అన్వేషించండి

అమ్మకాల్లో హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా హవా! దూసుకుపోతున్న టూ-వీలర్ సేల్స్

ఇండియ‌న్ టూ-వీలర్ మార్కెట్ ఫిబ్రవరి 2026లో 30.56 శాతం వృద్ధితో అదరగొట్టింది. హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా అగ్రస్థానాల్లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి.

ఇండియాలోని టాప్ 10 టూ-వీలర్ మోడళ్లు ఫిబ్రవరి 2026 నెలలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేశాయి. మొత్తం 12,52,889 యూనిట్ల విక్రయాలతో గతేడాది ఫిబ్రవరి (9,59,598 యూనిట్లు) తో పోలిస్తే 30.56 శాతం వృద్ధి సాధించాయి. కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లకు పెరిగిన డిమాండ్ ఈ గ్రోత్‌కు ప్రధాన కారణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు పెరగడం, సులభమైన ఫైనాన్స్ ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో వాహన రంగం జోరు మీదుంది.

మళ్ళీ స్ప్లెండర్, యాక్టివాలదే పైచేయి
హీరో స్ప్లెండర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన వాహనంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఫిబ్రవరిలో ఏకంగా 3,21,952 యూనిట్ల అమ్మకాలతో 54.96 శాతం భారీ వార్షిక వృద్ధిని కనబరిచింది. హోండా యాక్టివా 2,54,449 యూనిట్ల సేల్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఆటోమేటిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో యాక్టివాకు తిరుగులేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెటూర్లలో కూడా ఈ స్కూటర్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హోండా షైన్ 1,71,360 యూనిట్లతో మూడో స్థానంలో ఉండగా, టీవీఎస్ జూపిటర్ 1,27,089 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. స్పోర్టీ లుక్ ఇష్టపడే వారి ఛాయిస్ అయిన బజాజ్ పల్సర్ సిరీస్ 1,11,617 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచింది.

మిడ్-సెగ్మెంట్ మోడళ్ల జోరు
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 71,717 యూనిట్ల సేల్స్ నమోదు చేయగా, ప్రీమియం స్కూటర్ ఆప్షన్ అయిన సుజుకి యాక్సెస్ 70,137 యూనిట్ల అమ్మకాలతో తన పట్టును నిరూపించుకుంది. టీవీఎస్ అపాచీ 45,166 యూనిట్లతో 19 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు టీవీఎస్ ఎక్స్ఎల్ (XL) మోపెడ్ అమ్మకాలు 34.32 శాతం పెరిగి 45,095 యూనిట్లకు చేరుకోవడం విశేషం. ఇది గ్రామీణ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. చివరగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ 34,307 యూనిట్ల విక్రయాలతో టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకుంది. మిడ్-సైజ్ బైక్ సెగ్మెంట్‌లో దీని పర్ఫార్మెన్స్ స్థిరంగా కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే, వాహనదారుల అవసరాలకు తగ్గట్లుగా కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడం, మెరుగైన సేవలందించడం వల్ల టూ-వీలర్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది.

 

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget