అన్వేషించండి

Car Battery Dead Tips: బ్యాటరీ డెడ్ అయినప్పుడు మీ కారును ఎలా స్టార్ట్ చేయాలి? డ్రైవర్లకు ఉపయోగపడే సులభమైన చిట్కాలు

Jump Start Car Guide: కారు బ్యాటరీ డెడ్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. జంప్ స్టార్ట్‌ నుంచి పుష్ స్టార్ట్‌ వరకు ఈ సులభమైన చిట్కాలు క్లిష్ట సమయాల్లో మీకు సహాయపడతాయి.

How To Start Car With Dead Battery: ఉదయం ఆఫీస్‌కి బయల్దేరబోతున్నప్పుడు లేదా ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు లేదా ఎప్పుడైనా జోరుగా కురుస్తున్న వర్షంలో ఒక్కసారిగా కారు ఆగిపోయి, తిరిగి స్టార్ట్ కాకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఎక్కువగా, దీనికి కారణం కారు బ్యాటరీ డెడ్/డౌన్‌ కావడమే. చాలా మంది డ్రైవర్లు ఇలాంటి పరిస్థితుల్లో టెన్షన్‌ పడతారు. కానీ, నిజానికి టెన్షన్‌ అవసరం లేదు. కారు బ్యాటరీ డెడ్‌ అయినప్పటికీ, కొన్ని సింపుల్‌ చిట్కాలు తెలుసుకుంటే, మీరు ఎప్పుడైనా మీ కారును తిరిగి స్టార్ట్ చేయవచ్చు.

జంప్ స్టార్ట్ - ఇది చాలా సులభమైన పరిష్కారం

బ్యాటరీ డెడ్ అయ్యినప్పుడు ఎక్కువగా వాడే పద్ధతి జంప్ స్టార్ట్‌. దీనికోసం, మీ దగ్గర జంపర్‌ కేబుల్స్‌ ఉండాలి. మీకు దగ్గరలో మరొక కార్‌ నుంచి సహాయం లభిస్తే చాలు, రెండు కార్ల బ్యాటరీలను సరిగ్గా కనెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే మీ కారు మళ్లీ రన్నింగ్‌లోకి వస్తుంది. డ్రైవర్లు ఎప్పుడూ తమ వాహనంలో జంపర్‌ కేబుల్స్‌ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.

పుష్ స్టార్ట్ - మాన్యువల్ కార్లకు మాత్రమే, గుర్తుంచుకోండి

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఉన్న కార్లకు పుష్ స్టార్ట్ మంచి ఆప్షన్‌. మీ కారును రెండో (2nd) గేర్‌లో పెట్టి, కొంతమందితో ముందుకు నెట్టించాలి. కారు కొద్దిుపాటి వేగంతో ముందుకు కదులుతున్నప్పుడు ఒక్కసారిగా క్లచ్‌ వదిలేస్తే ఇంజిన్‌ ఫైర్‌ అవుతుంది. ఎమర్జెన్సీ సిట్యుయేషన్లలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

పోర్టబుల్ జంప్ స్టార్టర్‌తో ఉపయోగం

ఇప్పుడున్న టెక్నాలజీతో, మార్కెట్లో చిన్న పోర్టబుల్ జంప్ స్టార్టర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మీ దగ్గర ఉంటే, మీరు ఏ పరిస్థితిలోనైనా, ఎవరి సాయం లేకుండా కారును స్టార్ట్‌ చేయవచ్చు. పోర్టబుల్ జంప్ స్టార్టర్స్, మొబైల్‌ ఫోన్‌ పవర్‌ బ్యాంక్‌ మాదిరిగానే పని చేస్తాయి. వీటిని ఒకసారి చార్జ్‌ చేసి మీ కారులో పెట్టుకుంటే, మీ కారును ఏ సమయంలోనైనా స్టార్ట్ చేయగలవు. తరచూ ఎక్కువ డ్రైవ్ చేసేవాళ్లు, దూర ప్రయాణాలు చేసేవాళ్లు ఒక పోర్టబుల్ స్టార్టర్ తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలి.

హెడ్‌లైట్స్‌, మ్యూజిక్ సిస్టమ్‌ ఆఫ్ చేయాలి
బ్యాటరీ వీక్‌గా ఉందనిపించినప్పుడు, కారును స్టార్ట్ చేయడానికి ముందు హెడ్‌లైట్స్‌, మ్యూజిక్ సిస్టమ్‌, ఎయిర్ కండిషనర్‌ వంటి అన్ని ఎలక్ట్రికల్‌ లోడ్స్‌ ఆఫ్‌ చేయాలి. ఇలా చేస్తే మొత్తం పవర్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ చేయడానికి వెళ్తుంది.

బ్యాటరీ మెయింటెనెన్స్ తప్పనిసరి
బ్యాటరీ డెడ్ అవ్వకుండా ఉండటానికి రెగ్యులర్‌ మెయింటెనెన్స్‌ చాలా ముఖ్యం. కనీసం ఆరు నెలలకు ఒకసారి బ్యాటరీ కండీషన్‌ చెక్ చేయించుకోవాలి. టెర్మినల్స్‌ దగ్గర రస్ట్‌ లేదా డస్ట్‌ ఉంటే, వాటిని శుభ్రం చేయాలి. అలాగే, లాంగ్ డ్రైవ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బ్యాటరీని సర్వీస్ సెంటర్‌లో చెక్ చేయించుకోవడం మంచిది.

ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి
లాంగ్ ట్రిప్స్‌కి వెళ్తే జంపర్‌ కేబుల్స్‌, పోర్టబుల్ స్టార్టర్, టార్చ్‌లైట్, స్పానర్లు, స్క్రూడ్రైవర్‌ వంటి బేసిక్ టూల్స్‌ కారులో పెట్టుకోవాలి. ఇంకా, జాకీ, స్పేర్‌ టైర్‌ కూడా మీ దగ్గర ఉంటే ఎప్పుడు, ఎక్కడా ఇబ్బంది రాకుండా మీరు సేఫ్‌గా డ్రైవ్ చేయవచ్చు.

బ్యాటరీ డెడ్ అయ్యినప్పుడు టెన్షన్‌ అవసరం లేదు. సింపుల్‌ చిట్కాలతో, సరిగ్గా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే, మీ కారు మళ్లీ సులభంగా రోడ్డుపై పరుగులు పెడుతుంది. డ్రైవింగ్‌లో సేఫ్టీ ఎంత ముఖ్యమో, వాహన మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి.

టాప్ హెడ్ లైన్స్

స్పోర్టీ లుక్‌తో వచ్చిన ఏప్రిలియా SXR GT 175 మ్యాక్సీ స్కూటర్.. ఇంజిన్‌, ఫీచర్లు, సౌకర్యం ఎలా ఉన్నాయి?
Aprilia SXR GT 175 ఫుల్‌ రివ్యూ.. ఈ బండిని కొనొచ్చా? ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
39hp పవర్.. ట్విన్ సిలిండర్ ఇంజిన్.. కేటీఎం డ్యూక్‌కు పోటీ.. Kawasaki Z300 గురించి ఇంకా మీకేం తెలుసు?
యూత్‌ఫుల్‌ బైక్‌ కవాసాకి Z300 గురించి 5 కీలక విషయాలు.. కొనే ముందే మీకివి తెలియాలి!
Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
Embed widget