అన్వేషించండి

హ్యుందాయ్ వెర్నాపై భారీ డిస్కౌంట్లు: రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!

సెడాన్ మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ వెర్నా పాత మోడల్‌పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. మరోవైపు కొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్ అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయ్యింది.

సెడాన్ కార్ల ప్రపంచంలో  తిరుగులేని ఇమేజ్ ఉన్న హ్యుందాయ్ వెర్నా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారుకు ఇటీవల మిడ్-సైకిల్ అప్‌డేట్ లభించినప్పటికీ, ప్రస్తుతం పాత మోడల్ (Pre-facelift) పై లభిస్తున్న భారీ డిస్కౌంట్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే వెర్నాపై ఈ నెలలో లభిస్తున్న ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

పాత మోడల్‌పై భారీ ఆఫర్లు
హ్యుందాయ్ డీలర్లు పాత వెర్నా స్టాక్‌పై రూ. 40,000 వరకు నగదు తగ్గింపును అందిస్తున్నారు. దీనికి తోడు రూ. 45,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. మీరు మీ పాత కారును ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే అదనంగా రూ. 10,000 తగ్గుతుంది. ఇప్పటికే హ్యుందాయ్ కారు వాడుతున్న వారు వెర్నాకు అప్‌గ్రేడ్ అయితే మరో రూ. 15,000 బోనస్ లభిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా కలుపుకుంటే మొత్తం ప్రయోజనాలు రూ. 1 లక్షకు చేరువ అవుతున్నాయి. తక్కువ ధరలో పవర్‌ఫుల్ ఇంజిన్, క్లాసీ లుక్ ఉన్న సెడాన్ కావాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అన‌డంలో సందేహం లేదు.

2026 హ్యుందాయ్ వెర్నాలో కొత్తగా ఏముంది?
కొత్తగా వచ్చిన 2026 వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా చాలా మార్పులు జరిగాయి. బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, డ్యూయల్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్లు కారుకు అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. కారు లోపల కొత్తగా డి-కట్ (D-cut) స్టీరింగ్ వీల్ అమర్చారు. డ్రైవర్ సీటుకు 8-వే ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్, మెమరీ ఫంక్షన్ వంటి సౌకర్యాలు వచ్చాయి.

సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు
ఈ విభాగంలోనే మొదటిసారిగా వెనుక విండో సన్‌షేడ్, ప్యాసింజర్ సీట్ వాక్-ఇన్ డివైజ్, 528 లీటర్ల కెపాసిటీ ఉన్న స్మార్ట్ ట్రంక్ వంటి ఫీచర్లను హ్యుందాయ్ పరిచయం చేసింది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో 10.25 అంగుళాల ఇంటిగ్రేటెడ్ స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సదుపాయం కల్పించారు. ఇంజిన్ పరంగా చూస్తే 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఆప్షన్లు అలాగే ఉన్నాయి. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ (IVT), 7-స్పీడ్ డీసీటీ (DCT) గేర్‌బాక్స్‌లతో లభిస్తాయి. కొత్త ఫీచర్లు కావాలనుకునే వారు 2026 మోడల్‌ను, బడ్జెట్‌లో మంచి డీల్ కావాలనుకునే వారు పాత మోడల్‌ను ఎంచుకోవచ్చు.

 

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget