అన్వేషించండి

భారత్‌ మార్కెట్లోకి కావసాకి Z900, Z900 SE బైక్స్.. 1,099cc, హైటెక్ ఫీచర్లు.. ధర తెలిస్తే షాక్

కావసాకి 2026 Z1100, Z1100 SE లను విడుదల చేసింది. 1099cc ఇంజిన్, 136 PS పవర్, 5-అంగుళాల TFT, అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

కావాసాకి భారత మార్కెట్‌లో కొత్త 2026 Kawasaki Z1100, Z1100 SE సూపర్నేకెడ్ బైక్‌లను విడుదల చేసింది. ఇది Z సిరీస్‌లో అత్యంత పవర్ ఫుల్. అతిపెద్ద ఇంజిన్ కలిగిన మోడల్ అని కంపెనీ పేర్కొంది. కొత్త Z1100 బైక్ ప్రారంభ ధర రూ. 12.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించదరు. ఈ బైక్ ప్రసిద్ధ Kawasaki Z1000 అప్‌డేట్ చేసిన, మరింత శక్తివంతమైన ఎడిషన్.

డిజైన్ ఎలా ఉంది..

Kawasaki Z1100 డిజైన్ కంపెనీ ప్రసిద్ధ సుగోమి డిజైన్ తత్వశాస్త్రం ఆధారంగా రూపొందించారు. బైక్ పూర్తిగా డార్క్ థీమ్‌లో తయారు చేశారు. ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో ఆకర్షణీయమైన LED హెడ్‌లైట్, కొత్త స్పోర్టీ టైల్ సెక్షన్, శిల్పకళా ఇంధన ట్యాంక్ ఉన్నాయి. Z1100 ను ఎబోనీ / మెటాలిక్ కార్బన్ గ్రే రంగులో, Z1100 SE ను మెటాలిక్ మాట్టే గ్రాఫెన్‌స్టీల్ గ్రే / మెటాలిక్ మాట్టే కార్బన్ గ్రేలో తీసుకొచ్చారు. SE వెర్షన్ స్పెషల్ అల్లాయ్ వీల్ డిజైన్, మరింత ప్రీమియం వివరాలతో వచ్చింది. దాంతో బైక్ మరింత దూకుడుగా కనిపిస్తుంది.


ఇంజిన్, పనితీరు..

కొత్త Kawasaki Z1100 అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. దీని 1,099cc ఇన్లైన్ 4, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, ఇది వేగవంతమైన టార్క్. పవర్ సప్లై కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేసింది. ఈ ఇంజిన్ 136 PS శక్తిని, 113 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే, 6-స్పీడ్ గేర్‌బాక్స్, Kawasaki Quick Shifter (KQS) దీనిని హై-పెర్ఫార్మెన్స్ రైడింగ్ ను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. క్విక్ షిఫ్టర్ కారణంగా రైడర్ క్లచ్ నొక్కకుండానే సులభంగా గేర్‌లు మార్చవచ్చు. ఇది సిటీలో నడపడం సులభం చేస్తుంది. బైక్‌లో ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇది సుదూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా చేస్తుంది.

ఫీచర్లు..

ఫీచర్ల విషయానికి వస్తే Kawasaki Z1100, Z1100 SE ఏదైనా ప్రీమియం నేకెడ్ బైక్‌కు నేరుగా పోటీని ఇస్తాయి. ఇందులో 5 అంగుళాల పూర్తి డిజిటల్ TFT డిస్‌ప్లే ఉంది. ఇది బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు ఈజీగా కనెక్ట్ అవుతుంది. రైడోలజీ యాప్‌తో కనెక్ట్ అయితే మీరు నావిగేషన్, కాల్-అలర్ట్, నోటిఫికేషన్‌ల వంటి ఫీచర్లు  పొందుతారు. ఇది రైడింగ్‌ను మరింత ఈజీగానే కాకుండా స్మార్ట్‌గానూ చేస్తుంది.

  • భద్రత విషయానికి వస్తే Kawasaki ఈ బైక్‌లో పలు మోడ్రన్ ఫీచర్లను అందించింది. ఇందులో IMU ఆధారిత Kawasaki కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్ ఉంది. ఇది ముఖ్యంగా వేగంగా మలుపులు తీసుకునే సమయంలో బైక్‌ను స్టడీగా ఉంచుతుంది. Kawasaki ఇంటెలిజెంట్ ABS, మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి. ఇవి జారే రోడ్డు అయినా లేదా అధిక వేగంలో వెళ్లే పరిస్థితిలోనూ బైక్‌కు మెరుగైన గ్రిప్, కంట్రోల్ ఇస్తాయి. ఈ టెక్నాలజీ లక్ష్యం ఏమిటంటే, రైడర్‌కు ఎల్లప్పుడూ సురక్షితమైన, మంచి రైడింగ్ అనుభవాన్ని అందించడం. స్టైలిష్ లుక్ కలిగిన ప్రీమియం బైక్ కోసం చూస్తున్న రైడర్‌లకు ఇది బెస్ట్ ఛాయిస్.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget