Hyundai Creta: అమ్మకాల్లో దూసుకుపోతున్న హ్యుందాయ్ క్రెటా - హైదరాబాద్/విజయవాడలో ధర ఇదీ
Hyundai Creta Sales Report: హ్యుందాయ్ క్రెటా మూడు వేర్వేరు ఇంజిన్ ఎంపికల్లో లభిస్తుంది, కస్టమర్ తన అవసరాలకు అనుగుణంగా సరైన వేరియంట్‌ను ఎంపికను ఎంచుకోవచ్చు.

Hyundai Creta Sales Report June 2025: గత నెలలో (జూన్ 2025), ఇండియన్ ఆటో మార్కెట్‌లో కాస్త హుషారు కనిపించింది & కార్ల అమ్మకాలు బాగున్నాయి. జూన్ 2025 సేల్స్‌లో హ్యుందాయ్ క్రెటా అదరగొట్టింది, అత్యధికంగా అమ్ముడైన కారుగా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. వాస్తవానికి, క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఫోర్‌వీలర్ అమ్మకాలు ఈసారి స్వల్పంగా తగ్గినప్పటికీ ఈ SUV మొదటి స్థానాన్ని మాత్రం వదులుకోలేదు.
2025 జూన్ నెలలో మొత్తం 15,786 క్రెటా యూనిట్లు అమ్ముడయ్యాయి. రోజుకు సగటున 526 మంది కొత్త కస్టమర్లు క్రెటాకు ఓనర్లు అయ్యారు. అయితే, ఏడాది క్రితం, జూన్ 2024లో అమ్ముడైన మొత్తం 16,293 యూనిట్లతో పోలిస్తే ఈసారి అమ్మకాలలో 3 శాతం స్వల్ప తగ్గుదల కనిపిచింది.
హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు (Hyundai Creta Features)
హ్యుందాయ్ క్రెటాను ప్రీమియం SUVగా నిరూపించే చాలా అధునాతన ఫీచర్లు దీనిలో ఉన్నాయి.
క్రెటాలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి, ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తాయి.
ఇంకా చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు సౌకర్యవంతమైన క్యాబిన్‌ను ఇవ్వడంతో పాటు, కారును స్మార్ట్ SUVగా మార్చాయి.
హ్యుందాయ్ క్రెటా భద్రత (Hyundai Creta Safety Features)
హ్యుందాయ్ క్రెటా 2024 మోడల్ భద్రత పరంగా చాలా బలంగా ఉంటుంది.
ఈ కారులో 70కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి, ఫలితంగా ఇది ఈ విభాగంలో అత్యంత సురక్షితమైన SUVలలో ఒకటిగా నిలిచింది.
ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చారు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇవి ప్రయాణీకుల ప్రాణాలకు రక్షణ కవచంలా పని చేస్తాయి.
క్రెటాలో అమర్చిన 360-డిగ్రీల కెమెరా డ్రైవర్‌కు మరింత మెరుగైన విజిబులిటీని అందిస్తుంది & ఎలాంటి ప్రదేశంలోనైనా పార్కింగ్‌ను సులభంగా మారుస్తుంది.
హ్యుందాయ్ క్రెటా పవర్‌ట్రెయిన్ & ఇంజిన్ ఎంపికలు (Hyundai Creta Engine Options)
హ్యుందాయ్ క్రెటాను మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో రూపొందించారు.
మొదటిది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 115bhp పవర్ & 144Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
రెండోది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 160bhp శక్తిని & 253Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది, మరింత శక్తిమంతమైన పనితీరును ఇస్తుంది.
మూడోది ఎంపిక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, ఇది 116bhp పవర్‌ను & 250Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
హ్యుందాయ్ క్రెటాలోని అన్ని ఇంజిన్లు మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో యాడ్ అయి ఉంటాయి, కస్టమర్‌లు తమ డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా సరైన దానిని ఎంచుకోవడానికి వీలుంటుంది.
హైదరాబాద్/విజయవాడలో హ్యుందాయ్ క్రెటా ధర (Hyundai Creta Price in Hyderabad/Vijayawada)
హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర 11,10,900 రూపాయలు. హైదరాబాద్, విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలో ఈ కారును రూ. 13.77 లక్షల నుంచి రూ. 25.41 లక్షల ఆన్-రోడ్ ధరకు (Hyundai Creta on-road price) కొనుగోలు చేయవచ్చు.





















