By: ABP Desam | Updated at : 24 Feb 2023 05:20 PM (IST)
హోండా సిటీపై భారీ డిస్కౌంట్ అందించారు. ( Image Source : ABP Gallery )
Honda City Discount Offer: హోండా సిటీ సెడాన్ కొత్త ఫేస్ లిఫ్ట్ వచ్చే నెలలో మనదేశంలో లాంచ్ కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత వెర్షన్ మోడల్స్‌ను క్లియర్ చేయడానికి హోండా వీటిపై రూ.70 వేల వరకు లాభాలను అందించనుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ నెలలోనే ముగిసిపోతుంది.
హోండా సిటీని ఇప్పుడు కొనుగోలు చేయడం ద్వారా ఎంత మొత్తం సేవ్ అవుతుంది?
ప్రస్తుతం హోండా సిటీ సెడాన్ ఆఫర్ మాన్యువల్, సీవీటీ వెర్షన్స్‌పై కూడా అందుబాటులో ఉంది. అయితే సిటీ మాన్యువల్ ట్రిమ్‌పై మ్యాగ్జిమం బెనిఫిట్ అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం దీనిపై రూ.30 వేలు క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.32,493 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా అందించనున్నారు.
దీంతోపాటు రూ.20 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభించనుంది. రూ. ఎనిమిది వేలు కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ రూ. ఐదు వేలు కూడా అందుబాటులో ఉంది. సీవీటీ ట్రిమ్స్‌పై రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. దీనిపై రూ.21,643 విలువైన యాక్సెసరీస్ కూడా అందించనున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్లు అన్నీ ఫిబ్రవరి నెలాఖరు వరకే అందుబాటులో ఉండనున్నాయి.
2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్
మార్చి 2023 ప్రారంభంలో కొత్తగా అప్‌డేట్ అయిన హోండా సిటీ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం కోసం ఈ కారు మార్చి మొదటి వారంలో లాంచ్ కానుంది. దీని ఇమేజెస్ కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు. ఈ కారులో రీమాస్టర్డ్ గ్రిల్ సెక్షన్ ఉండనుందని లీకైన ఫొటోల గురించి చెప్పవచ్చు. దీంతోపాటు సన్నని క్రోమ్ బార్, కొత్త హనీ కాంబ్ ప్యాటర్న్ లభించనుంది. సిటీ సెడాన్ బ్లూ పెయింట్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉండనుంది.
హోండా సిటీ ఈ:హెచ్ఈవీ కూడా గతంలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది ఒక హైబ్రిడ్ కారు. ఈ కొత్త హైబ్రిడ్ సెడాన్ కారు మెరుగైన మైలేజ్, మంచి టెక్నాలజీని అందించనుంది. ఈ కారు ఎక్స్‌టీరియర్స్ చూడటానికి ఐదో తరం హోండా సిటీ తరహాలో ఉంది. అయితే ఇంతకు ముందు వచ్చిన వెర్షన్ల కంటే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కారు బయటవైపు బ్లాక్ కలర్ హైలెట్‌గా నిలిచింది. కారు ముందువైపు కొత్త తరహా గ్రిల్‌ను అంించారు. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ కూడా అందించారు. కారు వెనకవైపు ఈ:హెచ్ఈవీ హైబ్రిడ్ బ్యాడ్జ్‌ను అందించారు.
హోండా సిటీ ఈ:హెచ్ఈవీ క్యాబిన్‌లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్‌ను అందించారు. వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు ఎల్ఈడీ ఇంటీరియర్ రూం ల్యాంప్స్, యాంబియంట్ లైటింగ్‌ను కూడా ఇందులో అందించారు. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొత్త తరహా డిజైన్‌ను అందించారు. దీంతోపాటు హెచ్‌డీ డిస్‌ప్లే కూడా ఉండనుంది.
నోట్: ఇందులో పేర్కొన్న ఆఫర్లు, డిస్కౌంట్లు ఒక్కో లొకేషన్‌లో ఒక్కోలా ఉండవచ్చు. మరింత కచ్చితమైన సమాచారం కోసం స్థానిక హోండా డీలర్‌ను సంప్రదించగలరు.
Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?
Car Modification: కొత్త కారుకు యాక్సెసరీస్ ఇన్స్టాల్ చేస్తున్నారా - వీటిని చేస్తే వారంటీ పోతుంది జాగ్రత్త!
Price Hike on Two Wheelers: నాలుగు నెలల్లో రెండో సారి - ఏప్రిల్ నుంచి మళ్లీ పెరగనున్న హీరో బైక్స్ ధరలు!
Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!
Best Mileage Cars: రూ. 10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే - ఏకంగా 34 కిలోమీటర్ల వరకు!
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం