Honda Shine Price: Honda Shine కొనాలనుకుంటున్నారా? రూ.8 వేలతో బైక్ మీ సొంతం! EMI, లోన్ వివరాలు తెలుసుకోండి
Honda Shine on EMI: ఈ హోండా బైక్ కొనడానికి, మీరు దాదాపు లక్ష రూపాయల రుణం పొందవచ్చు. అయితే, బ్యాంకు మంజూరు చేసే రుణ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.

Honda Shine Price, Down Payment, Loan and EMI Details: భారతీ మార్కెట్లో బాగా అమ్ముడవుతున్న బైకుల్లో హోండా షైన్ ఒకటి. ఇది అటు కుర్రకారుకి, ఇటు ఫ్యామిలీలకు సరిగ్గా సరిపోయేలా ఈ బండిని డిజైన్ చేశారు. పైగా, ధర అందుబాటులో ఉంటుంది, అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. ఇన్ని చక్కటి లక్షణాల కారణంగా తెలుగు ప్రజలు హోండా షైన్‌ను ఇష్టపడుతున్నారు. హోండా కంపెనీ, గత నెలలో, ఈ పాపులర్ బైక్ ధరను రూ. 1,994 మేర పెంచింది. ఈ ధర పెరుగుదలకు కారణం బైక్‌లోని కొత్త అప్‌డేట్. ఈ మోటార్‌సైకిల్‌లో తాజా OBD-2B నిబంధనలను ప్రవేశపెట్టారు.
హోండా షైన్ కొత్త ధర ఎంత?
హోండా షైన్ రెండు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉంది - డ్రమ్ & డిస్క్. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధరను రూ. 1,242 పెంచారు, ఈ కారణంగా ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర (Honda Shine ex-showroom price) ఇప్పుడు రూ. 86,490 అయింది. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో, అన్ని టాక్సులు & ఖర్చులు కలుపుకుని, హోండా షైన్ డ్రమ్ వేరియంట్‌ను దాదాపు రూ. 1.08 లక్షల ఆన్-రోడ్ ధరకు (Honda Shine on-road price) కొనవచ్చు.
హోండా షైన్ డిస్క్ వేరియంట్ ధర రూ. 1,994 పెరిగింది, ఈ కారణంగా వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 91,241 కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో, అన్ని టాక్సులు & ఖర్చులు కలుపుకుని, హోండా షైన్ డిస్క్ వేరియంట్‌ను దాదాపు రూ. 1.13 లక్షల ఆన్-రోడ్ ధరకు కొనవచ్చు.
రూ.8 వేలకే హోండా షైన్!
మీరు, హోండా షైన్ డ్రమ్ - OBD 2B వెర్షన్ బైక్‌ను (ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1.08 లక్షలు) కొనడానికి మీరు దాదాపు లక్ష రూపాయల రుణం పొందవచ్చు. ముందుగా మీరు రూ. 8 వేలు డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. బ్యాంకు నుంచి వచ్చే రుణ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.
రూ. 8 వేలు డౌన్ పేమెంట్ చెల్లింపు తర్వాత బ్యాంక్ మీకు రూ. లక్ష లోన్ మంజూరు చేసిందని భావిద్దాం. ఈ లోన్‌పై బ్యాంక్ 9 శాతం వార్షిక వడ్డీని వసూలు చేస్తుందని అనుకుందాం. ఈ రుణం & వడ్డీ రేటు ప్రకారం మీరు ప్రతి నెలా EMI చెల్లిస్తే సరిపోతుంది. మీ మీద ఆర్థిక భారం పడకుండా, ముందే లెక్కలు వేసుకుని ఒక అనుకూలమైన EMI ఆప్షన్ ఎంచుకోవాలి.
హోండా షైన్ ఫైనాన్స్ ప్లాన్
1 సంవత్సరంలో లోన్ తిరిగి తీర్చేయాలనుకుంటే, రూ.లక్ష రూపాయల రుణానికి 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, మీరు నెలకు రూ. 8680 EMI చెల్లించాలి.
2 సంవత్సరాల్లో లోన్ మొత్తం రీపేమెంట్ చేసేలా ఆప్షన్ పెట్టుకోగలిగితే, మీరు నెలకు రూ. 4534 EMI చెల్లించాలి.
3 సంవత్సరాల్లో రుణం పూర్తిగా చెల్లించేలా కాల పరిమితి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 3156 EMI చెల్లించాలి.
4 సంవత్సరాల లోన్ టెన్యూర్‌ను ఎంచుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, మీరు నెలకు రూ. 2470 EMI చెల్లించాలి.
5 సంవత్సరాల కాల పరిమితి ఎంచుకుంటే, 9 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం, మీరు నెలకు రూ. 2060 EMI చెల్లించాలి.
మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు అనుకూలమైన EMI ఆప్షన్‌ను ఎంచుకోండి, పెద్దగా ఆర్థిక భారం లేకుండా హోండా షైన్‌ను ఇంటికి తెచ్చుకోండి.





















