజిన్, ఫీచర్లు, ధర, విజయవాడ, హైదరాబాద్ ఆన్‌రోడ్ ధరలతో ఈ బైక్ కొనే ముందు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు.

Kawasaki Ninja 650 India: మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ టూరర్ సెగ్మెంట్‌లో మంచి పేరు తెచ్చుకున్న కవాసాకి నింజా 650 మోటర్‌సైకిల్‌కు, 2026 మోడల్ మన దేశంలో ఇటీవలే అధికారికంగా లాంచ్ అయింది. ఈ కొత్త వెర్షన్ E20 ఫ్యూయల్ కంప్లైంట్ కావడం ప్రధాన అప్‌డేట్. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్, కంఫర్ట్ రైడింగ్ పొజిషన్‌తో నింజా 650 చాలా మందికి ఇది ఒక డ్రీమ్ బైక్. అయితే కొనేముందు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్ వివరాలు
కవాసాకి నింజా 650లో 649cc ప్యారలల్ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ వాడారు. ఇది 8,000 rpm వద్ద 68hp పవర్, 6,700 rpm వద్ద 62.1Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. హైవే రైడింగ్‌కు, లాంగ్ టూరింగ్‌కు ఇది చాలా స్మూత్‌గా పని చేస్తుంది.
మైలేజ్, ట్యాంక్ సామర్థ్యం, బరువు
ఈ బైక్‌లో 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. కెర్బ్ వెయిట్ (ఫ్యూయల్, ఆయిల్స్‌తో కలిపి) 196 కిలోలు కావడంతో రోడ్డుపై స్టేబిలిటీ బాగుంటుంది. 790mm సీట్ హైట్ ఉండటం వల్ల సగటు ఎత్తు ఉన్న రైడర్లకు కూడా ఇది కంఫర్ట్‌గా ఉంటుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
నింజా 650లో 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. ఇది Bluetooth కనెక్టివిటీతో Ridelogy యాప్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 2-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్, ABS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ రైడింగ్‌తో పాటు స్పోర్టీ డ్రైవింగ్‌కు ఇవి ఉపయోగపడతాయి.
టైర్లు & రైడింగ్ గ్రిప్
ఈ బైక్ ముందు వైపు 120/70-17, వెనుక వైపు 160/60-17 టైర్లతో వస్తుంది. హైవే స్పీడ్స్‌లో మంచి గ్రిప్, కార్నరింగ్‌లో (మలుపు తిరిగే సమయంలో) స్టెబిలిటీ ఇస్తాయి.
కలర్ ఆప్షన్లు
2026 కవాసాకి నింజా 650 ప్రస్తుతం లైమ్ గ్రీన్ కలర్ స్కీమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది బ్రాండ్ ఐడెంటిటీని స్పష్టంగా చూపిస్తుంది.
ధర & తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ రేట్లు
ఈ బైక్ సింగిల్ వేరియంట్‌లో వస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర ₹7.91 లక్షలు. ఇది గత మోడల్‌తో పోలిస్తే సుమారు ₹14,000 ఎక్కువ.
కొత్త కవాసాకి నింజా 650 కొనాలంటే విజయవాడలో ఆన్-రోడ్ ధర:
ఎక్స్-షోరూమ్: ₹7,91,000
RTO: ₹99,920
ఇన్సూరెన్స్: ₹32,218
మొత్తం ఆన్‌రోడ్ ధర: ₹9,23,138
కొత్త కవాసాకి నింజా 650 కొనాలంటే హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర:
ఎక్స్-షోరూమ్: ₹7,91,000
RTO: ₹1,47,380
ఇన్సూరెన్స్: ₹32,528
మొత్తం ఆన్‌రోడ్ ధర: ₹9,70,908
కొనాలా? వద్దా?
స్పోర్టీ లుక్‌తో పాటు టూరింగ్ కంఫర్ట్ కావాలనుకునే రైడర్లకు కవాసాకి నింజా 650 ఒక మంచి ఎంపిక. ప్రీమియం సెగ్మెంట్‌లో నమ్మదగిన ఇంజిన్, బ్రాండ్ వాల్యూ, రిఫైన్డ్ రైడ్ కోరుకునే వారికి ఇది సరైన బైక్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















