అన్వేషించండి

Hyundai Creta CVT vs Honda Elevate CVT - స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే SUV ఏది?

హ్యుందాయ్‌ క్రెటా CVT, హోండా ఎలివేట్‌ CVT మధ్య వాస్తవ ప్రపంచ పెర్ఫార్మెన్స్‌ టెస్టుల్లో ఏ SUV బెస్ట్‌గా నిలిచింది?. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్‌, స్పెక్స్‌ వివరాలతో పూర్తి పోలిక.

Hyundai Creta Vs Honda Elevate Performance Comparison: మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో పెట్రోలు-CVT ఆప్షన్‌ కోరుకునే వాళ్లకు హ్యుందాయ్‌ క్రెటా, హోండా ఎలివేట్‌ రెండూ చాలా పాపులర్‌ ఆప్షన్లు. ఈ రెండు SUVల్లోనూ 1.5 లీటర్ల నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోలు ఇంజిన్‌, CVT ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులో ఉంది. అయితే... వీటి పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంటుంది?, ఏది రోడ్డుపై వేగంగా పికప్‌ తీసుకుంటుంది?, ఏ కారుది పవర్‌ఫుల్‌ రెస్పాన్స్‌? అన్నది చాలా మందికి డౌట్‌. ఆ సందేహాలన్నింటికీ క్లియర్‌ ఆన్సర్‌ ఈ రిపోర్ట్‌.

స్పెసిఫికేషన్స్‌ - కాగితంపై చూస్తే ఏ SUVది పైచేయి?

పేపర్‌పై చూస్తే, హోండా ఎలివేట్‌ CVT కొంచెం ముందంజలో నిలుస్తుంది. ఎందుకంటే: ఎలివేట్‌ 1.5 లీటర్‌ ఇంజిన్‌ క్రెటాతో పోలిస్తే 6 PS ఎక్కువ పవర్, 1 Nm ఎక్కువ టార్క్ ఇస్తుంది. హోండా ఎలివేట్‌ బరువు కూడా హ్యుందాయ్‌ క్రెటా కంటే 24 kg తక్కువ. అంటే... పవర్‌-టు-వెయిట్‌, టార్క్‌-టు-వెయిట్‌ రేషియోలో హోండా ఎలివేట్‌ బెస్ట్‌. ధర విషయంలో కూడా ఎలివేట్‌ CVT వెర్షన్స్‌ క్రెటా కంటే తక్కువగా మొదలవుతాయి. కానీ ఫీచర్ల పరంగా క్రెటా టాప్‌ మోడల్స్‌లో ఎక్కువ ఆప్షన్స్‌ లభిస్తాయి.

0-100 కి.మీ./గంట యాక్సిలరేషన్‌ - ఎలివేట్‌ ముందడుగు

GPS ఆధారితంగా ఆటోమొబైల్‌ ఎక్స్‌పర్ట్స్‌ చేసిన పెర్ఫార్మెన్స్‌ టెస్టుల్లో, మొదటి నుంచీ హోండా ఎలివేట్‌ ముందంజలో ఉంది.

  • 0-60 కి.మీ. వేగం: క్రెటా కంటే ఎలివేట్‌ 0.68 సెకన్ల ముందు
  • 0-100 కి.మీ. వేగం: క్రెటాతో పోలిస్తే ఎలివేట్‌ 1.84 సెకన్లు వేగం
  • 0-120 కి.మీ. వేగం: ఎలివేట్‌ క్రెటా కంటే 2.83 సెకన్ల ముందుంది
  • డ్రైవింగ్‌ రెస్పాన్స్‌లో కూడా హ్యుందాయ్‌ క్రెటా కంటే హోండా ఎలివేట్‌ కాస్త షార్ప్‌గా, పవర్‌ఫుల్‌గా అనిపించింది.

రోలింగ్‌ యాక్సిలరేషన్‌ - ఓవర్‌టేక్‌ సమయంలో ఏది బెటర్‌?

సిటీ ట్రాఫిక్‌లో ఓవర్‌టేక్‌ చేసేప్పుడు 20-80 కి.మీ. స్పీడ్‌లో లేదా హైవేపై ఓవర్‌టేక్‌ చేసేప్పుడు 40-100 కి.మీ. స్పీడ్‌లో SUV ఎలా స్పందిస్తుందో చాలా ముఖ్యం.

  • ఇక్కడ కూడా ఎలివేట్‌ డామినేట్‌ చేసింది. 
  • 20-80 కి.మీ. వేగంలో ఎలివేట్‌ 0.77 సెకన్లు వేగంగా దూసుకెళ్లింది. 
  • 40-100 కి.మీ. వేగంలోనూ ఎలివేట్‌ 1.12 సెకన్లు వేగంగా ఉంది.

అంటే లో-మిడ్‌ రేంజ్‌లో ఎలివేట్‌ కాస్త చురుకుగా ఉండే ఇంప్రెషన్‌ ఇస్తుంది. క్రెటా CVT లీనియర్‌గా & స్మూత్‌గా ఉన్నప్పటికీ, వేగం పెరగడంలో ఎలివేట్‌ అంతకన్నా ముందుంది.

బ్రేకింగ్‌ టెస్ట్‌ - 80-0 కి.మీ. వేగంలో ఏది త్వరగా ఆగింది?

పానిక్‌ బ్రేకింగ్‌ పరిస్థితులను సిమ్యులేట్‌ చేస్తూ చేసిన టెస్టుల్లో కూడా ఎలివేట్‌ గెలుపొందింది. 80-0 కి.మీ. వేగంలో క్రెటా కంటే 1.93 సెకన్లు త్వరగా ఆగింది, 3.45 మీటర్లు తక్కువ దూరంలోనే ఈ SUV నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం తక్కువ బరువుతో వచ్చే స్టెబిలిటీ.

రియల్‌ వరల్డ్‌లో బెస్ట్‌ పెర్ఫార్మర్‌ ఏది?

స్పెసిఫికేషన్స్‌, యాక్సిలరేషన్‌, రోలింగ్‌ పనితీరు, బ్రేకింగ్‌ - నాలుగు అంశాల్లోను హోండా ఎలివేట్‌ స్పష్టంగా ముందంజలో ఉంది. అయితే... బెస్ట్‌ ఫీచర్లు కావాలంటే హ్యుందాయ్‌ క్రెటా తీసుకోవాలి, పెర్ఫార్మెన్స్‌ కావాలంటే హోండా ఎలివేట్‌ ఎంపిక చేసుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget