Maruti Alto K10: మారుతి ఆల్టో K10 మీద రూ.67,000 పైగా డిస్కౌంట్, ఎలా పొందాలంటే?
Maruti Alto K10 on Discount: మారుతి ఆల్టో K10 మీద ఈ నెలలో రూ. 67,100 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కారు ఎక్స్ షోరూమ్ రేటు రూ.4 లక్షల 23 వేల నుంచి స్టార్ట్ అవుతుంది.

Discount On Maruti Alto K10 In May 2025: మారుతి సుజుకి ఇటీవల తన కార్‌ల రేట్లు పెంచింది. అయితే, ఈ కంపెనీ ఈ నెలలో భారీ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్‌ను ఉపయోగించుకుంటే, దేశంలో అత్యంత చవకైన కార్లలో ఒకటైన మారుతి ఆల్టో K10 రేటు రూ.67,100 వరకు తగ్గుతుంది. ఈ ఆఫర్ ఆటోమేటిక్ వెర్షన్/ఆటో గేర్ షిఫ్ట్ (AGS) వెర్షన్‌కు వర్తిస్తుంది.
ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ & స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలు అందిస్తారు. డీలర్‌షిప్‌ను బట్టి వివిధ నగరాల్లో ఈ డిస్కౌంట్ కొద్దిగా మారవచ్చు. డిస్కౌంట్‌కు సంబంధించిన సమాచారాన్ని వివిధ ఆటోమొబైల్ వెబ్‌సైట్‌లు & ప్లాట్‌ఫామ్‌ల నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి, కొనుగోలు చేసే ముందు డీలర్ నుంచి పూర్తి సమాచారం పొందండి. ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర (Maruti Alto K10 Ex-showroom price) రూ.4.23 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
ఆల్టో K10 ఇంజిన్ & మైలేజ్
కొత్త & బలమైన హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై మారుతి ఆల్టో K10 రూపొందింది. K-సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్ & డ్యూయల్ VVT ఇంజిన్ ఈ కార్‌కు పవర్ అందిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 66.62 PS పవర్ & 89 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. కంపెనీ వెల్లడించిన ప్రకారం, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 24.90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది & మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.39 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. CNG వేరియంట్ కిలోకు 33.85 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మారుతి వెల్లడించింది.
మారుతి ఆల్టో K10 టెక్నికల్ ఫీచర్లు
మారుతి ఆల్టో K10లో చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కనిపిస్తాయి, అవి ఈ కారును గతంలో కంటే స్మార్ట్‌గా & సేఫ్‌గా మార్చాయి. ఈ బండిలో ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్‌లు అమర్చారు. క్యాబిన్‌లో 7-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా.. USB, బ్లూటూత్ & AUX వంటి ఇన్‌పుట్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్‌తో ఉన్న మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ డ్రైవింగ్‌ను మరింత ఈజీగా మారుస్తుంది. ఈ ఫీచర్లన్నీ గతంలో ఎస్-ప్రెస్సో, సెలెరియో & వ్యాగన్R వంటి కార్లలోనే కనిపించాయి, ఇప్పుడు ఆల్టో K10లోనూ అందుబాటులో ఉన్నాయి.
మారుతి ఆల్టో K10 సేఫ్టీ ఫీచర్లు
మారుతి ఆల్టో K10లో, ప్రయాణీకుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) & ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఫీచర్లతో ఈ చవకైన కారును ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ఇంకా.. రివర్స్ పార్కింగ్ సెన్సార్, ప్రీ-టెన్షనర్ & ఫోర్స్ లిమిటర్ సీట్ బెల్టులు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ & స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్లను కూడా చేర్చారు.
కలర్ ఆప్షన్లు & డిస్కౌంట్లు
మారుతి ఆల్టో K10ను 6 ఆకర్షణీయమైన రంగుల్లో - స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్, సిజ్లింగ్ రెడ్, సిల్కీ వైట్, సాలిడ్ వైట్ & గ్రానైట్ గ్రే - విడుదల చేశారు, వీటిలో మీకు ఇష్టమైన కలర్ ఎంచుకోవచ్చు.





















