అన్వేషించండి

Hyundai Creta N Line: హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లాంచ్ త్వరలోనే - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?

Hyundai Creta New: హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌లో కొత్త వేరియంట్ త్వరలో లాంచ్ కానుంది.

Upcoming Hyundai Creta N Line: హ్యుందాయ్ కొత్త క్రెటా తదుపరి వెర్షన్‌ని సిద్ధం చేస్తుంది. ఇందులో క్రెటా ఎన్ లైన్ కూడా ఉంది. త్వరలో క్రెటాలో కూడా ఎన్ సిరీస్ కారు త్వరలో లాంచ్ కానుంది. క్రెటా కారు ఎన్ లైన్... ఐ20 ఎన్ లైన్ కంటే కాస్త హయ్యర్ రేంజ్‌లో రానుంది.

ఇటీవల లాంచ్ అయిన కొత్త క్రెటా ఎన్ లైన్ ఆధారంగా ఇందులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయనున్నారు. క్రెటా ఎన్ లైన్ కొత్త బంపర్ ఎక్స్‌టెన్షన్‌లు, సైడ్ స్కర్ట్‌లు, పెద్ద రియర్ స్పాయిలర్, రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన కొత్త 18 అంగుళాల వీల్స్‌తో స్టాండర్డ్ క్రెటా కంటే స్పోర్టివ్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

ఇతర ఎన్ లైన్ మోడళ్ల లాగానే ప్రత్యేక బ్లూ కలర్ క్రెటా ఎన్ లైన్‌లో కూడా కనిపిస్తుంది. వెనుక భాగంలో పెద్ద స్పాయిలర్, ప్రొట్రూడింగ్ ఎగ్జాస్ట్ సహా ఇంకెన్నో చూడవచ్చు. క్యాబిన్ గురించి చెప్పాలంటే స్టీరింగ్ వీల్ డిజైన్ స్టాండర్డ్ క్రెటాలోని డీ-కట్ స్టీరింగ్ వీల్‌కు భిన్నంగా ఉంటుంది. క్యాబిన్ పూర్తిగా నలుపు రంగుతో వస్తుంది. అలాగే లోపలి భాగంలో ఎరుపు రంగు స్ప్లాష్‌లు ఉపయోగించారు.

1.5 లీటర్ టర్బో పెట్రోల్‌ ఇంజిన్ ఇందులో అందించనున్నారు. కానీ డీసీటీ ఆటోమేటిక్‌తో పాటు ప్రాపర్ మాన్యువల్ వెర్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త స్టాండర్డ్ క్రెటాలో టర్బో పెట్రోల్‌ మాన్యువల్ అందుబాటులో లేదు. ఈ టర్బో పెట్రోల్‌తో పాటు కొత్త క్రెటా ఎన్ లైన్ కూడా స్టిఫర్ సస్పెన్షన్, లౌడ్ ఎగ్జాస్ట్, ట్యూన్డ్ స్టీరింగ్ వీల్, మోర్ మొబిలిటీని పొందుతుంది.

కొత్త క్రెటా ఎన్ లైన్ ఈ ఏడాది మార్చిలో వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌కు ప్రస్తుతం కాంపిటీటివ్ కార్లు కూడా పెద్దగా లేవు. అయితే టైగన్ డీఎస్‌జీ జీటీ లైన్ పనితీరు పరంగా కొంత వరకు ఇక్కడ పోటీపడుతుంది. ఇందులో డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో కూడిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది.

మరోవైపు చైనీస్ కార్ల కంపెనీ బీవైడీ భారత దేశ మార్కెట్లో కొత్త చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీవైడీ ఆట్టో 2ని లాంచ్ చేయనుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2023 చివరిలో లాంచ్ కావడానికి ముందు చైనీస్ హోమోలోగేషన్ ఫైలింగ్‌లో కనిపించింది. ఆట్టో 2 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గ్లోబల్ మార్కెట్‌లో జీప్ అవెంజర్, హ్యుందాయ్ కోనా ఈవీ వంటి కార్లతో పోటీపడనుంది. బీవైడీ ఆట్టో  2 చైనాలో యువాన్ అప్ పేరుతో అందుబాటులో ఉంది. ఎందుకంటే ఆట్టో 3కి చైనా దేశంలో యువాన్ ప్లస్ అని పేరు పెట్టారు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో, కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీవైడీ కొత్త మూడో తరం ఈ-ప్లాట్‌ఫాం 3.0 ఎలక్ట్రిక్ కారు ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ లైనప్‌లో డాల్ఫిన్ హ్యాచ్‌బ్యాక్, ఆట్టో 3 క్రాస్‌ఓవర్ మధ్య ఉండనుంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget